Ghost Jobs Online : నేటి కాలంలో చాలా మంది ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతుకుతుంటారు. ఎన్నో ఆశలతో కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తులు కూడా చేస్తుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో సదరు కంపెనీల నుంచి ఎలాంటి సమాచారం ఉండకపోవడం నిరాశకు గురవుతుంటారు. ఆన్లైన్ జాబ్ ఫ్లాట్ ఫామ్స్ జాబ్ సెర్చ్ ప్రక్రియ సులభతరం చేసినప్పటికీ ఫేక్ లేదా ఘోస్ట్ ఉద్యోగాలు అనేవి నిరుద్యోగులను భయపెడుతూనే ఉంది. ఈ ఫాంటమ్ జాబ్స్ పోస్టింగ్స్ నమ్మశక్యంగానే అనిపిస్తాయి. కానీ ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వాటిపైనే ఆశలు పెట్టుకుని సమయం వృధా చేస్తుంటారు. కొన్ని సందర్భంలో డబ్బులను కూడా కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి ఘోస్ట్ జాబ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఘోస్ట్ జాబ్స్:
ఘోస్ట్ జాబ్‌లు అంటే కంపెనీలు ఓపెనింగ్‌లను సృష్టించేవి కానీ వాటిని భర్తీ చేయలేని ఉద్యోగాలు. ఇటువంటి ఉద్యోగాలు ఇంతకు ముందు కూడా అందుబాటులో ఉన్నాయి. కొవిడ్ తర్వాత చాలా కంపెనీల్లో ఘోస్ట్ జాబ్స్ రెట్టింపు అయ్యాయి. ఎందుకంటే ఉద్యోగార్థులు చాలా మంది అత్యవసరంగా జాబ్ కోరుకునేవారికి స్కిల్స్ లేకపోవడమే కారణమని GI గ్రూప్ హోల్డింగ్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా చెప్పారు.
ఉద్యోగమే లక్ష్యంగా సెర్చ్ చేసే నిరుద్యోగులు ఆన్లైన్ లో కనిపించిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తుంటారు. కానీ వాటి వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఏమాత్రం ఆలోచించరు. టెక్నాలజీలో పురోగతి స్కామర్‌లకు మరింత వాస్తవిక ఆఫర్‌లను క్రియేట్ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. లేబర్ మార్కెట్ పడిపోయినప్పుడు చాలా కంపెనీలు అలాంటి ఓపెనింగ్‌లను సృష్టిస్తాయి. అదే సమయంలో జాబ్ పోస్టింగ్, ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా రెండు వేర్వేరు కారకాలు.
ఘోస్ట్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయని స్టాఫింగ్, టీమ్‌లీజ్ సర్వీసెస్ VP, బిజినెస్ హెడ్ కృష్ణేందు ఛటర్జీ చెప్పారు. మెరుగైన అవకాశాల కోసం వెతుకుతున్న అండర్ ప్రివిలేజ్డ్ లేదా అర్హత లేని అభ్యర్థులు సులభంగా వీటిని బారిన పడతారు. కొన్ని కంపెనీలు తమ పెట్టుబడిదారుల్లో లేదా పోటీలో వృద్ధి భ్రమను సృష్టించేందుకు ఈ పోస్టింగ్‌లను క్రియేట్ చేస్తాయి. స్కామర్‌లు డబ్బు లేదా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు.
అరోరా ప్రకారం, కస్టమర్ సర్వీస్, కాంటాక్ట్ సెంటర్‌లు, డేటా ఎంట్రీ ఉద్యోగాలు, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్‌లో ఇటువంటి మోసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్న చాలా మంది అభ్యర్థులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లేదా విదేశాల్లో ఉద్యోగం అంటూ ఆశచూపే ఫేక్ ఎంట్రీ- లెవల్ ఉద్యోగాల్లో ఘోస్ట్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయని ఛటర్జీ చెప్పారు. దీంతో అభ్యర్థులకు నిరాశకు లోనవుతుంటారు. స్కామర్లు ఎక్కువ మంది వ్యక్తులను తమ ట్రాప్‌లోకి తీసుకునేలా చేస్తుంది.
మీకు వచ్చే ఉద్యోగ అవకాశాలు చాలా వరకు డేంజర్ జోన్లో ఉంటాయి. ప్రామాణికమైన జాబ్ పోస్టింగ్‌లు ఏ రూపంలోనూ డబ్బును డిమాండ్ చేయవు. ముందస్తు చెల్లింపులు, సెక్యూరిటీ డిపాజిట్లు, ట్రైనింగ్ ఫీజులు లేదా అసెస్‌మెంట్ ఫీజులు ఇలాంటి ఏవీ ఉండవు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, భారీ పే స్కేల్ ఆఫర్ చేస్తే అది కచ్చితంగా స్కామ్గానే గుర్తించాలని నిపుణులు అంటున్నారు. కంపెనీ అడ్రస్ లేని డొమైన్స్ నుంచి వచ్చే ఈ-మెయిల్స్, పర్సనల్ ఈ- మెయిల్ ఐడీలతో వచ్చే జాబ్స్ ఆఫర్స్, సరైన కంపెనీ, జాబ్ రోల్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం, ఇంటర్వ్యూ లేకుండా జాయిన్ కావడం ఇవన్నీ కూడా ఫేక్ జాబ్స్ గుర్తించాలని చెబుతున్నారు.