ETV Bharat / business

హోమ్​ లోన్​ EMI చెల్లింపు లేట్ అయితే జరిగే పరిణామాలివే! మీ ఇంటిని కాపాడుకోవాలంటే ఇలా చేయాల్సిందే! - HOME LOAN DELAY CONSEQUENCES

మీరు హోమ్​ లోన్​ ఈఎమ్​ఐ చెల్లింపులు మిస్​ అయ్యారా? ఈఎమ్​ఐ కట్టడం ఆలస్యం అయిందా? అయితే మీరు ఈ పరిణామాలు ఎదుర్కోవాల్సిందే! ప్రాబ్లమ్​ ఇలా సాల్వ్​ చేయండి!

What Happens When You Delay Home Loan
What Happens When You Delay Home Loan (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 2:48 PM IST

What Happens When You Delay Home Loan : హోమ్​ లోన్​లు దీర్ఘకాల ఫైనాన్సియల్ కమిట్​మెంట్స్​. ఈఎమ్​ఐలు క్రమానుగుణంగా సకాలంలో కట్టడం చాలా అవసరం. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, ఇంటిని కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యం. అయితే, ఈఎమ్​ఐలు కట్టడం మిస్​ అయినా లేదా లేట్​ అయినా రుణగ్రహీతలు చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. లేట్​ పేమెంట్ పెనాల్టీలు
గృహ రుణం ఈఎమ్​ఐ కట్టడం లేట్ అయినా, గడువు తేదీ ముగిసిన తర్వాత చెల్లించినా రుణదాతలు పెనాల్టీ రుసుము వసూలు చేస్తారు. సాధారణంగా పెనాల్టీలో ఫ్లాట్​ ఫీజు లేదా ఓవర్​డ్యూ అమౌంట్​ ఉంటుంది. ఉదాహరణకు బకాయి ఉన్న ఈఎమ్​ఐలో నెలకు 2శాతం నుంచి 3శాతం వరకు పెనాల్టీ విధించవచ్చు. ఇది మీరు చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని పెంచుతుంది.

2. క్రెడిట్​ స్కోర్​పై ప్రభావం
ఈఎమ్​ఐ చెల్లింపులు ఆలస్యం అయితే మీ క్రెడిట్ స్కోర్​పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈఎమ్​ఐలు మిస్​ అయితే క్రెడిట్​ స్కోరు తగ్గుతుంది. ఫలితంగా భవిష్యత్తులో లోన్​లు, క్రెడిట్ కార్డులు, లేదా అనుకూలమైన వడ్డీ రేట్లను పొందడం కష్టతరం అవుతుంది. చాలా వరకు బ్యాంకులు- మీరు మిస్సైన ఈఎమ్​ఐల వివరాలను సిబిల్​ వంటి క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తాయి. ఇది మీ క్రెడిట్ కార్డు హిస్టరీని దెబ్బతీస్తుంది.

3. పెరిగిన వడ్డీ
మీరు ఈఎమ్​ఐ చెల్లించడం మిస్​ అయినప్పుడు- బకాయి మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్​కు(అసలు) యాడ్ చేస్తారు. దీంతో ఆ మొత్తంపై వడ్డీ పెరుగుతుంది. అంటే మీరు ఈఎమ్​ఐ కట్టడం ఆలస్యం చేసినకొద్దీ లోన్​ బ్యాలన్స్​ పెరుగుతుంది. దీంతో ఫ్యూచర్​లో లోన్​ను చెల్లించడం కష్టమవుతుంది. ఇక రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితి దిగజారితే, చెల్లింపు వ్యవధిని పొడగించుకోవచ్చు.

4. రుణదాలత నుంచి నోటీసులు
ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ ఈఎమ్​ఐలు చెల్లించడం మిస్​ అయితే లేదా కట్టలేకపోతే, దాని గురించి గుర్తుచేయడానికి మీ రుణదాత డిఫాల్ట్​ నోటీసులను పంపిస్తారు. ఆ నోటీసుల్లో మీరు కట్టాల్సిన బకాయిలు, చెల్లించడం ఆలస్యం చేస్తే ఎదుర్కొవాల్సిన పరిణామాలను వివరిస్తారు. మీరు ఆ నోటీసులను విస్మరిస్తే రుణదాతలు మరింత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

5. చట్టపరమైన చర్యలు
సాధారణంగా, మీరు 3-6 నెలల పాటు ఈఎమ్​ఐలు చెల్లించడంలో విఫలమైతే- మీ లోన్​ను రుణదాతలు నిరర్థకంగా(నాన్​ పెర్ఫార్మింగ్) పరిగణించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు మీ ఆస్తిని సెక్యూరిటీగా పెట్టి లోన్​ తీసుకుంటే- SARFAESI చట్టం ప్రకారం రుణదాతకు మీ ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది.

Note : SARFAESI చట్టం, 2002- సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్​ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అస్సెట్స్​ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​ యాక్ట్, 2002.

6. లోన్​ టర్మ్ పెరగడం ద్వారా ఈఎమ్​ఐ భారం
కొన్ని సందర్భాల్లో రుణదాతలు ఈఎమ్​ఐల భారాన్ని తగ్గించడానికి లోన్​ను రీస్ట్రక్షర్​ చేస్తారు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, లోన్​ పూర్తి టెన్యూర్​లో కట్టాల్సిన వడ్డీని పెంచుతుంది.

7. లోన్​ రీస్ట్రక్షరింగ్, రీఫైనాన్సింగ్​లో ఇబ్బందులు
ఈఎమ్​ఐలు మిస్​ అయితే, మీ క్రెడిట్​ తగ్గుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీరు హోమ్​ లోన్​ను రీస్ట్రక్షరింగ్​, రీఫైనాన్స్​ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. రుణదాతలు అధిక వడ్డీ రేట్లను అందించే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్థిక సంస్థలు మిమ్మల్ని రిస్కీ రుణగ్రహీతగా భావిస్తే దరఖాస్తును తిరస్కరించవచ్చు.

8. మానసిక, ఆర్థిక ఒత్తిళ్లు
ఈఎమ్​ఐలు మిస్ అయినా, లేట్​గా చెల్లించినా ఆర్థిక పరమైన చిక్కులు ఏర్పడతాయి. రుణగ్రహీతల్లో ఆందోళను కలగజేస్తాయి. ఒకవేళ రుణగ్రహీతలు ఆస్తిని కోల్పోవడం లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటే- అది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈఎమ్​ఐలు చెల్లించే క్రమం తప్పితే- రుణదాతలతో మీ సంబంధాలను కూడా దెబ్బతీస్తాయి.

ఈఎమ్​ఐ మిస్​ అయితే ఏం చేయాలి?
వెంటనే రుణగ్రహీతను సంప్రదించండి : మీరు నిజమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లైతే, చాలా మంది రుణదాతలు గ్రేస్ పీరియడ్‌లు లేదా రుణగ్రహీతలకు తాత్కాలిక ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకుంటారు. పెనాల్టీలు కట్టకుండా ఉండాలంటే- మీ పరిస్థితిని రుణదాతలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కీలకం.

లోన్​ రీస్ట్రక్షరింగ్ కోసం అభ్యర్థించండి : మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈఎమ్​ఐ చెల్లింపులు చేయలేకపోతే లోన్​ టెన్యూర్​ను పొడగించమని అడగండి. లేదా తాత్కాలికంగా ఈఎమ్​ఐ మొత్తాన్ని తగ్గించమని విజ్ఞప్తి చేయండి.

లోన్​ మారటోరియం కోసం ఆన్వేషించండి : మీరు తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు(ఉదా : ఉగ్యోగం కోల్పోవడం, మెడికల్ ఎమర్జెన్సీ.,)- లోన్​ మారటోరియంకు అర్హులు కావచ్చు. దీంతో మీరు పెనాల్టీలు లేకుండా ఈఎమ్​ఐలు చెల్లించకుండా ఉండవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.