UPI Service Down : దేశంలో యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. యూపీఐ లావాదేవీలు సరిగా జరగడం లేదని పేర్కొంటూ కొందరు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి పలు బ్యాంకింగ్ సేవలతో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్ వంటి యాప్‌ల వినియోగంలో ఇబ్బందులు ఎదురైనట్లు నెటిజన్ల పోస్టుల ద్వారా తెలుస్తోంది.
ఈ సమస్యను గుర్తించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో పేర్కొంది. కొన్ని బ్యాంకుల్లో అంతర్గత సాంకేతిక సమస్యలు ఉన్నట్లు తెలిపింది. ఈ ఫలితంగా యూపీఐ కనెక్టివిటీలో అంతరాయం ఏర్పడిందని వివరించింది. ఎన్పీసీఐ వ్యవస్థలన్నీ సక్రమంగానే పని చేస్తున్నాయని స్పష్టం చేసింది. సమస్యలు ఉన్న బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. సమస్యను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
కాగా కొందరు యూజర్లు సర్వర్ సంబంధిత సమస్యలను ప్రస్తావిస్తూ పోస్టులు చేస్తున్నారు. నగదు బదిలీతో పాటు మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఎదురైనట్లు ఫిర్యాదులు చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంక్‌ల వినియోగదారుల నుంచి ఫిర్యాదులు నమోదైనట్లు 'డౌన్‌డిటెక్టర్' సంస్థ తెలిపింది.
పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు - మరి ఖాతాదారుల డబ్బు సేఫేనా? లోన్స్ పరిస్థితి ఏమిటి?
Paytm Payments Bank RBI ban Can You Port Wallet FASTags : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) ఫిబ్రవరి 29 తరువాత ఖాతాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఇటీవలే ఆర్బీఐ ఆదేశించింది. అలాగా పేటీఎం అందించే పలు సేవలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పేటీఎం ఖాతాదారుల పరిస్థితి ఏమిటి? వాళ్ల డబ్బులు సురక్షితమేనా? పేటీఎం వాలెట్స్, ఫాస్టాగ్ల్లోని డబ్బులు వాడుకోవచ్చా? మొదలైన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీఐ పేమెంట్స్
పేటీఎం యూజర్లు ఫిబ్రవరి 29 వరకు యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. కనుక వారిపై తక్షణ ప్రభావం ఏమీ ఉండదు. కానీ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుపడదు. కనుక ఇప్పటి నుంచే మరో ప్రత్యామ్నాయం ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మీ యూపీఐ ఐడీ - ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ఇతర బ్యాంకులతో లింక్ అయ్యుంటే మీకు ఎలాంటి సమస్య ఏర్పడదు. కనుక నేరుగా ఎప్పటిలానే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.