ETV Bharat / education-and-career

ఇంజినీరింగ్‌లో చేరాలనుకుంటున్నారా?- ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి! - Engineering Counselling - ENGINEERING COUNSELLING

Engineering Counselling : ఈఏపీసెట్‌ పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదల కాగా, త్వరలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ జరగనుంది. కౌన్సెలింగ్​కు హాజరయ్యే విద్యార్థులు ముందుగా కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యలో కళాశాల ఎంపికే చాలా కీలకం. అందుకే బ్రాంచి వివరాలు పూర్తిగా తెలుసుకున్నాకే ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Engineering Counselling
Engineering Counselling (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 1:31 PM IST

Engineering Counselling : ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ముందుగానే విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పరిస్థితుల గురించి ప్రాథమిక సమాచారం సేకరించుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉన్నతస్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇంజినీరింగ్ అర్హతతో SAILలో 249 ఉద్యోగాలు - లక్షల్లో జీతం - అప్లై చేసుకోండిలా! - SAIL Recruitment 2024

గుర్తుంచుకోవాల్సిన అంశాలివీ..

  • విద్యార్థులకు కళాశాల ఎంపిక, బ్రాంచిపై అవగాహన తప్పనిసరి. చాలావరకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), సీఎస్‌ఈకి ప్రాధాన్యం ఇస్తుండగా ఆ తర్వాత ఐటీ, ఈసీఈ, ట్రిపుల్‌ఈ ఎంచుకుంటున్నారు.
  • కంప్యూటర్‌ సైన్స్‌ విషయంలో ఏఐ, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీస్‌, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • విద్యార్థులు తమకు ఏ రంగంపై ఆసక్తి ఉందో గమనించుకోవాలి. ఆ రంగానికి సంబంధించి భవిష్యత్​ ఉన్న బ్రాంచిపైనే దృష్టి సారించాలి. ఎవరో చెప్పారని, తోటి స్నేహితులు చేరారనో కళాశాలలు, బ్రాంచిలను ఎంచుకోవటం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆసక్తి లేకుండా ఆయా కోర్సుల్లో చేరితే వాటిని సకాలంలో పూర్తి చేయలేకపోవటమే కాకుండా సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంది.
  • కోర్సుల ఎంపికతో పాటు కళాశాలలో సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. కళాశాలలకు గుర్తింపు ఇచ్చే న్యాక్, అటానమస్, ఎన్‌బీఏ తదితర సర్టిఫికెట్లు ఉన్నాయో లేదో తల్లిదండ్రులు పరిశీలించాలి.
  • ఫ్యాకల్టీ అర్హత, ఉత్తీర్ణత శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
  • ఏ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసినా సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొలువులకు అవకాశం ఉంటుంది. వాటికి కావాల్సిన నైపుణ్య(స్కిల్​) శిక్షణను తొలి ఏడాది నుంచి ఇచ్చే కళాశాలను గుర్తించాలి.
  • కేవలం పుస్తకాలకే పరిమితమయ్యే కళాశాలలు కాకుండా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యమిచ్చే వాటిని ఎంపిక చేసుకోవాలి.
  • నైతిక విలువలు, క్రమశిక్షణకు పెద్దపీట వేసే కళాశాలలను పరిశీలించుకోవటం మంచిది.

ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్ షెడ్యూల్​ ఇది..

  • ధ్రువపత్రాల పరిశీలన: ఈ నెల 10వ తేదీతో పూర్తయ్యింది.
  • వెబ్‌ ఆప్షన్ల నమోదు : 8 నుంచి 12 వరకు
  • ఆప్షన్ల మార్పు : 13న
  • సీట్ల కేటాయింపు : 16న
  • కళాశాలల్లో రిపోర్టింగ్‌: 17 నుంచి 22 వరకు
  • తరగతుల ప్రారంభం: 19 నుంచి

ఇంజినీరింగ్‌ ఫీజులు ఖరారు - ఆ కాలేజీల్లో ఎంతంటే? - ENGINEERING FEES in ap

ఉద్యోగమా? పీజీనా?

ఇంజినీరింగ్‌తో సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలు, ఆధునిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన అవసరం. ప్రతి సబ్జెక్టు క్రమం తప్పకుండా పూర్తి చేయడంతోపాటు ఇంజినీరింగ్‌ తర్వాత పీజీనా? ఉద్యోగమా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి. అధ్యాపకులు చెప్పిన పాఠాలతో పాటు జర్నల్స్, మ్యాగజైన్, బ్లాగులు చూస్తూ సాంకేతికతపై పట్టు సాధించాలి.

వీటిని పరిగణనలోకి తీసుకోవాలి

విద్యార్థులు కళాశాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఎంపికకు ముందుగానే తెలుసుకోవాలి. అక్కడ మనం ఎంచుకునే బ్రాంచ్‌కు గతేడాది ఏ ర్యాంకు వరకు వచ్చింది? ప్రాంగణ ఎంపికలు (క్యాంపస్​ సెలక్షన్స్) పరిస్థితి ఏంటి? ఎటువంటి కంపెనీలు వస్తున్నాయి? వార్షిక వేతనం ఎంత వరకు ఉంటుంది? వంటి విషయాలు తప్పనిసరిగా తెలుసుకున్నపుడే ఓ అంచనాకు రావాలి.

కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకున్న విద్యార్థులు తొలి సంవత్సరం నుంచే స్వీయ సముపార్జన అలవాటు చేసుకోవాలి. ఫైనల్​ ఇయర్​లో చేపట్టబోయే ప్రాజెక్టు గురించి ముందస్తుగానే అవగాహన ఉండాలి. సీఎస్‌ఈ తర్వాత ఐటీ శాఖలకు మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో వాటికీ సమాన అవకాశాలున్నాయి. ఏ బ్రాంచి తీసుకున్నా చదివు ఆధారంగా విద్యార్థి రాణించడం ఆధారపడి ఉంటుంది. ఇంజినీరింగ్‌ తర్వాత గ్రూప్స్‌ను ఎంచుకుని విజయం సాధించిన ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారు.

డిప్లొమా, ఐటీఐ అర్హతతో BELలో జాబ్స్​- దరఖాస్తుకు లాస్ట్​ డేట్​ ఇదే! - BEL Recruitment 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.