ETV Bharat / business

దలాల్ స్ట్రీట్‌లో లాభాల జోష్‌ - మళ్లీ సెన్సెక్స్ 80,000+

భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్ 602 పాయింట్స్‌, నిఫ్టీ 186 పాయింట్స్ అప్‌ - కారణాలు ఇవే!

Share Market
Bull Market (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Stock Market Close Today October 28, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. దీనితో మదుపరులు మంచి లాభాలు గడించారు. వరుస 5 రోజుల నష్టాల తరువాత, విలువైన కంపెనీల స్టాక్‌లు చాలా తక్కువ ధరకు దొరుకుతున్న నేపథ్యంలో మదుపరులు వాటిని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్లకు కలిసొచ్చింది. ఓవైపు ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉంటే, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇది కూడా దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది.

చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 602 పాయింట్లు లాభపడి 80,005 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 186 పాయింట్లు వృద్ధి చెంది 24,367 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు : ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఎం అండ్ ఎం, హిందూస్థాన్ యూనిలివర్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ
  • నష్టపోయిన షేర్లు : యాక్సిస్ బ్యాంక్‌, కోటక్ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతి సుజుకి

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,036.75 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,159.29 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

గ్లోబల్ మార్కెట్స్‌
ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ లాభాలతో ముగిశాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలతో స్థిరపడ్డాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌గా ఉంది. ప్రస్తుతం యూఎస్ డాలర్‌తో పోల్చితే, రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.

ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 5.84 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 71.54 డాలర్లుగా ఉంది.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.