ETV Bharat / education-and-career

రైల్​ కోచ్​ ఫ్యాక్టరీలో 550 అప్రెంటీస్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - RCF Apprentice Jobs 2024

RCF Apprentice Jobs 2024 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్​. పంజాబ్​లోని కపుర్తలా రైల్​ కోచ్ ఫ్యాక్టరీ 550 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసై, సంబంధింత ట్రేడ్​లో నేషనల్​ ట్రేడ్ సర్టిఫికెట్​ పొందిన వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

railway jobs 2024
RCF Apprentice Jobs 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 10:26 AM IST

RCF Apprentice Jobs 2024 : ఇండియన్ రైల్వేస్​లో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి వారికి శుభవార్త. పంజాబ్​ రాష్ట్రంలోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ 550 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఫిట్టర్ - 200
  • వెల్డర్​ (G&E) - 230
  • మెషినిస్ట్ - 5
  • పెయింటర్​ (G) - 20
  • కార్పెంటర్​ - 5
  • ఎలక్ట్రీషియన్​ - 75
  • ఏసీ& రిఫ్రిజిరేషన్ మెకానిక్ - 15
  • మొత్తం పోస్టులు - 550

విద్యార్హతలు
RCF Apprentice Qualifications : అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్​లో నేషనల్ ట్రేడ్​ సర్టిఫికెట్ పొంది ఉండాలి.

వయోపరిమితి
RCF Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
RCF Apprentice Application Fee : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం
RCF Apprentice Selection Process :

  • అభ్యర్థులు ముందుగా రైల్​ కోచ్​ ఫ్యాక్టరీ అధికారిక వెబ్​సైట్​ https://pardarsy.railnet.gov.in/apprentice/ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజ్​లోని RCF Apprentice Apply Linkపై క్లిక్ చేయాలి.
  • అవసరమైన వివరాలు అన్నీ నమోదు చేసి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి చేయాలి.
  • వెంటనే మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతాయి. వాటిని ఉపయోగించి వెబ్​సైట్​లో మళ్లీ లాగిన్ కావాలి.
  • మీకు నచ్చిన అప్రెంటీస్​ ట్రేడ్​ను ఎంచుకోవాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • ముఖ్యమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్​ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
RCF Apprentice Apply Last Date :

  • రిజిస్ట్రేషన్ ప్రారంభం : 2024 మార్చి 11
  • రిజిస్ట్రేషన్​కు చివరి తేదీ : 2024 ఏప్రిల్ 9

ఇంజినీరింగ్ అర్హతతో NHPCలో 280 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - 'నవోదయ'లో 1377 నాన్​-టీచింగ్ పోస్టులు భర్తీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.