ETV Bharat / business

హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే - లోన్​ ఎవరు చెల్లించాలి? - బ్యాంక్​ రూల్స్​ మీకు తెలుసా? - Home Loan recovery Rules

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 3:49 PM IST

Home Loan: ఇళ్లు కట్టుకోవడానికి, కారు కొనుక్కోవడానికి, వ్యక్తిగత అవసరాలు.. ఇలా పలు కారణాల వల్ల చాలా మంది బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్​ తీసుకుంటుంటారు. అయితే .. ఇలా అప్పు తీసుకున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఎలా? ఆ మిగిలిన బకాయిలు ఎవరు చెల్లించాలి? బ్యాంకు అధికారులు ఏం చేస్తారు? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Home Loan
Home Loan (ETV Bharat)

What Happens if Home Loan Borrower Suddenly Death: నేటి కాలంలో సొంతంగా ఇళ్లు నిర్మించుకునే వారి సంఖ్య పెరిగింది. కొందరు సంపాదించిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటే.. మరికొందరు అప్పు తీసుకుని కట్టుకుంటుంటారు. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్​ సంస్థలు కూడా ఇళ్లు నిర్మించుకునేందుకు హోమ్​ లోన్స్​ అందిస్తున్నాయి. తీసుకున్న రుణాన్ని రుణ గ్రహీత ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తారు. ఇక్కడి వరకు బానే ఉన్నా.. అనుకోని పరిస్థితుల్లో హోమ్​ లోన్ తీసుకున్న వ్యక్తి బకాయిలు పూర్తిగా చెల్లించకముందే చనిపోతే ఆ రుణ బాధ్యత ఎవరిది? మిగిలిన బకాయి రుణ మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు? ఈ విషయంలో బ్యాంక్​ రూల్స్​ ఎలా ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్​ తిరిగి చెల్లించే బాధ్యత సాధారణంగా హోమ్ లోన్ కో-అప్లికెంట్ లేదా చట్టపరమైన వారసులపై ఉంటుంది. ఒకవేళ రుణానికి కో-అప్లికెంట్ ఉంటే.. వారు లోన్​ చెల్లించడానికి చట్టపరంగా బాధ్యత వహిస్తారు. ఒకవేళ కో-అప్లికెంట్ లేనప్పుడు.. లోన్​ ఇచ్చిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ EMI చెల్లింపుల కోసం చట్టపరమైన వారసులను సంప్రదిస్తుంది. ఆ మొత్తాలను వారసులు తిరిగి చెల్లించాలి. వారు కూడా లోన్​ చెల్లించడంలో విఫలమైతే.. బకాయిలను తిరిగి పొందడానికి ఆస్తిని స్వాధీనం చేసుకుని.. వేలం వేయడానికి రుణం అందించిన సంస్థ లేదా బ్యాంక్​కు హక్కు ఉంటుంది.

హోమ్​ లోన్ కావాలా? ఈ టిప్స్ పాటిస్తే లక్షలు ఆదా కావడం గ్యారెంటీ!

ఇన్సూరెన్స్​ కవరేజ్​: అయితే చాలా మంది రుణ గ్రహీతలు.. హోమ్ లోన్స్ తీసుకునే సమయంలోనే లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీలను ఎంచుకుంటారు. అలా పాలసీ తీసుకున్న వ్యక్తుల లోన్ మెుత్తానికి సెక్యూరిటీ ఉంటుంది. బకాయిలు చెల్లించకుండా రుణం తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే.. బకాయి ఉన్న లోన్ మొత్తాలను ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో బీమా కంపెనీ హోమ్ లోన్ మొత్తాన్ని రుణదాతతో సెటిల్ చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేస్తుంది. కాగా.. దీని కోసం కొన్ని అవసరమైన డాక్యుమెంట్లను వారసులు లోన్ అందించిన సంస్థకు అందించాల్సి ఉంటుంది.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మాత్రమే ఉంటే : గృహ రుణ బకాయిదారుడు కేవలం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మాత్రమే తీసుకుంటే.. ఆ క్లెయిమ్‌ మొత్తం నామినీ అకౌంట్​లో డిపాజిట్​ అవుతుంది. న్యాయపరమైన ప్రక్రియ తర్వాత వారసుడికి ఈ క్లెయిమ్‌ మొత్తం అందుతుంది. అయితే, బ్యాంకు రుణ బకాయి వసూలుకు ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే.. టర్మ్‌ బీమా క్లెయిమ్‌ మొత్తాన్ని బ్యాంకు రుణ బకాయి కింద తీసుకోలేదు. అంటే ఈ టర్మ్‌ బీమా క్లెయిమ్‌ మొత్తాన్ని ఉపయోగించుకునే హక్కు వారసుడికి మాత్రమే ఉంటుంది. గృహ రుణ బీమా లేనప్పుడు.. సహ-రుణగ్రహీత, చట్టపరమైన వారసుడు నుంచి బ్యాంకు బకాయి మొత్తాన్ని తిరిగి పొందలేకపోతే.. ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని లోన్​ బకాయికి సర్దుబాటు చేసుకుంటుంది.

వారసులు ఏం చేయాలి?: బ్యాంకు చట్టబద్ధ వారుసులను సంప్రదించి తీసుకున్న రుణాన్ని చెల్లించాలంటూ నోటీసు ఇస్తే.. ఇటువంటి సందర్భాల్లో వారసులు ముందుగా.. ఆర్థిక మదింపు చేయాలని నిపుణులు అంటున్నారు. మొత్తం ఆస్తుల విలువ, చెల్లించాల్సిన బకాయిల మొత్తాన్ని లెక్కించుకోవాలని.. బకాయిల కంటే ఆస్తి విలువ ఎక్కువగా ఉంటే.. రుణాలను చెల్లించడమే మేలని అంటున్నారు.

మల్టిపుల్ హోమ్ లోన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఫస్ట్​ టైం 'హోం లోన్' తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.