ETV Bharat / business

'స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు యథాతథం' - ఆర్థిక శాఖ ప్రకటన - SMALL SAVINGS SCHEME INTEREST RATES

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 9:00 PM IST

Small Savings Schemes Interest Rates In 2024 : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానిగాను చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్​, కిసాన్ వికాస్​ పత్ర, ఎన్​ఎస్​సీ, వడ్డీ రేట్లు ఎప్పటిలానే ఉండనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

NSC Interest Rates 2024
PPF Interest Rates 2024 (ETV Bharat)

Small Savings Schemes Interest Rates In 2024 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికానికిగాను చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లను య‌థాత‌థంగా కొన‌సాగిస్తున్నట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. అంటే పాత వడ్డీ రేట్లే, జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగుతాయని పేర్కొంది.

ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకంపై 8.2% వడ్డీ రేటును అందిస్తున్నారు. మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1%, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF)పై 7.1%, సేవింగ్స్‌ డిపాజిట్‌పై 4.0%, కిసాన్ వికాస్ పత్రపై 7.5% శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC)పై 7.7%, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌పై 7.4% వడ్డీ లభిస్తుంది. అయితే ఈ వడ్డీ రేట్లే సెప్టెబరుతో ముగిసే త్రైమాసికం వరకు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పీపీఎఫ్‌ వడ్డీ రేటును 2020 ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికం నుంచి ఇప్పటి వరకు మార్చలేదు. ప్రభుత్వం ఈ చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లను ప్రతీ త్రైమాసికానికోసారి స‌వ‌రిస్తుంటుంది.

చిన్న మొత్తాల్లో పెట్టుబడికి ఉత్తమ మార్గాలు ఇవే!

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) : ఇది జనాదరణ పొందిన పథకం. ప్రస్తుతం దీనిలో ఉన్న వడ్డీ రేట్లు 7.1 శాతం. వార్షికంగా వడ్డీ కాంపౌండ్ అవుతుంది. ఈ పథకంలో చేసిన పొదుపుతో పాటు దాని మీద వచ్చే రాబడికి కూడా పన్ను మినహాయింపు ఉంది.
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్​సీ) : ఇది ప్రభుత్వం జారీ చేసే బాండ్. 7.7 శాతం వడ్డీని అందిస్తుంది. ఇది వార్షికంగా పెట్టుబడిదారులకు అందుతుంది. ఈ పథకం ఐదు సంవత్సరాల వ్యవధిలో ఉంటుంది. పోస్టాఫీస్​ ద్వారా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు.
  • కిసాన్ వికాస్ పత్ర : కిసాన్ వికాస్ పత్ర 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. సంవత్సరం వారీగా కాంపౌండ్ అవుతుంది. మెచ్యూరిటీ సమయం 124 నెలలు. పోస్టాఫీస్ ఆఫీసులు దీన్ని అందిస్తాయి. దీనిలో పెట్టుబడికి, అదే విధంగా వడ్డీకి ఎలాంటి పన్ను రిబేట్ లభించదు.
  • సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్​వై) : ఇది ఆడపిల్లలకు సంబంధించిన పథకం. దీనిపై లభించే వడ్డీ 8.2 శాతం. అసలు మొత్తంపై వార్షికంగా వడ్డీ జమ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పోస్టాఫీసుల్లో లేదా బ్యాంకుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు తెరవవచ్చు. అమ్మాయికి 21 సంవత్సరాలు నిండిత తర్వాత లేదా పెళ్లి అయినప్పుడు (18 సంవత్సరాల వయస్సు వచ్చిన అనంతరం) ఈ ఖాతా మెచ్యూరిటీ అవుతుంది.
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ ఖాతా (ఎస్​సీఎస్ఎస్) : 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికే ఈ పథకం. దీని వ్యవధి 5 సంవత్సరాలు. ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. త్రైమాసికానికి ఓ సారి దీనిని చెల్లిస్తారు.
  • పోస్టాఫీస్ నెలవారీ ఆదాయం పథకం : ఐదు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం(ఎంఐఎస్)లో నెలవారీగా వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం వడ్డీ 7.4 శాతంగా ఉంది.

పర్సనల్ లోన్​ తిరిగి చెల్లించలేదా? డిఫాల్టర్లకు జరిగే నష్టాలివే! - What Happens To Loan Defaulters

ఇంపార్టెంట్ : పెళ్లికి ముందే మీ పార్ట్​నర్​తో ఇలా చేయాలి - అప్పుడే "హ్యాపీ మ్యారీడ్ లైఫ్"! - Wife and Husband Understanding

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.