Stock Market Close April 15th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. సెన్సెక్స్ 845 పాయింట్లు నష్టపోయి 73,399 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయి 22,272 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడమే ఇందుకు కారణం. మరోవైపు యూఎస్ ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే భారీగా పెరుగుతోంది. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇవి కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
- లాభపడిన స్టాక్స్ : నెస్లే ఇండియా, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్
- నష్టపోయిన షేర్స్ : విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సెర్వ్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.8,027 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లో సియోల్, టోక్యో, హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. షాంఘై ఒక్కటే లాభాలతో స్థిరపడింది. యూరోపియన్ మార్కెట్లు ప్రస్తుతం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
ముడిచమురు ధర
Crude Oil Prices April 15th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.04 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 89.51 డాలర్లుగా ఉంది.
రూపాయి విలువ
Rupee Open March April 15th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44గా ఉంది.
03.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 838 పాయింట్లు నష్టపోయి 73,406 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 248 పాయింట్లు కోల్పోయి 22,271 వద్ద కొనసాగుతోంది.
01.10 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయి 73,645 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 175 పాయింట్లు కోల్పోయి 22,344 వద్ద కొనసాగుతోంది.
12.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 487 పాయింట్లు నష్టపోయి 73,757 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 139 పాయింట్లు కోల్పోయి 22,379 వద్ద కొనసాగుతోంది.
11.42 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 496 పాయింట్లు నష్టపోయి 73,743 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 143 పాయింట్లు కోల్పోయి 22,376 వద్ద కొనసాగుతోంది.
Stock Market Today April 15th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 929 పాయింట్లు, నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయాయి. కీలకమైన అన్ని రంగాలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Reasons For Stock Market Crash : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, భారత్-మారిషస్ పన్ను ఒప్పందంలో మార్పులు ప్రతిపాదించడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడమే ఇందుకు కారణం. మరోవైపు ఊహించిన దానికంటే యూఎస్‌లో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇవి కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 768 పాయింట్లు నష్టపోయి 73,466 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 231 పాయింట్లు కోల్పోయి 22,288 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టీసీఎస్, నెస్లే ఇండియా, టైటాన్, భారతీ ఎయిర్టెల్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టాటా మోటార్స్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, విప్రో, ఐటీసీ
విదేశీ పెట్టుబడులు
FIIs Investments : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.8,027 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
ఆసియా మార్కెట్లు
Asian Markets Today April 15th 2024 : ఏసియన్ మార్కెట్లో సియోల్, టోక్యో, హాంకాంగ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. షాంఘై ఒక్కటే లాభాల్లో ట్రేడ్ అవుతోంది. శుక్రవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
రూపాయి విలువ
Rupee Open March April 15th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices April 15th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.17 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 90.30 డాలర్లుగా ఉంది.
నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today April 15th 2024
భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం - పక్కాగా ప్లాన్ చేసుకోండిలా! - Personal Financial Planning