NTPC Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- యూఆర్ - 98 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 22 పోస్టులు
- ఓబీసీ - 40 పోస్టులు
- ఎస్సీ - 39 పోస్టులు
- ఎస్టీ - 24 పోస్టులు
- మొత్తం పోస్టులు - 223
విద్యార్హతలు
NTPC Assistant Executive Qualifications : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. అలాగే ఒక ఏడాది వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి.
వయోపరిమితి
NTPC Assistant Executive Age Limit : అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 35 ఏళ్లు మించి ఉండకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
NTPC Assistant Executive Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక ప్రక్రియ
NTPC Assistant Executive Selection Process : అభ్యర్థులకు ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుసరించి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
టెన్యూర్
NTPC Assistant Executive Job Tenure : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్లపాటు ఒప్పంద ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థుల పనితీరును అనుసరించి మరో 2 ఏళ్ల వరకు ఈ టెన్యూర్ పెంచే అవకాశం ఉంటుంది.
జీతభత్యాలు
NTPC Assistant Executive Salary : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,000 వరకు జీతం అందిస్తారు. దీనితోపాటు హెచ్ఆర్ఏ, మెడికల్ ఫెసిలిటీ లాంటి అదనపు బెనిఫిట్స్ కల్పిస్తారు. అంతేకాదు కంపెనీ వసతి సౌకర్యం కూడా లభిస్తుంది.
దరఖాస్తు విధానం
NTPC Assistant Executive Application Process :
- అభ్యర్థులు ముందుగా https://www.ntpc.co.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- Recruitment ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
- ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
- వెంటనే ఓ 'యూనిక్ నంబర్' జనరేట్ అవుతుంది. దానిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
- ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
NTPC Assistant Executive Posts Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 జనవరి 25
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 8
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు- లక్షా40వేలు జీతం!- పూర్తి వివరాలివే
భారత్ డైనమిక్స్‌లో 361 ఇంజినీరింగ్ పోస్టులు - పరీక్ష లేకుండానే జాబ్స్!