ETV Bharat / education-and-career

సాఫ్ట్​ స్కిల్స్​ పెంచుకోవాలా? - ఈ టిప్స్​ పాటిస్తే సక్సెస్​ మీదే!

Tips to Develop Soft Skills : ఈరోజుల్లో ఎదగాలంటే సాఫ్ట్​ స్కిల్స్​ చాలా అవసరం. ఉద్యోగం, వ్యక్తిగతం, ఆర్థికం.. ఏ విభాగంలోనైనా రాణించాలంటే ఇవి​ మెరుగ్గా ఉండాలి. కానీ.. చాలా మందిలో ఈ నైపుణ్యాలు లోపించడం వల్ల అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తే మీ సాఫ్ట్​ స్కిల్స్​ పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు!

Tips to Develop Soft Skills
Tips to Develop Soft Skills
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 10:05 AM IST

How to Develop Soft Skills: టీమ్ మేట్స్​తో కలిసి పని చేయడం.. కమ్యునికేషన్ చక్కగా ఉండడం.. టైమ్ మేనేజ్ మెంట్.. ప్రాబ్లమ్​ సాల్వింగ్ తోపాటు స్ట్రెస్ మేనేజ్ మెంట్.. డెసిషన్ మేకింగ్.. వంటివన్నీ సాఫ్ట్ స్కిల్స్​లో భాగమే. వ్యాపారాలు నిర్వహించే వారు కస్టమర్లతో ఎఫెక్టివ్​గా మాట్లాడాలి. ఉద్యోగస్తులు బాస్​లతో.. తమ పనితీరు గురించి క్లియర్​గా వివరించాల్సి ఉంటుంది. మీ టీమ్​ను నడిపించే లీడర్ షిప్ క్వాలిటీస్ మీకు చాలా అవసరం. ఈ నైపుణ్యాలు అన్ని రకాల ఉద్యోగాలు, కెరీర్‌లకూ ముఖ్యమే. అందుకే.. సాఫ్ట్​ స్కిల్స్​ అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యంగా మారాయి. మరి, వీటిని ఎలా అందిపుచ్చుకోవాలి? అంటే.. ఇందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి.

టార్గెట్ అర్థం చేసుకోవడం: సాఫ్ట్ స్కిల్స్​లో అత్యంత ముఖ్యమైనది కమ్యూనికేషన్. ఇతరులతో మాట్లాడేముందు వారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. తద్వారా దానికి అనుగుణంగా వారితో మాట్లాడాలి. అలాగని మనకు నచ్చిన భాషలో మాట్లాడటం చేయకూడదు.

ఐ కాంటాక్ట్​: ఈ సాఫ్ట్​ స్కిల్స్​లో ఇంపార్టెంట్​ అయినది ఐ-కాంటాక్ట్​. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారితో ఐ-కాంటాక్ట్​ మెయింటెన్​ చేయాలి. అప్పుడు మీరు చెప్పాలనుకున్నది లేదా మాట్లాడాలనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పగలుగుతారు.

దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

మాట్లాడటం ప్రాక్టీస్ : మీరు కాన్ఫిడెంట్ స్పీకర్ కాకపోతే.. ప్రాక్టీస్ చేయడం కంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు. పబ్లిక్ స్పీకింగ్ మీకు కష్టంగా అనిపించినా.. ప్రాక్టీస్​ చేస్తే పర్ఫెక్ట్​గా ఉంటుంది. అప్పటికీ మీకు కంఫర్ట్​ లేకపోతే.. మీ ఫ్రెండ్స్​ అండ్​ ఫ్యామిలతో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి.

రైటింగ్​ స్కిల్స్​: కేవలం స్పీచ్​ మాత్రమే ఇంపార్టెంట్​ కాదు. మీ రైటింగ్​ స్కిల్స్​ మెరుగుపరుచుకోవడం కూడా ముఖ్యం. మాట్లాడటం ప్రాక్టీస్​ చేసినట్లే.. మీరు మీ రైటింగ్​ను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అది మరింత సులభంగా, అందంగా వస్తుంది. అయితే.. మీరు మీ సొంతంగా రాయడం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే కమ్యూనిటీ సెంటర్లు, ఆన్‌లైన్‌లో కూడా వివిధ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. అందులో కూడా పార్టిసిపేట్​ చేయవచ్చు.

యాక్టివ్ లిజనింగ్ ప్రాక్టీస్: యాక్టివ్ లిజనింగ్ అనేది చాలా ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్. వినడానికి ఏకాగ్రత, సహనం, స్వీయ-క్రమశిక్షణ అవసరం. ఇతరులు ఏమి చెప్పారో అర్థం చేసుకోవడానికి పారాఫ్రేసింగ్, ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించండి. దీని ద్వారా మీకు ఆ సబ్జెక్ట్​పై ఆసక్తి ఉందని ఇతరులు భావిస్తారు. అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు.. అంతరాయం కలిగించకుండా చూడండి. ఆ తర్వాతే మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి.

ఉపాధికి దిక్సూచి ఈ కోర్సులు- పూర్తి చేస్తే రూ.లక్షల్లో జీతాలు!

సంబంధాలు ఏర్పరచుకోండి: జీవితంలో అన్ని రంగాల వ్యక్తులతో సంబంధాలు కీలకం. అయితే.. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఆఫీసు వంటి చోట్ల ఇది కాస్త కష్టంగా ఉంటుంది. మీరు దీన్ని మేనేజ్ చేయగలిగితే.. సహచరులు, ఉన్నతాధికారులతో మంచి రిలేషన్ ఏర్పరచుకోవచ్చు.

స్నేహపూర్వకంగా ఉండండి: పనిలో మీ రిలేషన్ బలోపేతం చేయడానికి.. మీ సహోద్యోగులతో ఫ్రెండ్లీగా ఉండటం అవసరం. వారిని పలకరించడం, బ్రేక్​ టైమ్​లో కలిసి కాఫీ తాగడం, కలిసి లంచ్​ చేయడం వల్ల ఫ్రెండ్షిప్​ డెవలప్​ అవుతుంది.

లీడింగ్ ప్రాక్టీస్: లీడర్​షిప్​ క్వాలిటీస్​ సాఫ్ట్​స్కిల్స్​లో మెయిన్​. మీ నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి.. మీ సూపర్‌వైజర్‌ను గమనించండి. వారు చేసే పనులను బాగా గమనించండి. తద్వారా మీరు ఏ విధంగా మీ లీడర్​షిప్​ క్వాలిటీస్​ను డెవలప్​ చేసుకోవచ్చో ఈజీగా అర్థమవుతుంది.

అసిస్టెంట్​ మేనేజర్​ ఉద్యోగాలు- లక్షా40వేలు జీతం!- పూర్తి వివరాలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.