Sensex Nifty Hit All Time Peaks : బ్యాంకింగ్, ఆయిల్, ఆటో షేర్లలో భారీగా కొనుగోళ్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం జీవన కాల గరిష్ఠానికి చేరాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1,197 పాయింట్లు లాభపడి 75,418 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 370 పాయింట్లు వృద్ధి చెంది 22,968 వద్ద ముగిసింది. మార్కెట్లో సానుకూల పవనాల నేపథ్యంలో భారీ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్‌ను ముగించాయి.
లాభపడిన స్టాక్స్ : ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాసెమ్కో, టైటాన్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, టాటా మోటార్స్, ఎస్ బీఐఎన్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా
నష్టపోయిన షేర్లు : ఎన్ టీపీసీ, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా
ఆర్బీఐ డివిడెండ్
'కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.2.1 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ను ప్రకటించిన తర్వాత ఈక్విటీ మార్కెట్లో ఉత్సాహం నెలకొంది. అందుకే దేశీయ మార్కెట్లు గురువారం లాభాలబాట పట్టాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే జూన్ మొదటి వారంలో నిఫ్టీ కొత్త గరిష్ఠాలను చేరుకుంటుందని మేము భావిస్తున్నాము' అని యాక్సిస్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ హెడ్ నీరజ్ చదవార్ అంచనా వేశారు. 'కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ. 2.1 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించిన తర్వాత నిఫ్టీ జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది. ఆర్బీఐ ప్రకటించిన డివిడెండ్ మార్కెట్‌కు గణనీయమైన స్థూల ఆర్థిక సానుకూలతను ఇచ్చింది.' అని మరో ఆర్థిక నిపుణుడు తెలిపారు.
ఆసియా స్టాక్ మార్కెట్లు
గురువారం సియోల్, షాంఘై, హాంకాంగ్ మొదలైన ఆసియా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. టోక్యో మార్కెట్ మాత్రం లాభాల్లో ముగిసింది. మరోవైపు, యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.
ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.33 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.17 డాలర్లుగా ఉంది.
మీరు ఉద్యోగులా? ITR ఫైల్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు మర్చిపోకండి! - Salaried Taxpayer ITR Filing
గుడ్‌న్యూస్- భారీగా తగ్గిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో నేటి లెక్కలు ఇలా! - Gold Rate Today