ETV Bharat / business

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు - పతనమైన బ్యాంకింగ్ షేర్లు!

Stock Market Close Today March 11th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 616 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు మేర నష్టపోయాయి. బ్యాంకింగ్ సెక్టార్ పూర్తిగా కుదేలైంది.

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 3:55 PM IST

Updated : Mar 11, 2024, 4:23 PM IST

Share Market Close Today March 11th 2024
Stock Market Close Today March 11th 2024

Stock Market Close Today March 11th 2024 : సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దీనితో వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. బ్యాంకింగ్, మెటల్​ షేర్లు పూర్తిగా పతనం కావడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 616 పాయింట్లు నష్టపోయి 73,502 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయి 22,332 వద్ద స్థిరపడింది.

  • లాభపడిన స్టాక్స్​​ : నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్​సెర్వ్​, బజాజ్ ఫైనాన్స్​, టీసీఎస్​, ఏసియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్​, టెక్ మహీంద్రా
  • నష్టపోయిన షేర్స్​ : పవర్​గ్రిడ్​, టాటా స్టీల్​, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎన్​టీపీసీ, టాటా మోటార్స్​, ఇన్ఫోసిస్​, ఐటీసీ, రిలయన్స్​

విదేశీ పెట్టుబడులు
FIIs Investments : స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.7,304 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

ఆసియా మార్కెట్లు
Asian Markets March 11th 2024 : ఏసియన్ మార్కెట్లలో జపాన్​కు చెందిన నిక్కీ, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ నష్టపోగా; హాంకాంగ్​కు చెందిన హ్యాంగ్​సెంగ్​, షాంఘై కాంపోజిట్​ లాభాలతో ముగిశాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

రూపాయి విలువ
Rupee Open March 11th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 8 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.75గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices March 11th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices March 11th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.29 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.32 డాలర్లుగా ఉంది.

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ 10 తప్పులు అస్సలు చేయకండి!

నెలకో కొత్త కారులో తిరగాలా? అయితే 'సబ్​స్క్రిప్షన్​​ ప్యాకేజీ'ల గురించి తెలుసుకోండి!

Last Updated : Mar 11, 2024, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.