ETV Bharat / business

SBI లాభం 18% జంప్- 3 నెలల్లోనే రూ.21,384 కోట్లు ప్రాఫిట్ - SBI Q4 Results 2024 - SBI Q4 RESULTS 2024

SBI Q4 Results 2024 : స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిన ఫలితాలను ప్రకటించింది. 18శాతం వృద్ధితో రూ. 21,384 కోట్లు నికర లాభాన్ని నమోదు చేసింది. మరోవైపు హెచ్​పీసీఎల్​ 25 శాతాన్ని నష్టాన్ని నమోదు చేసింది.

SBI Q4 Results 2024
SBI Q4 Results 2024 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 4:02 PM IST

SBI Q4 Results 2024 : ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను(Q4) ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 21,384 కోట్లు నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 18,093.84 కోట్ల నికర లాభంతో పోలిస్తే 18.18శాతం వృద్ధిని నమోదు చేసింది.

SBI Consolidated net profit: 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభం 20.55 శాతం పెరిగి రూ. 67,084.67 కోట్లకు చేరింది. అదే గతేడాలో రూ. 55,648.17 కోట్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు పెరిగింది. అయితే నిర్వహణ ఖర్చులు రూ.29,732 కోట్లతో పోలిస్తే రూ. 30,276 కోట్లకు చేరాయి. మొత్తం కేటాయింపులు గతేడాది కాలంలో రూ.3,315 కోట్ల నుంచి దాదాపు సగానికి తగ్గి రూ.1,609 కోట్లకు చేరుకున్నాయి.

SBI Non performing Assets (NPA) :ఎస్​బీఐ స్థూల నిరర్ధక ఆస్తులు( Gross-NPA) 2024 మార్చి 31 నాటికి 2.24 శాతానికి తగ్గాయి. గతేడాది ఎన్​పీఏలు 2.78శాతంగా ఉన్నాయి. డిసెంబర్​లో 2.42శాతంగా ఉన్నాయి. ఇక ఎస్​బీఐ షేర్లు బీఎస్​ఈలో 1.81శాతం పెరిగి రూ.825.10 వద్ద ట్రేడవుతోంది.

HPCL Q4 Results 2024 : హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) నాలుగో త్రైమాసికంలో 25శాతం నష్టాన్ని చవి చూసింది. 2023-24 చివరి త్రైమాసిక నికర లాభం రూ. 2,709.31 కోట్లు ప్రకటిచింది. అదే గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,608.32 నికర లాభన్ని నమోదు చేసింది.

హెచ్​పీసీఎల్ ప్రతి బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా 6.93 డాలర్ల రిఫైనింగ్ మార్జిన్​ అందుకుంది. అదే గత త్రైమాసికంలో 8.50 డాలర్లుగా ఉంది. ఇక టర్నోవర్​ రూ. 1.22 లక్షల కోట్లు నమోదు చేసింది. గతేడాదిలో రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. 2023-24 మొత్తం ఆర్థిక సంవత్సరానికి హెచ్​పీసీఎల్​ రికార్డు స్థాయిలో రూ.16,014.61 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అదే గత ఆర్థిక సంవత్సరం రూ. 6,980.23 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

ఇక ఫోన్​లోనే బ్యాంక్ కార్డ్స్​, టికెట్స్, ఐడీ కార్డ్స్- గూగుల్ కొత్త యాప్ లాంఛ్ - Google Wallet Launched In India

చేతిలో డబ్బులు లేవా? డోంట్ వర్రీ - 'క్యాష్​ లెస్ ట్రీట్​మెంట్' చేసే ఆసుపత్రులు ఇవే! - Importance Of Network Hospitals

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.