Mumbai Surpasses Beijing : దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరం మరో గొప్ప క్రెడిట్‌ను దక్కించుకుంది. ఆసియాలోనే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరంగా నిలిచింది. ఈ విధంగా చైనా రాజధాని బీజింగ్‌ను అధిగమించి, తొలిసారి ఆసియా బిలియనీర్ క్యాపిటల్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ స్థాయిలో చూసుకుంటే, అత్యంత ఎక్కువ మంది (119) బిలియనీర్లు ఉన్న నగరంగా న్యూయార్క్ ప్రథమ స్థానంలో నిలిచింది. 97మంది బిలియనీర్లతో లండన్ రెండో స్థానంలో ఉంది. 92 మంది బిలియనీర్లతో ముంబయి మూడో స్థానంలో ఉంది.
ఈ ఏడాదికిగానూ అత్యధిక మంది కుబేరులు నివాసముంటున్న నగరాల జాబితాను హురున్ గ్లోబల్ రిచ్ నివేదిక విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం, ఆసియాలో 92 మంది బిలియనీర్లతో ముంబయి మొదటి స్ధానంలో ఉంది. 91 మందితో బీజింగ్ రెండో స్థానానికి పడిపోయింది. గత ఏడాది కాలంలో ముంబయిలో కొత్తగా 26 మంది ధనవంతుల జాబితాలో చేరగా, బీజింగ్‌లో 18 మంది ఈ జాబితా నుంచి వైదొలిగారు. దీనితో ఇప్పుడు బీజింగ్‌లో 91 మంది బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. కనుక బీజింగ్ ప్రపంచ స్థాయిలో నాలుగో స్థానానికి, ఆసియాలో రెండో స్థానానికి పడిపోయింది. 87 మంది బిలియనీర్లతో షాంఘై నగరం ఐదో స్థానంలో నిలిచింది.
శ్రీమంతుల నగరం
ముంబయిలోని బిలియనీర్ల మొత్తం సంపద 445 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది గత ఏడాది కంటే 47శాతం ఎక్కువ. బీజింగ్ బిలియనీర్ల మొత్తం సంపద 265 బిలియన్లు. గత ఏడాదితో పోలిస్తే ఇది 28 శాతం తక్కువ.
ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్ రంగాల నుంచి ముంబయికి కాసుల వర్షం కరుస్తోంది. ముకేశ్ అంబానీ లాంటి బిలియనీర్లు ఇందులో భారీ లాభాలు పొందుతున్నారు. శాతాలవారీగా చూసుకుంటే, రియల్ ఎస్టేట్ ప్లేయర్ మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం ముంబయిలో అత్యధికంగా 116 శాతం మేర లాభాలు సంపాదిస్తోంది.
ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ 10వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ సంపద గణనీయంగా పెరగడంతో 8 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నారు. హెచ్‌సీఈఎల్ శివ్ నాడార్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 34వ స్థానానికి చేరుకున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన సైరస్ ఎన్.పూనావాలా సంపద నికర విలువ స్వల్పంగా క్షీణించి 82 బిలియన్లకు చేరుకుంది. అందుకే ఆయన 9 స్ధానాలు దిగజారి 55వ ర్యాంక్‌కు చేరుకున్నారు. సన్ఫార్మాస్యూటికల్స్కు చెందిన దిలీప్ సంఘ్వీ, కుమార్ మంగళం బిర్లా కూడా ముంబయిలోని కుబేరుల లిస్ట్‌లో నిలిచారు. రాధా కిషన్ దమానీ డీమార్ట్‌ను విజయవంతంగా నడిపిస్తూ, సంపద విషయంలో 8 స్ధానాలు ఎగబాకి 100వ స్థానానికి చేరుకున్నారు. ఈ శ్రీమంతుల కారణంగానే ముంబయి నగరం నేడు బిలియనీర్ల రాజధాని నగరంగా అవతరలించింది.
అదానీ చేతికి మరో పోర్టు - రూ.3,350 కోట్లకు డీల్ ఫిక్స్! - Adani acquire Odisha Gopalpur Port
ప్రపంచంలోనే మొదటి 'బజాజ్ బ్రాండ్' సీఎన్జీ బైక్ - లాంఛ్ ఎప్పుడంటే? - Bajaj CNG Bike Launch Soon