12.30 PM : శనివారం నిర్వహించిన రెండో ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతం మేర పెరిగింది. విదేశీ పెట్టుబడులు కూడా భారీగా తరలి వచ్చాయి. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 58 పాయింట్లు లాభపడి 73,804 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 37 పాయింట్లు వృద్ధి చెంది 22,376 వద్ద స్థిరపడింది.
- లాభపడిన షేర్లు : టాటా స్టీల్, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్
- నష్టపోయిన షేర్లు : ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్
12.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 73,839 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 45 పాయింట్లు వృద్ధి చెంది 22,384 వద్ద కొనసాగుతోంది.
11.30 AM : సెకెండ్ ట్రేడింగ్ సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 73,890 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 55 పాయింట్లు వృద్ధి చెంది 22,394 వద్ద కొనసాగుతోంది.
10.00 AM : శనివారం నిర్వహించిన ఫస్ట్ స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 73,860 వద్ద ట్రేడ్ ఆల్-టైమ్ హై లెవల్స్ వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 56 పాయింట్లు వృద్ధి చెంది 22,395 జీవనకాల గరిష్ఠాల వద్ద స్థిరపడింది.
Stock Market Today March 2nd 2024 : శనివారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు జీవన కాల గరిష్ఠాలను తాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 236 పాయింట్లు లాభపడి 73,982 వద్ద ఆల్-టైమ్ హై రికార్డును తాకింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 81 పాయింట్లు వృద్ధి చెంది 22,420 రికార్డ్ పీక్‌ను టచ్ చేసింది. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతం మేర పెరగడం సహా, విదేశీ పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్ సెషన్లోనూ భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 73,860 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 56 పాయింట్లు వృద్ధి చెంది 22,395 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టాటా స్టీల్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, విప్రో, ఏసియన్ పెయింట్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్
స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్
శనివారం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (BSE), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) రెండు స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటలు వరకు కొనసాగుతుంది. రెండో సెషన్ ఉదయం 11.30 గంటల నుంచి 12.30 మధ్య జరుగుతుంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు, విపత్తు సంసిద్ధతను అంచనా వేసేందుకు ఈ రెండు స్పెషల్ సెషన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ట్రేడింగ్ సెషన్‌ను ఎన్ఎస్ఈ ప్రైమరీ వెబ్సైట్లో, రెండో ట్రేడింగ్ సెషన్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీకి సంబంధించిన రికవరీ సైట్లో నిర్వహిస్తారు.
సెబీ మార్గదర్శకాల ప్రకారం
సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అయితే డిజాస్టర్ రికవరీ సైట్ (డీఆర్ఎస్), బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్ (బీసీపీ) ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్గదర్శకాలను రూపొందించింది. వాటికి అనుగుణంగానే ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు ఈ స్పెషల్ లైవ్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నాయి.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,245 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
ముడి చమురు ధర
Crude Oil Prices March 2nd 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83.55 డాలర్లుగా ఉంది.
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన - 97.62% నోట్లు వాపస్!
ఎస్బీఐ డెబిట్ కార్డును యాక్టివేట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!