2024 Summer Release Tollywood Movies : సమ్మర్ హాలీడేస్ మరికొద్ది రోజులో ప్రారంభం కానుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా పండుగ ఇంకా మొదలుకాలేదు. ఓ పక్క ఐపీఎల్ జరుగుతుంటే మరో పక్క ఎలక్షన్స్ నడుస్తున్నాయి. దీంతో తమ సినిమాలను కాస్త టైమ్ తీసుకుని రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు బడా నిర్మాతలు. వాళ్ల సంగతి అలా ఉంటే, కాంపిటీషన్ లేని సమయంలో చిన్న సినిమాలైనా విడుదల చేసుకోవచ్చు కదా అని అనుకుంటే, ఆ సినిమాలకు మరో చిక్కు వచ్చింది. ఇటీవల ట్రెండ్‌గా మారిన రీ రిలీజ్ మేనియాతో మరి కొన్ని సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇప్పడు ఆ సెగ కాస్త చిన్న సినిమాలకు తాకుతోంది.
ఒకసారి హిట్ అయిన సినిమాలు మరోసారి థియేటర్ షోలకు రెడీ అయిపోతున్నాయి. ఈ వారం నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'జెర్సీ', శేఖర్ కమ్ముల డైరక్షన్‌లో వచ్చిన 'హ్యాపీ డేస్' మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఈ దెబ్బకు ఈ వారం రిలీజ్ కావాల్సిన ఐదు చిన్న సినిమాల భవితవ్యం ఎలా ఉండనుందో అంటూ సదురు మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు తమ రిలీజ్‌ను వాయిదా వేసుకోగా, మరి కొన్ని మాత్రం కంటెంట్ ఉంటే ఎటువంటి సమయంలోనైనా అయినా నిలబడొచ్చు, గెలవొచ్చు అనే ధీమాతో రిలీజ్‌కు సిద్ధమయ్యాయి.
'టెనెంట్', 'పారిజాత పర్వం', 'మార్కెట్ మహాలక్ష్మీ', 'తెప్ప సముద్రం', 'మారణాయుధం' సగటు ప్రేక్షకుడిని ఆకర్షించడానికి తపిస్తున్నాయి. 'పొలిమేర 2'తో సూపర్ హిట్ సాధించిన హీరో సత్యం రాజేశ్ ఇప్పుడు 'టెనెంట్'గా థియేటర్లలో రానున్నారు. ఈ సినిమాకు ప్రమోషన్ కూడా బాగానే చేస్తున్నారు. మరోవైపు '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు 'పారిజాత పర్వం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
అయితే చిన్న సినిమాలకు ఉన్న బెనిఫిట్ ఓటీటీలు. థియేటర్‌లు దొరక్కపోయినా, ఆడకపోయినా ఓటీటీలకు విక్రయిస్తే నిర్మాతలు ఒడ్డెక్కినట్లే. ఇక థియేటర్లో కూడా సక్సెస్ అయితే అది అదనపు బోనస్. కొన్ని సందర్భాల్లో కేవలం ఓటీటీల్లో మాత్రమే హిట్ అయిన సినిమాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి ఈ సారి చిన్న సినిమాల భవిత్వం ఎలా ఉండనుందో ?
'హ్యాపీడేస్' రీ రిలీజ్- సినిమాలో నటించిన హీరోకే తెలియదట! - Happy Days Re Release
నైజాం, ఆంధ్రాలో గ్రాండ్ రీరిలీజ్ - 'సమరసింహా రెడ్డి' గురించి ఈ విషయాలు తెలుసా ?