Actor Suhas Remuneration : యూట్యూబ్‌తో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే మరోవైపు హీరోగా నటించి విజయాలను అందుకున్నారు. ఆయన నేచురల్ యాక్టింగ్‌కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆయనకు ఇండస్ట్రీలో గిరాకీ పెరుగుతోంది. రీసెంట్గా ఆయన అంబాజీపేట మ్యారేజు మ్యారేజీబ్యాండు చిత్రంతో ప్రేక్షకుల మదిని మరోసారి దోచేశారు. ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయ
అయితే ఓ సినిమా హిట్ అవ్వగానే, లేదంటే తమకు సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతుంటే నటీనటులు రెమ్యునరేషన్ పెంచడం సహజమే. అలానే సుహాస్ కూడా రెమ్యునరేషన్ పెంచేశారని బయట టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రెస్ మీట్లో సుహాస్ పాల్గొన్నారు. అక్కడ ఆయనకు తన పారితోషికం గురించి ఓ ప్రశ్న ఎదురైంది. . రెమ్యునరేషన్ పెంచారు అంట కదా అని ఓ విలేకరి అడగారు. అవును మరి నేను బతకాలి కదా? జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను. రోజుకు రూ.100 తీసుకునేవాడిని అని అన్నారు. మళ్లీ అదే విలేకరి రూ.3000 నుంచి రూ.3 కోట్లు తీసుకునే స్థాయికి వచ్చారని తెలిసింది అని అనగా - హా అవును. రూ.1000 నుంచి రూ.3 కోట్లు తీసుకునే వరకు వచ్చాను. కానీ ఆ మూడు అనేది కేవలం నెంబర్ మాత్రమే అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది.
Actor Suhas Hit movies : కాగా సుహాస్ నటించిన తొలి సినిమా పడిపడి లేచె మనసు (2018). ఈ చిత్రంలో హీరో శర్వానంద్‌కు స్నేహితుడిగా నటించి మెప్పించి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మజిలీ, డియర్ కామ్రేడ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సహా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. కలర్ ఫొటోతో హీరోగా మారి ప్రశంసలను కూడా అందుకున్నారు. ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా దక్కింది. అనంతరం హిట్ 2లో సైకో విలన్‌గా, రైటర్ పద్మభూషణ్, అంబాజీపే మ్యారేజీబ్యాండులో హీరోగా నటించి వరుస హిట్లను అందుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మిల్క్ బ్యూటీకి కోపం వస్తే ఏం చేస్తుందంటే?
జాన్వీ ఆ విషయంలో అస్సలు కంట్రోల్ చేసుకోలేదట - ఈ సీక్రెట్ మీకు తెలుసా?