RRB Para Medical Recruitment 2024 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 1376 పారా మెడికల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- డైటీషియన్ - 5 పోస్టులు
- నర్సింగ్ సూపరింటెండెంట్ - 713 పోస్టులు
- ఆడియోలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ - 4 పోస్టులు
- క్లీనికల్ సైకాలజిస్ట్ - 7 పోస్టులు
- డెంటల్ హైజీనిస్ట్ - 3 పోస్టులు
- డయాలసిస్ టెక్నీషియన్ - 20 పోస్టులు
- హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-III - 126 పోస్టులు
- లేబొరేటరీ సూపరింటెండెంట్ - 27 పోస్టులు
- పెర్ఫ్యూషనిస్ట్ - 2 పోస్టులు
- ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II - 20 పోస్టులు
- ఆక్యుపేషనల్ థెరపిస్ట్ - 2 పోస్టులు
- క్యాత్ లేబొరేటరీ టెక్నీషియన్ - 2 పోస్టులు
- ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) - 246 పోస్టులు
- రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ - 64 పోస్టులు
- స్పీచ్ థెరపిస్ట్ - 1 పోస్టులు
- కార్డియాక్ టెక్నీషియన్- 4 పోస్టులు
- ఆప్టోమీటరిస్ట్ - 4 పోస్టులు
- ఈసీజీ టెక్నీషియన్ - 13 పోస్టులు
- లేబరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ -II - 94 పోస్టులు
- ఫీల్డ్ వర్కర్ - 19 పోస్టులు
- మొత్తం పోస్టులు - 1376
విద్యార్హతలు
పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉండాలి. కనుక పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
పోస్టులను బట్టి వయోపరిమితి మారుతుంది. కనుక పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
పరీక్ష ఫీజు
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ (ఈబీసీ), మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్, ఎస్టీ, ఎస్సీలు, మైనారిటీలు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పునకు 1/3 మార్క్ తగ్గుతుంది. ఈ పరీక్షలో మెరిట్ సాధించినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
- ముందుగా మీరు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- ఆర్ఆర్బీ పారామెడికల్ జాబ్ నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత Apply పై క్లిక్ చేసి, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- ఇందుకోసం మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాలి.
- తరువాత అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సహా అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 17
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్ 16
- కరెక్షన్ విండో డేట్స్ : 2024 సెప్టెంబర్ 17-26 వరకు
డిప్లొమా అర్హతతో - రైల్వేలో 7951 జేఈ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - RRB JE Recruitment 2024