ETV Bharat / business

త్వరలో టాటా కర్వ్ ఈవీ లాంఛ్ -​ 500 కి.మీ రేంజ్​ - ధర ఎంతంటే? - Tata Curvv Electric Car - TATA CURVV ELECTRIC CAR

Tata Curvv Electric Car : టాటా మోటార్స్ కంపెనీ​ స్లీక్ కూపే-డిజైన్​తో కర్వ్​ ఎలక్ట్రిక్​ కారును రూపొందిస్తోంది. ఈ కారు సింగిల్ ఛార్జ్​తో 500 కి.మీ రేంజ్​ ఇస్తుందని సమాచారం. త్వరలోనే దీనిని లాంఛ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మరి దీని ఫీచర్స్, స్పెక్స్, ధర వివరాలపై మనం ఓ లుక్కేద్దామా?

Tata Curvv Electric Car
Tata Curvv EV
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 4:48 PM IST

Tata Curvv Electric Car : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్​ సరికొత్త డిజైన్​తో కర్వ్​ ఈవీని రూపొందిస్తోంది. కూపే-స్టైల్​ రూఫ్​తో వస్తున్న ఈ ఎస్​యూవీపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని ఉంది. వాస్తవానికి టాటా కంపెనీ 'భారత్ మొబిలిటీ గ్లోబల్​ ఎక్స్​పో 2024'లోనే ఈ ప్రొడక్షన్ రెడీ మోడల్​ను ఆవిష్కరించింది.

Tata Curvv EV Features : ఈ కర్వ్ ఈవీ హై-గ్లోస్​ బ్లాక్​ ఫినిస్​తో ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది. ఇంటీరియర్ చాలా విలాసంగా, ప్రీమియం ఫినిషింగ్​తో వస్తుంది. హెవీ లగేజ్ పెట్టడానికి అనువైన బూట్​ స్పేస్ దీనిలో​ ఉంది.

ఈ టాటా కర్వ్ ఈవీలో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్​ చేస్తే 500 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. టాటా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ కారు ఇంటీరియర్​ను కూడా సరికొత్త డిజైన్​తో రూపొందిస్తోంది. అలాగే దీనిలో అధునాతన ఫీచర్లను జోడిస్తోంది.

టాటా కర్వ్​ ఈవీలో 10.25 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్​ సిస్టమ్​ అమరుస్తున్నారు. అలాగే దీనిలో వైర్​లెస్​ స్మార్ట్​ఫోన్ ఛార్జర్​, టూ-స్పోక్​ స్టీరింగ్ వీల్​, ఆంబియంట్​ లైటింగ్​, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్​, కెపాసిటివ్ కంట్రోల్ లెవెల్​-2 ఏడీఏఎస్​, పనోరమిక్​ సన్​రూఫ్​, 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో 6-ఎయిర్ బ్యాగ్స్​ను అమరుస్తున్నారు. వీల్స్​ ఎయిరో బ్లేడ్​ డిజైన్​తో హోలిస్టిక్​ ఫీల్​ను ఇస్తాయి.

ఈ​ కారులో న్యూ 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ అమరుస్తున్నారు. ఇది మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై ఉంటుంది. మార్కెట్లో ఇది హ్యుందాయ్​ క్రెటా, ఫోక్స్​వ్యాగన్ టైగన్​లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Tata Curvv EV Price : టాటా కంపెనీ ఈ కర్వ్ ఈవీని ఈ ఏడాది మధ్యలోనే విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర బహుశా రూ.15 లక్షలు - రూ.16 లక్షలు ప్రైస్​ రేంజ్​లో ఉంటుందని అంచనా. అయితే వీటి గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వర్కింగ్ ఉమెన్​కు, కాలేజ్ అమ్మాయిలకు ఉపయోగపడే టాప్​-10 స్కూటీస్​ ఇవే! - Best Scooters

హాట్ సమ్మర్​లో కూల్​గా కార్ డ్రైవ్ చేయాలా? ఈ టాప్​-5 AC మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే! - Car AC Maintenance Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.