ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో 3000 బ్యాంకింగ్ ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!

Central Bank of India Jobs 2024 : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Central Bank of India Apprentice Recruitment 2024
Central Bank of India Jobs 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 10:25 AM IST

Central Bank of India Jobs 2024 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​ల్లో అప్రెంటీస్​లుగా పనిచేయాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగాల వివరాలు

  • ఆంధ్రప్రదేశ్​ - 100 పోస్టులు (గుంటూరు - 40, విజయవాడ - 30, విశాఖపట్నం - 30)
  • తెలంగాణ - 96 పోస్టులు (హైదరాబాద్ -58, వరంగల్​ - 38)
  • దేశవ్యాప్తంగా 3000 అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 2024 మార్చి 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.800 + జీఎస్టీ చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్​, మహిళా అభ్యర్థులు రూ.600 + జీఎస్టీ దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
  • దివ్యాంగులు రూ.400 + జీఎస్టీ అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా చేస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్​నెస్​, ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. చివరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం, అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

శిక్షణ కాలం
అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.

స్టైపెండ్
అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా https://nats.education.gov.in/ పోర్టల్​ ఓపెన్ చేసి, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి.
  • తరువాత https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ ఓపెన్ చేసి, లాగిన్ అవ్వాలి.
  • Apprenticeship with Central Bank of India లింక్​పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లో చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకుని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్ రిజిస్ట్రేషన్​ ప్రారంభం : 2024 ఫిబ్రవరి 21
  • ఆన్​లైన్ రిజిస్ట్రేషన్​కు ఆఖరు తేదీ : 2024 మార్చి 6
  • ఆన్​లైన్ పరీక్ష తేదీ : 2024 మార్చి 10

డిగ్రీ అర్హతతో IFS జాబ్స్​- వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు- లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

ఇంజినీరింగ్ అర్హతతో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.