Rs 49 Jio Cricket Plan : రిలయన్స్ జియో క్రికెట్ లవర్స్ కోసం ఓ సరికొత్త డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. వాస్తవానికి ఇది ఒక యాడ్-ఆన్ డేటా ప్లాన్. దీని ద్వారా కేవలం రూ.49లకే మీరు 25 జీబీ 4జీ డేటాను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 24 గంటలు ఉంటుంది. ఈ 25 జీబీ వాడిన తరువాత యూజర్లు 64kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ను యాక్సెస్ చేయవచ్చు.
యూజర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ జియో క్రికెట్ ప్లాన్ అనేది కేవలం ఒక డేటా ప్లాన్. కనుక ఎలాంటి కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభించవు. పైగా దీని వ్యాలిడిటీ 24 గంటలు మాత్రమే. దీనిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి వీలుపడదు.
4కె ఐపీఎల్ మ్యాచ్‌లు
ప్రస్తుతం టాటా ఐపీఎల్ 2024 టోర్నీ జరుగుతోంది. అందుకే క్రికెట్ లవర్స్ కోసం జియో ఈ సరికొత్త డేటా ప్లాన్‌ను తీసుకువచ్చింది. దీనితో స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే కాదు, హాట్‌స్పాట్‌తో కనెక్ట్ చేసుకుని ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీల్లోనూ క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు. యూజర్లు ఈ డేటా ప్లాన్ ద్వారా 4కె రిజల్యూషన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు.
ఎయిర్టెల్, వీఐ డేటా ప్లాన్స్
రిలయన్స్ జియోలాగానే ఎయిర్టెల్ కూడా రూ.49 డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఒక రోజు వ్యాలిడిటీతో 20జీబీ 4జీ డేటా లభిస్తుంది. వీఐ కూడా రూ.49లకు 6జీబీ డేటాను అందిస్తోంది. కానీ జియో, ఎయిర్‌టెల్‌లతో పోల్చి చూసుకుంటే, ఇది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి.
5జీ యూజర్ల పరిస్థితి ఏమిటి?
మీరు కనుక జియో, ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లు అయ్యుంటే, ఈ నయా రూ.49 డేటా ప్లాన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ రెండు కంపెనీలు చాలా సిటీల్లో పూర్తి ఉచితంగా అన్లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తున్నాయి.
జియో ప్రీపెయిడ్ క్రికెట్ ప్లాన్స్
ఐపీఎల్ ప్రారంభంలోనే జియో రెండు క్రికెట్ ప్లాన్లను తీసుకువచ్చింది. అవి :
- రూ.444 ప్లాన్
- రూ.667 ప్లాన్
రూ.444 ప్లాన్‌లో యూజర్లకు 100 జీబీ డేటా లభిస్తుంది. డేటా ప్యాక్ వ్యాలిడిటీ 60 రోజులు. ఇక రూ.667 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా 150 జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అయితే ఇవి రెండూ ప్రీపెయిడ్ డేటా ప్లాన్స్. అందువల్ల ఎలాంటి కాల్స్, మెసేజెస్ చేయడానికి వీలుపడదు.
కొత్త స్కూటీ కొనాలా? ఆ మోడల్‌పై ఏకంగా రూ.45వేలు డిస్కౌంట్! - Scooter Offers In March 2024