ETV Bharat / business

అదిరే ఫీచర్స్​తో - 2024-25లో లాంఛ్ కానున్న మారుతి కార్స్​ ఇవే! ధర ఎంతంటే? - Upcoming Maruti Suzuki Cars In 2024

Upcoming Maruti Suzuki Cars In 2024-25 : మారుతి కార్​ లవర్స్​కు గుడ్ న్యూస్​. మారుతి సుజుకి కంపెనీ త్వరలో 3 న్యూ-జెన్​ కార్లను ఇండియాలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. డిజైన్ పరంగా వీటిలో పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం. మరెందుకు ఆలస్యం, ఈ నయా కార్లలోని లేటెస్ట్ ఫీచర్స్ సహా​, ప్రైస్​ వివరాల గురించి తెలుసుకుందాం రండి.

Upcoming Maruti Cars In India 2024
Upcoming Maruti Suzuki Cars In 2024-25
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 1:26 PM IST

Upcoming Maruti Suzuki Cars In 2024-25 : మన దేశంలో పరిచయం అక్కరలేని పేరు మారుతి సుజుకి. ఏటా అత్యధిక కార్ల సేల్స్‌తో ఈ కంపెనీ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంటుంది. మారుతి సుజుకి ఈ ఏడాది మూడు న్యూ-జెన్​ కార్లను ఇండియన్​ మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అవి: న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్, న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్​ ఫేస్​లిఫ్ట్. ఈ న్యూ మోడల్ కార్లలో కొత్త రకం ఇంజన్లు, ఫీచర్లు ఉంటాయని సమాచారం.

1. New Gen Maruti Suzuki Swift : న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారును YED అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు. గత ఏడాది చివర్లో జపాన్ రాజధాని టోక్యోలో దీన్ని ఆవిష్కరించారు. ఈ కారును ప్రస్తుతం భారత దేశ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రీడిజైన్ చేస్తున్నారు. వచ్చే నెలలోనే (ఏప్రిల్‌లో) దీన్ని లాంఛ్​ చేయాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ కారులో సరికొత్త 1.2లీటర్​ Z సిరీస్‌కు చెందిన మూడు సిలిండర్ల Z12E పెట్రోల్ ఇంజన్ ఉంటుందని సమాచారం. అంతేకాదు మంచి మైలేజీని ఇచ్చేందుకు దీనిలో తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్‌ను జతపరిచారని తెలుస్తోంది. ఈ కారు వీల్స్ 15 మిల్లీమీటర్ల పొడవు, 30 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటాయి. కారు లోపల పెద్ద ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్​-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ HVAC అమర్చినట్లు సమాచారం.

2. New Gen Maruti Suzuki Dzire : ఈ ఏడాది అక్టోబరు నాటికి న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కారును విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు ‘డిజైర్’ మోడల్‌లో వచ్చిన కార్లు దేశంలో పెద్దఎత్తున అమ్ముడయ్యాయి. కొత్త మోడల్‌తో సేల్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కారుపై కొత్తగా సన్‌రూఫ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే, సన్‌రూఫ్‌ ఫెసిలిటీ పొందిన తొలి సెడాన్ కారుగా న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ నిలుస్తుంది. దీని కొలతలన్నీ పాత మోడల్‌ తరహాలోనే ఉంటాయని సమాచారం. ఈ కారులో 1.2లీటర్​ Z సిరీస్‌కు చెందిన మూడు సిలిండర్ల Z12E పెట్రోల్ ఇంజిన్‌‌ అమరుస్తున్నారు. దీనికి మాన్యువల్​, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్లను జతపరుస్తున్నారని సమాచారం. వీటికి అదనంగా ఆటోమేటిక్ HVAC, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సైతం కారులో ఉంటాయి. కొత్త తరహా ఫ్రంట్ గ్రిల్, అప్‌గ్రేడ్ చేసిన హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, కొత్త సెట్ బంపర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఈ న్యూ-జెన్ మారుతి స్విఫ్ట్​, డిజైర్​ కార్లు రెండూ సీఎన్​జీ వేరియంట్లలోనూ లభిస్తాయి.

3. New Gen Maruti Suzuki Fronx : మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ కారును YTB అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది (2025) మొదట్లో లాంఛ్​ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కారులో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్‌ టెక్నాలజీ ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 1.2లీటర్​ Z సిరీస్‌కు చెందిన పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ మూడు కార్ల ధరలు రూ.10 లక్షల లోపే ఉంటాయని మార్కెట్ వర్గాల టాక్​.

ప్రపంచంలోనే మొదటి 'బజాజ్​ బ్రాండ్' సీఎన్​జీ బైక్​ - లాంఛ్ ఎప్పుడంటే? - Bajaj CNG Bike Launch Soon

కొత్త స్కూటీ కొనాలా? ఆ మోడల్​పై ఏకంగా రూ.45వేలు డిస్కౌంట్​! - Scooter Offers In March 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.