Women Workplace Challenges : ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారు. పురషులతో సమానంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. మహిళలు ఉన్నంతగా రాణిస్తూ దాదాపు అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, మహిళలు ఇప్పటికీ ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతలను నెరవేస్తున్నారు. అయితే ఇలా రెండు పనులు చేయడం వారికి సవాలుగా మారుతోందని నౌక్రీ.కామ్ నివేదిక వెల్లడించింది. సరళమైన పని విధానాలు అందుబాటులో లేకపోవడం వల్ల అటు ఇంటి పని, ఇటు ఆఫీసు పని రెండింటి మధ్య సమన్వయం సాధించలేకపోతున్నారని పేర్కొంది. ఈ కారణంగానే చాలా మంది ఉద్యోగంలోకి తిరిగి చేరడం లేదని నౌక్రీ.కామ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
సర్వేలోని కీలక విషయాలు
- ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 39 శాతం మంది మహిళలు ఇల్లు-ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకోలేక తాము ఉద్యోగాన్ని వీడుతున్నామని తెలిపారు.
- ఒక వేళ పెళ్లి, పిల్లలకు జన్మిచ్చిన తర్వాత అనుకూలమైన పని వేళలు లేకపోవడం వల్ల తిరిగి ఉద్యోగంలో చేరలేకపోతున్నామని 49 శాతం మంది పేర్కొన్నారు.
- ఇక కుటుంబ బాధ్యతలను నిర్వహించడం వల్ల ఉద్యోగంలో కొనసాగడం కష్టంగా ఉందని 35 శాతం మంది వెల్లడించారు.
- ఒకే విధమైన నైపుణ్యాలున్నప్పటికీ పురుషులతో పోలిస్తే తమకు వృద్ధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని 24 శాతం మంది మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పురుషులు 8 శాతం మందే దీనితో ఏకీభవించారు.
- ఒకే విధమైన నైపుణ్యాలున్నప్పటికీ పురుషులతో పోలిస్తే తమకు వృద్ధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని 24 శాతం మంది మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని 8 శాతం మంది పురుషులు ఏకీభవించారు.
- మహిళలకే అధిక అవకాశాలుంటాయని 13 శాతం మంది పురుషులు తెలిపారు. ఈ వాదనను మహిళల్లో 3 శాతం మంది సమర్థించారు.
- పని ప్రదేశంలో లింగ సమానత్వం ఉంటోందని 73 శాతం మంది మహిళలు తెలిపారు. దీంతో మహిళలకూ సమాన అవకాశాలు ఉంటున్నాయనే విషయం స్పష్టమైందని నౌక్రీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వ్యాఖ్యానించారు.
- ఇప్పటికీ 31శాతం మంది మహిళలు తక్కువ జీతానికే పనిచేస్తున్నామని చెప్పారు. కానీ, వేతనంలో ఎలాంటి తేడాలూ ఉండటం లేదని 53శాతం మంది వెల్లడించారు.
'నేటి యువతకు బ్యాక్ అప్ ప్లాన్ లేదు - ఉద్యోగం పోతే ఇక అంతే' - సర్వే - Job Loss Survey