ETV Bharat / business

నెలకు రూ.9500 పెట్టుబడి పెట్టండి - రూ.4.6 కోట్లు సంపాదించండి - ఎలా అంటే? - Smart SIP Tips - SMART SIP TIPS

Smart SIP Tips : కోటీశ్వరులు కావడం అనేది ఒకప్పుడు కలగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఎవరికైనా సాధ్యమే. కాకపోతే దీనికి ఎంతో ఆర్థిక క్రమశిక్షణ అవసరం. మీరు నెలకు కేవలం రూ.9500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే చాలు, చాలా తక్కువ కాలంలోనే కోటీశ్వరులు కావచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Mutual Fund SIP tips
Smart SIP Tips in Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 1:31 PM IST

Smart SIP Tips : ఈ రోజుల్లో చట్టబద్ధంగా డబ్బు సంపాదించుకునేందుకు చాలా మంది ఎంచుకుంటున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్. అందులోనూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్ (సిప్) అనేది చిన్న చిన్న మొత్తాలతో మిమ్మల్ని కోటీశ్వరులు అయ్యోలా చేస్తోంది. అందుకే చిన్న పెట్టుబడిదారులు కూడా ఇలాంటి సిప్​పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మంచి భవిష్యత్తుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సిప్ విధానంలో మ్యుచువల్ ఫండ్స్ దీర్ఘకాలంపాటు పెట్టుబడులు పెట్టాలి. కేవలం ఒకటి, రెండేళ్లు మాత్రమే పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ రావు. కనీసం 15 నుంచి 20ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అలా జరగాలంటే ఎంతో పట్టుదల, క్రమశిక్షణ అవసరం. నిజంగా ఇలా దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే, కచ్చితంగా కోటీశ్వరులు కావచ్చు.

సిప్ ఎందుకు?
సిప్​ విధానంలో పెట్టుబడి పెట్టేందుకు రోజు, వారం, నెలవారీగా - ఇలా చాలా ఆప్షన్లు ఉంటాయి. చాలా మంది నెలవారీ ఆప్షన్​ను ఎంచుకుంటారు. వారికి ఏ నెలకు ఆ నెల మొత్తం పెట్టుబడిపై రాబడి వస్తుంటుంది. వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్​లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. సాధారణ భాషలో చెప్పాలంటే చక్రవడ్డీ లాంటి ప్రభావం ఉంటుంది. అందువల్ల కాలం గడుస్తున్న కొద్దీ మీ పెట్టుబడి మొత్తం బాగా పెరుగుతుంటుంది.

కాంపౌండింగ్ ఎఫెక్ట్​
ఉదాహరణకు మీరు నెలవారీ రూ.9500 చొప్పున పెట్టుబడి పెట్టారనుకుందాం. వార్షిక రాబడి 17 శాతం వరకు వస్తుందని అనుకుందాం. అప్పుడు మీకు 25 ఏళ్లలో 4.6 కోట్ల రాబడి వస్తుంది. అంటే మీరు కేవలం 25 ఏళ్లలోనే కోటీశ్వరులు అయిపోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే?

  • మీరు పెట్టిన పెట్టుబడి కేవలం రూ.28,50,000 (రూ.28.5 లక్షలు)
  • మ్యూచువల్​ ఫండ్ మెచ్యూరిటీ రూ.4,55,96,882 (రూ.4.55 కోట్లు)
  • మీకు వచ్చిన మొత్తం లాభం : రూ.4,27,46,882 (రూ.4.27 కోట్లు)

ఇతర పెట్టుబడులతో పోల్చితే!

చూశారుగా, ఈ పొదుపు పథకాలు అన్నీ సురక్షితమైన రాబడులను ఇస్తాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్​తో పోలిస్తే, వీటి నుంచి వచ్చే రాబడి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కాస్త రిస్క్ తీసుకునేవాళ్లు సిప్​ విధానంలో మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి దీనిలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

జీతం పెరిగిందా? ఈ టిప్స్ పాటిస్తే - మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరడం పక్కా! - Salary Management Tips

రూ.10 లక్షల్లో క్రూయిజ్ కంట్రోల్ కార్లు కొనాలా? టాప్​ -5 మోడల్స్ ఇవే! - Best Cruise Control Cars In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.