Stock Market Close Today March 1st 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతం మేర పెరగడం సహా, విదేశీ పెట్టుబడులు తరలి వస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1,2 పాయింట్లు లాభపడి 73,745 వద్ద ఆల్‌టైమ్ హై-రికార్డ్‌తో స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 335 పాయింట్లు వృద్ధి చెంది 22,338 వద్ద జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిసింది.
Stock Market All Time High Today : దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇంట్రాడేలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను తాకాయి. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో ఉన్న సానుకూల వాతావరణంతో పాటు కీలక షేర్లు రాణించడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1,139 పాయింట్లు లాభపడి 73,639 వద్ద ఆల్‌టైమ్ హై-రికార్డ్‌ను నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 335 పాయింట్లు వృద్ధి చెంది 22,318 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, టైటన్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.
నష్టాల్లోని షేర్లు : హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, విప్రో షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.
జీడీపీ వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది. వ్యవసాయ రంగం నెమ్మదించినా, తయారీ రంగంలో రెండంకెల వృద్ధి నమోదు అయ్యింది. గనుల తవ్వకం, నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించాయి. దీనితో మూడో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4% వృద్ధి చెందింది. మరోవైపు 2023-24 మొత్తం మీద వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కావచ్చు అని ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. ఈ గణాంకాలు సూచీల్లో ఉత్సాహం నింపాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. త్వరలో అమెరికాలో వడ్డీరేట్ల కోతపై ఫెడరల్ రిజర్వ్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం సైతం దిగొచ్చే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు రాణించాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు కూడా పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, మార్కెట్లు రికార్డు గరిష్ఠాలకు చేరాయి.
వాణిజ్య సిలిండర్ ధర రూ.25 పెంపు - వంట గ్యాస్ రేటు ఎంతంటే?
పేటీఎం సంక్షోభం - PPBLతో ఒప్పందాలు రద్దు చేసుకున్న మాతృసంస్థ