India GDP Growth Rate 2023 : 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి రేటు నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం-NSO గురువారం ప్రకటించింది. ఉత్పాదక, మైనింగ్, క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితీరు కనబరడం వల్ల ఈ వృద్ధిరేటు సాధ్యమైందని వెల్లడించింది.
2023-24లో దేశ వృద్ధిరేటు 7.6శాతంగా ఉండొచ్చని తన రెండో ముందస్తు అంచనాలో NSO పేర్కొంది. జనవరిలో ప్రకటించిన తొలి ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3శాతం జీడీపీ నమోదుకావచ్చని NSO తెలిపింది. దాన్ని ఇప్పుడు మరో 0.3శాతం పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటును గతంలో 7.2శాతంగా పేర్కొన్న NSO ఇప్పుడు 7శాతంగా సవరించింది.
ఈ వృద్ధి భారత్ సామర్థాన్ని సూచిస్తుంది : ప్రధాని మోదీ
2023-24 మూడో త్రైమాసికంలో 8.4శాతం GDP వృద్ధిరేటు నమోదు కావడం, భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, దాని సామర్థ్యాన్ని సూచిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తామ చేసే ప్రయత్నాలు 140 కోట్ల మంది భారతీయులు మెరుగైన జీవితాన్ని జీవించడానికి దోహదపడతాయని అన్నారు. వికసిత్ భారత్ కళను సాకారం చేయడంలో సహాయపడే వేగవంతమైన ఆర్థిక వృద్ధిని తీసుకురావడానికి ఉపయోగపడతాయని చెప్పారు.
Real GDP : ఇక 2023-24లో రియల్ జీడీపీ రూ.172.90 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని NSO అంచనా వేసింది. గతేడాది ఇది 2022-23 రూ.160.71 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఈ రియల్ జీడీపీ 7శాతంగా NSO అంచనా వేసింది. అయితే ఎన్ఎస్ఓ ఇంతకుముందు వేసిన అంచనాల కంటే ఇది 30 బేసిస్ పాయింట్లు తక్కువ. అయితే దేశీయంగా ఉన్న డిమాండ్ కారణంగా గత మూడేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ వ్యవస్థ వృద్ధిరేటు 7శాతానికి పైగా నమోదైంది.
Nominal GDP : ఇక ఇదే ఆర్థిక సంవత్సరానికి నామినల్ జీడీపీ రూ.293.90 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని NSO అంచనా వేసింది. నామినల్ జీడీపీ గతేడాది రూ.269.50 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం సారితో పోలిస్తే వృద్ధి రేటు 9.1 శాతంగా ఉంది.
హ్యుందాయ్ నుంచి మరో కొత్త మోడల్- సూపర్ సేఫ్టీ ఫీచర్స్- ధర ఎంతంటే?
బ్యాంక్ ఉద్యోగులకు గుడ్న్యూస్- ఇకపై వారానికి 5 రోజులే పని!- శాలరీ హైక్!!