ITBP Constable Recruitment 2024 : భారత హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దాని ద్వారా 200 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. నేటి (ఆగస్టు 12వ తేదీ) నుంచే దరఖాస్తులను స్వీకరిస్తోంది. కానిస్టేబుల్ పోస్టులకు అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీబీపీ పేర్కొంది. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది.
ఖాళీల వివరాలు ఇవే!
- కానిస్టేబుల్ (కార్పెంటర్) (పురుషులు): 61 పోస్టులు
- కానిస్టేబుల్ (కార్పెంటర్) (మహిళలు): 10 పోస్టులు
- కానిస్టేబుల్ (ప్లంబర్) (పురుషులు): 44 పోస్టులు
- కానిస్టేబుల్ (ప్లంబర్) (మహిళలు): 08 పోస్టులు
- కానిస్టేబుల్ (మేసన్) (పురుషులు): 54 పోస్టులు
- కానిస్టేబుల్ (మేసన్) (మహిళలు): 10 పోస్టులు
- కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (పురుషులు): 14 పోస్టులు
- కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (మహిళలు): 01 పోస్టు
- ఉద్యోగ అర్హతలు: మెట్రిక్యులేషన్/ 10వ తరగతితో పాటు ఐటీఐ (మేసన్/ కార్పెంటర్/ ప్లంబర్/ ఎలక్ట్రీషియన్ ట్రేడ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- శారీరక అర్హతలు: నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
- పే స్కేల్: ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 - రూ.69,100 మధ్య జీతం ఉంటుంది.
- వయో పరిమితి: 2024 సెప్టెంబర్ 10 నాటికి అభ్యర్థుల వయస్సు 18- 23 ఏళ్ల మధ్య ఉండాలి.
- పరీక్ష ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. మాజీ సైనిక ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
- రాత పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ పద్ధతిలో పదో తరగతి సిలబస్ ఆధారంగా 100 ప్రశ్నలు (100 మార్కులు) అడుగుతారు.
- సబ్జెక్టులు: జనరల్ ఇంగ్లీష్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ హిందీ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), సింపుల్ రీజనింగ్ (20 ప్రశ్నలు- 20 మార్కులు).
డిగ్రీ, డిప్లొమా అర్హతలతో - రైల్వే శాఖలో 1376 పారా మెడికల్ పోస్టులు - RRB Notification 2024
SBIలో 1100 పోస్టులు - అప్లైకు మరో 4 రోజులే ఛాన్స్ - పూర్తి వివరాలివే! - SBI Recruitment 2024