ETV Bharat / entertainment

ఫిల్మ్​ఫేర్​లో 'ఆర్​ఆర్​ఆర్' మేనియా - ఉత్తమ చిత్రంతో పాటు మరో ఏడు అవార్డులు - 68th Filmfare Awards

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 1:15 PM IST

Updated : Jul 12, 2024, 2:45 PM IST

68th Filmfare Awards : ప్రతిష్టాత్మక 68వ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ వేడుక తాజాగా గ్రాండ్​గా జరిగింది. ఇందులో సౌత్​ నుంచి ఆర్​ఆర్​ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది.

Filmfare Awards
Filmfare Awards (ETV Bharat)

68th Filmfare Awards : 2023 ఏడాదికిగానూ ప్రతిష్టాత్మక 68వ ఫిల్మ్​ఫేర్‌ అవార్డ్స్‌ వేడుక తాజాగా గ్రాండ్​గా జరిగింది. అందులో సౌత్​ నుంచి (తెలుగు) 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోగా, బెస్ట్ డైరెక్టర్​గా ఎస్‌.ఎస్‌.రాజమౌళి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అయితే ఉత్తమ నటుడిగా మాత్రం ఇద్దరు ఎంపికయ్యారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని తమ నటనకుగానూ జూనియర్ ఎన్​టీఆర్, రామ్‌చరణ్‌ను సంయుక్తంగా ఈ అవార్డు వరించింది.

'నాటు నాటు'కుగానూ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్​, కొమురం భీముడో సాంగ్ పాడినందుకు యంగ్ సింగర్ కాలభైరవ, అలాగే ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ లిస్ట్​లో 'ఆర్​ఆర్​ఆర్' అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో పాటు బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ చేసినందుకు సాబు శిరిల్​ను ఫిల్మ్​ఫేర్ వరించింది.

మరోవైపు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన క్లాసికల్ హిట్ 'సీతారామం' మూవీకి కూడా అవార్డుల పంట పండింది. ఉత్తమ నటడు క్రిటిక్స్, ఉత్తమ నటి క్రిటిక్స్​, ఉత్తమ చిత్రం క్రిటిక్స్ ఇలా ఈ మూవీ ఏకంగా ఐదు అవార్డులు దక్కించుకుంది.

ముఖ్యంగా 'కానున్న కల్యాణం' సాంగ్​కు చక్కటి సాహిత్యాన్ని అందించినందుకు దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రీకి అవార్డు వచ్చింది. ఇక పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్​', సాయిపల్లవి 'విరాటపర్వం' కూడా ఫిల్మ్​ఫేర్​లో పురస్కారాలు అందుకున్నాయి.

ఫిల్మ్‌ఫేర్‌-2023 విజేతలు వీళ్లే

  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) - సీతారామం (హను రాఘవపూడి)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) - దుల్కర్‌ సల్మాన్‌ (సీతారామం)
  • ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్‌ (సీతారామం)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌) -సాయి పల్లవి( విరాట్‌ పర్వం)
  • ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్‌)
  • ఉత్తమ సహాయ నటి - నందితా దాస్‌ (విరాట్‌ పర్వం)
  • ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - కాలభైరవ (కొమురం భీముడో- ఆర్‌ఆర్ఆర్‌)
  • ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)
  • ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ - ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్‌ రక్షిత్‌ (నాటు నాటు- ఆర్‌ఆర్ఆర్‌)
  • బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - సాబు శిరిల్‌ (ఆర్ఆర్‌ఆర్‌)

ఎన్టీఆర్‌ పురస్కారాలు- బేబీకి 2 అవార్డులు- మురళీ మోహన్​కు లైఫ్ ఎఛీవ్​మెంట్​!

న్యూయార్క్​లో 'హాయ్‌ నాన్న' సందడి - బెస్ట్ యాక్టర్​ సహా 11 అవార్డులు సొంతం - Hi Nanna Awards

Last Updated : Jul 12, 2024, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.