Most Fuel-Efficient Cars In India : ప్రస్తుత కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే వాహనదారులు మంచి మైలేజ్ ఇచ్చే కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారతదేశంలో మంచి ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ ఇచ్చే కార్లను విడుదల చేసిన కంపెనీల్లో మారుతి సుజుకి టాప్ పొజిషన్లో ఉంది. మరోవైపు టయోటా, హోండా కంపెనీలు కూడా బెస్ట్ మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చాయి. మరెందుకు ఆలస్యం సూపర్ ఫీచర్లు, మంచి లుక్స్ కలిగి ఉండి, మంచి మైలేజ్ ఇచ్చే టాప్-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10. Maruti Suzuki Fronx/Toyota Taisor
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.2 లీటర్-ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు మాన్యువల్ గేర్ బాక్స్‌తో 21.79 kmpl మైలేజ్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 22.89 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. మారుతి సుజుకి మరో వేరియంట్ 1 లీటర్-త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 21.50 kmpl మైలేజ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 20.75 kmpl మైలేజ్ అందిస్తుంది. టయోటా టైసర్ కూడా ఇంతే మైలేజ్‌ను ఇస్తుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.52 లక్షలు - రూ.13.04 లక్షల వరకు ఉంటుంది.
9. Maruti Suzuki Baleno/Toyota Glanza
మారుతి బాలెనో, టయోటా గ్లాంజా 1.2 లీటర్- ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. ఈ కార్లు మాన్యువల్, ఆటోమెటిక్ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్ కార్లు 22.35 kmpl మైలేజ్ ఇస్తున్నాయి. అలాగే ఆటోమెటిక్ వెర్షన్ 22.94 kmpl మైలేజ్ అందిస్తున్నాయి. ఈ కార్లలో ఉండే లైట్ క్లచ్, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తాయి. మారుతి సుజుకి బాలెనో ఎక్స్-షోరూమ్ ధర రూ.6.66 లక్షలు - రూ.9.88 లక్షల వరకు ఉంటుంది.
8. Toyota Innova Hycross/Maruti Invicto
ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి ఇన్విక్టో మోడల్ కార్లు 1.2 లీటర్- ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. ఇవి 23.24 kmpl మైలేజ్‌ను అందిస్తాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.19.77 లక్షలు - రూ.30.98 లక్షల వరకు ఉంటుంది.
7. Maruti Suzuki Dzire
ఈ మారుతి సుజుకి డిజైర్ కారు మధ్యతరగతి కస్టమర్లు కొనుగోలు చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ కారు 1.2 లీటర్- ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. డిజైర్ మాన్యువల్ వెర్షన్ 23.26 kmpl మైలేజ్, ఆటోమేటిక్ వెర్షన్ 23.69 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ మారుతి సుజుకి డిజైర్‌లో పెద్ద క్యాబిన్, డ్రైవింగ్ ఫీచర్లు ఉంటాయి. మారుతి సుజుకి డిజైర్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.57 లక్షలు - రూ.9.39 లక్షల వరకు ఉంటుంది.
6. Maruti Suzuki Alto K10
మారుతి సుజుకి ఆల్టో కె10 కారు చాలా తక్కువ ధరలోనే వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ కారు 1 లీటర్- త్రీ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు మాన్యువల్ వెర్షన్ 24.39 kmpl, ఆటోమేటిక్ వెర్షన్ 24.9 kmpl మైలేజ్‌ను అందిస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కె10 మోడల్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 - రూ.5.96 లక్షల వరకు ఉంటుంది.
5. Maruti Suzuki Wagon R 1.0
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 1.0 కారు నడపడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇది రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 1 లీటర్-త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ 24.35 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్ 25.19 kmpl మైలేజ్ ఇస్తుంది. 1.2 లీటర్-ఫోర్ సిలిండర్ ఇంజిన్ వేరియంట్ కూడా ఉంది. ఇది 23.9 kmpl మైలేజ్ ఇస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షలు ఉంటుంది.
4. Maruti Suzuki Swift
ఈ ఫోర్త్ జనరేషన్ మారుతి స్విఫ్ట్ కారు 1.2 లీటర్-త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ 24.80 kmpl మైలేజ్, ఆటోమేటిక్ వెర్షన్ 25.75 kmpl మెలేజ్ అందిస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షలు - రూ.9.65 లక్షల వరకు ఉంటుంది.
3. Maruti Suzuki Celerio
మారుతి సుజుకి సెలెరియోను దేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం ఉన్న కారుగా చెబుతారు. ఈ కారు 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు మాన్యువల్ వెర్షన్ 25.24 kmpl మైలేజ్, ఆటోమేటిక్ వెర్షన్ 26.68 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.5.37 లక్షలు - రూ.7.09 లక్షల వరకు ఉంటుంది.
2. Honda City HEV
పాత సిటీ మోడల్‌ను మరింత ఆధునికీకరిస్తూ ఈ హైబ్రిడ్ మోడల్‌ను తీసుకొచ్చింది హోండా కంపెనీ. 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్ మోటార్ 86 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 94 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్లను ఈ-సీవీటీ సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్కు అనుసంధానించారు. ఈ హైబ్రిడ్ కారు లీటర్ పెట్రోల్‌కు 27.13 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.19.10 లక్షు - రూ.20.65 లక్షల వరకు ఉంటుంది.
1. Maruti Grand Vitara/Toyota Hyryder
గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మంచి ఇంధన సామర్థ్యం ఉన్న కార్లగా పేరుపొందాయి. ఇవి 1.5 లీటర్-ఫోర్ సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు మోడళ్ల కార్లు 27.93 kmpl మైలేజ్ ఇస్తాయి. మారుతి గ్రాండ్ విటారా కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షలు - రూ.20.09 లక్షల వరకు ఉంటుంది.