ETV Bharat / business

RBI మన బంగారాన్ని విదేశాల్లో స్టోర్ చేస్తుంటుంది - ఎందుకో తెలుసా? - Indias Gold Reserves In Foreign - INDIAS GOLD RESERVES IN FOREIGN

Why RBI Stores Gold Reserves In Foreign Vaults : ఆర్​బీఐ మన దేశానికి చెందిన టన్నుల కొద్ది బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేస్తూ ఉంది. అయితే ఇటీవల యూకే నుంచి ఒక లక్ష కేజీల బంగారాన్ని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చింది. ఎందుకు ఇలా చేసింది? అసలు మన బంగారాన్ని విదేశాల్లో ఉంచాల్సిన అవసరం ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Why is the RBI focusing on Gold Reserves?
gold reserves of India (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 11:46 AM IST

Why RBI Stores Gold Reserves In Foreign Vaults : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకే నుంచి సుమారు 100 టన్నుల(లక్ష కేజీలు) బంగారాన్ని భారత్​కు తీసుకొచ్చింది. 1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత, ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తిరిగి తీసుకురావడం ఇదే తొలిసారి. రానున్న నెలల్లో మరింత బంగారాన్ని వెనక్కు తీసుకురావాలని ఆర్​బీఐ భావిస్తోంది. ఇదంతా చూస్తుంటే, మన బంగారాన్ని విదేశాలలో ఎందుకు ఉంచారన్న సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి, దేశ ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం నిల్వలను ఉంచుకుంటాయి. డిపాజిటర్లకు, నోట్ హోల్డర్లకు హామీగా బంగారు నిల్వలను ఉపయోగించుకుంటాయి.

అసలు బంగారం నిల్వలే ఎందుకు?
కేంద్ర బ్యాంకులు అనేక కారణాల వల్ల బంగారం నిల్వలను ఉంచుకుంటాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బంగారాన్ని కలిగి ఉంటే దేశ, విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సాయపడుతుంది. ముఖ్యంగా ఏదో ఒక కరెన్సీపై మాత్రమే ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

భారత్ దగ్గర ఉన్న బంగారం నిల్వలు ఎంతంటే?
2024 ఆర్​బీఐ వార్షిక నివేదిక ప్రకారం, భారత్‌ వద్ద దేశీయంగా 308 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. అదనంగా 100.28 టన్నుల బంగారం బ్యాంకింగ్ డిపార్ట్​మెంట్ అసెట్​గా ఉంది. విదేశాల్లో మన బంగారం ఏకంగా 413.79 మెట్రిక్ టన్నుల వరకు ఉంది. స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబయి, నాగపుర్​లోని హై-సెక్యూరిటీ వాల్ట్​లలో భద్రపరిచారు.

తొమ్మిదో స్థానంలో
827.69 మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్​లో భారత్‌ ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక 8,133.5 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ వద్ద కూడా గణనీయమైన స్థాయిలో బంగారు నిల్వలు ఉన్నాయి.

విదేశాల్లో బంగారాన్ని ఎందుకు నిల్వ చేయాలి?
భారత్‌ అనేక ఇతర దేశాల మాదిరిగానే, తన బంగారం నిల్వలలో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్​లలో నిల్వ చేస్తోంది. బంగారాన్ని ఇతర దేశాలలో నిల్వ చేయడం వల్ల భౌగోళిక, రాజకీయ అస్థిరతలు లేదా ప్రాంతీయ సంఘర్షణలు నుంచి భద్రత లభిస్తుంది. లండన్, న్యూయార్క్, జ్యూరిచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు, మార్పిడిలు లేదా రుణాల కోసం పూచీకత్తుగా ఉపయోగించుకోవచ్చు.

బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి చారిత్రక, భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలకు ఖ్యాతి ఉంది. అందుకే వీటిలో భారత్ తన బంగారాన్ని నిల్వ చేస్తోంది.

ప్రధాన అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్ ఇవే!
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారు నిల్వల ప్రధాన సంరక్షణ కేంద్రంగా ఉంది. ఇందులో సమగ్రమైన నిఘా వ్యవస్థ, కఠినమైన యాక్సెస్ ప్రోటోకాల్స్​తో సహా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. యూకేతో భారత్​కు ఉన్న చారిత్రక సంబంధాలు, బ్యాంక్ ఖ్యాతి కూడా, ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయడానికి ఒక ప్రధాన కారణం.

స్విట్జర్లాండ్​లోని బాసెల్​లో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సహకారాన్ని సులభతరం చేస్తుంది. ఇది ప్రత్యేకంగా కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలకు మాత్రమే ప్రత్యేకంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది. ఇక్కడ బంగారం నిల్వల భద్రత, యాక్సెసబిలిటీ బాగుంటుంది.

అమెరికాలోని ఫోర్ట్ నాక్స్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, జర్మనీలోని డ్యుయిష్ బుండెస్‌ బ్యాంక్, ఫ్రాన్స్​లోని బ్యాంక్​ డి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్​లో ఉన్న స్విస్ నేషనల్ బ్యాంక్, జ్యూరిచ్ వాల్ట్స్ కూడా బంగారాన్ని నిల్వచేస్తుంటాయి. ఇవన్నీ బంగారాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగి ఉంటాయి.

మీకు ఐటీ నోటీసులు వచ్చాయా? డోంట్ వర్రీ - అవి అసలైనవో, కాదో చెక్ చేసుకోండిలా! - How To Authenticate IT Notice

మీరు కాస్త పొట్టిగా ఉంటారా? మీకు సూట్​ అయ్యే టాప్​-10 బైక్స్ ఇవే! - Best Low Seat Height Bikes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.