Maruti Suzuki Cars Global NCAP Ratings : భారతదేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ మునుపెన్నడూ లేనంతగా, చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా లేటెస్ట్ కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం వాహనాల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే 'భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్'ను లాంఛ్ చేసింది. దీని ద్వారా కారులోని సేఫ్టీ ఫీచర్లను టెస్ట్ చేస్తోంది.
భారతదేశంలో రోజురోజుకూ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. పైగా వాహన ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. అందుకే కారు కొనేవాళ్లు కూడా, మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పూర్ సెఫ్టీ రేటింగ్స్
ఇండియాలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి కంపెనీదే ప్రథమ స్థానం. తక్కువ ధరకే మంచి సామర్థ్యం ఉన్న కార్లు కొనాలని అనుకునేవారికి మారుతి కార్లు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. పైగా వీటి నిర్వహణ ఖర్చులు కూడా మిగతా కార్లతో పోలిస్తే, బాగా తక్కువగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది మారుతి కార్లు కొనేందుకు మొగ్గుచూపుతూ ఉంటారు. అయితే ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఎన్సీఏపీ (Global NCAP) చేసిన టెస్ట్‌లో పలు మారుతి కార్లు పేలవమైన పనితీరుతో, 'లో సేఫ్టీ రేటింగ్స్' పొందాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. Maruti Suzuki Ignis - 1 స్టార్
మారుతి సుజుకి ఇగ్నిస్ అడల్ట్ ఆక్యుపెంట్ టెస్ట్‌లో కేవలం 16.48 పాయింట్లు సాధించి, 1-స్టార్ రేటింగ్‌ను అందుకుంది. ముఖ్యంగా ఇగ్నిష్ కార్ బాడీ షెల్ చాలా అస్థిరంగా ఉందని పరీక్షలో తెలిపింది. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), పాదచారుల రక్షణ, భద్రతా (పెడెస్ట్రియన్ ప్రొడక్షన్) ఫీచర్లు నిబంధనలకు అనుగుణంగా లేవు. అందుకే మారుతి ఇగ్నిస్ కారు సేఫ్టీ విషయంలో కేవలం సింగిల్ స్టార్ మాత్రమే సాధించగలిగింది.
2. Maruti Suzuki Swift - 1 స్టార్
ఇండియాలోని పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌ల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్లో ఇది 19.19 పాయింట్స్ సాధించి, 1-స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందగలిగింది. ఈ మారుతి స్విఫ్ట్ కారు బాడీ షెల్, ఫుట్‌వెల్ ఏరియాలు చాలా ఆస్థిరంగా ఉన్నాయి. ఈఎస్సీ, పాదచారుల భద్రతా ఫీచర్లు చాలా పేలవంగా ఉన్నాయి.
3. Maruti Suzuki WagonR - 1 స్టార్
మారుతి సుజుకి వ్యాగనార్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ టెస్ట్‌లో కేవలం 19.69 పాయింట్లు మాత్రమే స్కోర్ చేసి, 1-స్టార్ రేటింగ్ పొందింది. చిన్న పిల్లల రక్షణ విషయంలోనూ చాలా తక్కువ స్కోర్ సాధించింది. ఈ కారులో కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ లేవు. పాదచారుల భద్రతా ఫీచర్లు కూడా సరిగ్గాలేవు. అందుకే ఇది సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో పాల్గొనలేదు.
4. Maruti Suzuki S-Presso - 1 స్టార్
అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్లో 20.30 పాయింట్స్ సాధించి, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 1-స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారు సైడ్ డిఫార్మబుల్ క్రాష్ టెస్ట్‌లో పలు సవాళ్లు ఎదుర్కొంది. పైగా దీనిలో సైడ్ హెడ్ ప్రొటెక్షన్ లేదు. కనుక సీఓపీ (చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్) స్కోర్ బాగా తగ్గిపోయింది. ఎస్-ప్రెస్సో కారు బాడీ షెల్ స్థిరత్వం కూడా బాగా తక్కువగా ఉంది.
5. Maruti Suzuki Alto K10 - 2 స్టార్
మారుతి సుజుకి ఆల్టో కె10 గ్లోబల్ ఎన్సీఏపీ టెస్ట్‌లో 2-స్టార్ రేటింగ్ సంపాదించింది. ఈ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 21.67 పాయింట్లు సంపాదించింది. దీని బాడీ షెల్ స్థిరంగా ఉన్నప్పటికీ, దీనిలో కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ లేవు. పాదచారుల భద్రతా నిబంధనలు కూడా సరిగ్గా పాటించలేదు. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ రేటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది.