ETV Bharat / education-and-career

విదేశీ వర్సిటీల్లో ఉచిత కోర్సులు- నేరుగా పట్టా పొందే అవకాశాలెన్నో! - Free Education Abroad - FREE EDUCATION ABROAD

Free Education Abroad: విదేశాలకు వెళ్లాలని, అక్కడి యూనివర్సిటీల్లో చదవాలనేది ఎంతో మంది విద్యార్థుల కల. పలు కారణాల వల్ల అక్కడికి వెళ్లలేకపోయినా విదేశీ యూనివర్సిటీల్లో చదివే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఆయా సంస్థల్లో ఆన్‌లైన్‌ ద్వారా వివిధ కోర్సులు అభ్యసించే వీలుంది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

free_education_abroad
free_education_abroad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 1:15 PM IST

Free Education Abroad: ప్రపంచంలోనే పేరెన్నికగన్న యూనివర్సిటీలు వివిధ రకాల కోర్సులను ఉచితంగా అందిస్తున్నాయి. గేమ్‌ డిజైన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌, జర్నలిజం ఇలాంటి కోర్సులని విదేశీ యూనివర్సిటీలు ఉచితంగా ఆఫర్ చేస్తున్నాయి. విదేశీ అనగానే అమెరికా, యూకే, ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఆన్​లైన్​ ద్వారా పూర్తి చేసే వీలుంది.

ప్రఖ్యాతిగాంచిన విదేశీ యూనివర్సిటీలు ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరి కోసం తమ విద్యాసంస్థల్లో ప్రమాణాల స్థాయిని పరిచయం చేస్తున్నాయి. అంతే గాకుండా విద్యార్థులు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేందుకు ఇవి ఎంతగానో సహకరిస్తాయి. ఇటువంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన విభాగాల్లో ప్రాథమికాంశాలు ఉచితంగా నేర్చుకునే వీలుంటుంది. అంతేగాకుండా విదేశీ యూనివర్సిటీలో చదివామనే తృప్తి లభిస్తుంది.

జాబ్‌ మార్కెట్‌లోనూ చక్కని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి అధికశాతం ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌తో అనుసంధానమై పనిచేస్తుండగా, సంబంధిత వర్సిటీ అధ్యాపకులే ఈ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా బోధిస్తున్నారు.

free_education_abroad
free_education_abroad (ETV Bharat)

ఎడ్యుకేషన్​ లోన్ కావాలా? బ్యాంక్​కు వెళ్లకుండానే ఆన్​లైన్​లోనే అప్లై చేసుకోండిలా! - Education Loan Online Apply Process

హార్వర్డ్‌ యూనివర్సిటీ

ఐవీ లీగ్‌లో ముఖ్యమైన, పురాతనమైన హార్వర్డ్‌ యూనివర్సిటీ దాదాపు 600కు పైగా కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఉన్నత స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన ఎలా ఉంటుందనే విషయం తెలిసేలా ఈ కోర్సులు ఉంటాయి. కోర్సుల కాల వ్యవధి ఒకటి నుంచి పన్నెండు వారాల వ్యవధి ఉంటుంది. సాహిత్యం, న్యాయశాస్త్రం, బిగ్‌డేటా, సామాజిక అంశాలు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, ప్రోగ్రామింగ్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, చరిత్ర, న్యూరోసైన్స్‌ ఇలా విభిన్న అంశాలను హార్వర్డ్‌ వర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇవేకాక మోడరన్ టెక్నికల్ కోర్సులైన మెషిన్‌ లెర్నింగ్‌, పైతాన్‌ లాంగ్వేజ్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, డేటా సైన్స్‌ వంటి వాటిలోనూ ప్రాథమిక అంశాలు అభ్యసించే వీలుంది.

జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

ఈ విద్యాసంస్థ మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌ - మాక్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తోంది. దాదాపు ముప్ఫై లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. వివిధ ర్యాంకింగ్‌ సిస్టమ్స్‌లో పోటీ పడి టాప్‌ ర్యాంకులు పొందిన కోర్సులు కూడా ఇవే కావడం విశేషం. బిజినెస్‌, కంప్యూటింగ్‌, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, మ్యాథమెటిక్స్‌, సప్లైచెయిన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అనే విభాగాల్లో మొత్తం 30 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూఎక్స్‌ డిజైన్‌, డేటా అనాలిసిస్‌, డేటా అనలిటిక్స్‌, పైతాన్‌, జావా, డేటా స్ట్రక్చర్స్‌ అండ్‌ అల్గారిదమ్స్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌, మెకానిక్స్‌, మెటీరియల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెషిన్‌ డిజైన్‌, అనలిటిక్స్‌ మోడలింగ్‌, స్టాటిస్టిక్స్‌, ఇన్నోవేషన్‌ లీడర్‌షిప్‌, సప్లై చెయిన్‌ ప్రిన్సిపల్స్‌ వంటి అనేక అంశాలు అభ్యసించే వీలుంది. ఎడ్‌ఎక్స్‌, కోర్సెరా, ఉడాసిటీ వంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్​ చేసుకునే అవకాశం ఉంది.

మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)...

సైంటిఫిక్‌ థియరీలను నేర్చుకునే క్రమంలో మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)తో పోటీపడే యూనివర్సిటీలు లేవనే చెప్పొచ్చు. గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ఈ కళాశాల వివిధ కోర్సులు ఆఫర్ చేస్తోంది. వాటిలో ప్రధానంగా ఇంజినీరింగ్‌, జాగ్రఫీ, కాగ్నిటివ్‌ సైన్స్‌, హిస్టరీ, ఏరోనాటిక్స్‌, ఫిజిక్స్‌, ఎకనమిక్స్‌, లింగ్విస్టిక్స్‌ - ఫిలాసఫీ, అర్బన్‌ స్టడీస్‌, మేనేజ్‌మెంట్‌, మ్యాథమెటిక్స్‌, లిటరేచర్‌, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆంత్రొపాలజీ, మీడియా స్టడీస్‌, బయాలజీ, న్యూక్లియర్‌ సైన్స్‌, కెమిస్ట్రీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నాయి. దాదాపు అన్నిరకాలైన సబ్జెక్టులపై 3 వేల కోర్సులు ఈ కళాశాలలో అందుబాటులో ఉన్నాయి. నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకుని చదివే కోర్సులతో పాటు ఇంటరాక్టివ్‌ పద్ధతిలో లభించేవి విడివిడిగా అందుబాటులో ఉన్నాయి. సైంటిఫిక్‌ థియరీలను నేర్చుకునే క్రమంలో మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ముందంజలో ఉంది.

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ఎడ్‌ఎక్స్‌ సంస్థతో అనుసంధానమై కోర్సులు అందిస్తోంది. 2012 నుంచి దాదాపు 150 దేశాలకు చెందిన 40 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ వర్సిటీ అందించే కోర్సుల్లో చేరారు. ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించి సర్టిఫికెట్స్‌ కూడా ఇస్తుంది. బిజినెస్‌ రైటింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, జర్నలిజం, సోషల్‌ జస్టిస్‌, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీస్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌.. ఇలా వివిధ విభాగాల్లో కోర్సులు లభిస్తున్నాయి. గంటల నుంచి వారాల వ్యవధిగల ఈ కోర్సుల్లో ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ కావాలంటే కొంత మొత్తంలో ఫీజు చెల్లించాలి.

మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ

ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌, మైండ్‌వేర్‌, జర్నలిజం, రైటింగ్‌, పిక్సల్‌ ఆర్ట్‌, క్రియేటివిటీ, బిజినెస్‌ వంటి కోర్సులు మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ద్వారా అభ్యసించవచ్చు. ఈ వర్సిటీ అందించే కోర్సులన్నీ సంప్రదాయ చదువులకు భిన్నంగా ఉండే మార్గాలే! విద్యార్థులకు సులభంగా సమాచారం దొరికేలా ఈ ప్రోగ్రామ్స్‌ను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచారు. ఇవి పూర్తి చేసిన తర్వాత కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ కూడా అందిస్తారు. మీకు వీలును బట్టి వారానికి ఎన్నిగంటలు కావాలో అలా చదువుకునే అవకాశం ఉంది. దాదాపుగా 6 నెలల్లో ఆయా కోర్సులు పూర్తి చేయవచ్చు.

కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ది ఆర్ట్స్‌

కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ది ఆర్ట్స్‌ కాలేజీ నుంచి విద్యార్థులు గేమ్‌ డిజైన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌ లాంటి స్పెషల్​ ప్రోగ్రామ్స్‌ చేసే వీలుంది. క్రెడిట్స్‌, సర్టిఫికెట్స్‌ కావాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గేమ్‌ డిజైన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌ కోర్సులకో తోడు ఫ్రీలాన్సింగ్‌ బిజినెస్‌, మ్యూజిక్‌ థియరీ - టెక్నాలజీ, పొయిట్రీ, యూఐ/యూఎక్స్‌ డిజైన్‌, వెబ్‌ డిజైన్‌ వంటి ప్రోగామ్స్‌ను పూర్తి చేయవచ్చు. ఈ మేరకు కోర్సెరా ప్లాట్‌ఫామ్‌ నుంచి చేయవచ్చు.

యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. యూకేలోని టాప్‌ కాలేజీల్లో ఇదీ ప్రముఖమైనది. కల్చర్‌, హెల్త్‌తో పాటు ఆంత్రొపాలజీ, సిటిజన్‌ సైన్స్‌ తదితర 170కి పైగా ప్రోగామ్స్‌ ఆన్‌లైన్‌లో ఉచితంగా అభ్యసించవచ్చు. కొన్ని ప్రత్యేక ప్రోగామ్స్‌ మినహా అన్నింటినీ ఉచితంగా చదివే అవకాశం కల్పిస్తోంది.

ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ - బెస్ట్ బెనిఫిట్స్ ఇవే! - Education Loan

విదేశీ విద్య కోసం లోన్ కావాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Education Loans For Studying Abroad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.