Payment Of Taxes When Losses In Mutual Funds : ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడులు వేగంగా వృద్ధి చెంది మంచి రాబడి రావాలని ఆశిస్తారు. ఈ క్రమంలో మంచి మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయాలని భావిస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడిని పొందినప్పుడు లాభాలపై పన్ను కట్టాలా? పన్ను శాతం ఏంత? మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో నష్టపోయినా పన్ను చెల్లించాలా? మినహాయింపులు ఉంటాయా? అనే అనుమానాలు చాలా మంది ఇన్వెస్టర్లలో ఉంటాయి. మరెందుకు ఆలస్యం ఈ స్టోరీలో వాటికి సమాధానాలు తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మన డబ్బులను ఈక్విటీలు, డెట్ ఆప్షన్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెడతాయి. వాటిపై వచ్చే ఆదాయాన్ని ఇన్వెష్టర్లకు పంచుతాయి. పెట్టుబడిదారులు పొందే రాబడినే మూలధన లాభాలు అంటారు. పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్లను 12 నెలల్లోపు విక్రయించడం ద్వారా స్వల్పకాలిక మూలధన లాభాలను పొందుతారు. ఏడాది కంటే ఎక్కువ కాలం ఉంచిన తర్వాత వాటిని విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాలను అందుకుంటారు.
మ్యూచువల్ ఫండ్ మూలధన లాభాలపై పన్ను రేట్లు?
ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చే లాభాలను ఏడాదిలోపు (స్వల్పకాలిక మూలధన లాభాలు) విక్రయిస్తే 15 శాతం, ఏడాది తర్వాత అమ్మితే (దీర్ఘకాలిక మూలధన లాభాలు) 10 శాతం టాక్స్ కట్టాలి. అలాగే ఈ పన్నుతో పాటు సంబంధిత సెస్, సర్ ఛార్జ్‌లు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
దీర్ఘకాలిక మూలధనంపై పన్ను మినహాయింపు ఉంటుందా?
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.1 లక్ష కంటే ఎక్కువ దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను విధిస్తారు. అంటే రూ.లక్ష లోపు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ఉండదు.
ఉదాహరణ : ఒక వ్యక్తి ఈక్విటీ ఫండ్స్ నుంచి రూ.2.5 లక్షల దీర్ఘకాలిక మూలధన లాభాలను కలిగి ఉన్నాడని అనుకుందాం. అతడు రూ.2.5 లక్షల దీర్ఘకాలిక మూలధన లాభాలుపై పన్ను కట్టక్కర్లేదు. రూ. 1.5 లక్షల దీర్ఘకాలిక లాభాలపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది (రూ. 1 లక్ష వార్షిక మినహాయింపు కారణంగా). సెస్, సర్ ఛార్జీలు మరో రూ.15వేల వరకు ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు కూడా పన్ను కట్టాల్సి ఉంటుంది.
డెట్ ఫండ్స్‌కు పన్ను శాతం ఎంత?
డెట్ ఫండ్స్‌పై ఉన్న పన్ను రాయితీని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఎత్తివేసింది. డెట్ ఫండ్స్‌పై వచ్చే రాబడిపై ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో నష్టపోతే పన్ను కట్టాలా?
పెట్టుబడిదారుడికి ఈక్విటీ ఫండ్స్‌లో నష్టాలు వస్తే వాటిని తర్వాత ఏడాదికి పొడిగించుకోవచ్చు.