ETV Bharat / business

ఉద్యోగం మారుతున్నారా? మీ PF​ ఖాతాను సింపుల్​గా ట్రాన్స్​ఫర్​ చేసుకోండిలా! - How to Transfer EPF Online

How To Transfer PF Online : మీరు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతున్నారా? మీ పీఎఫ్ అకౌంట్​ను కూడా ట్రాన్స్​ఫర్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆన్​లైన్​లో చాలా సులువుగా పీఎఫ్ అకౌంట్​ను ఎలా ట్రాన్స్​ఫర్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Transfer Your PF From One Company To Another
How to Transfer PF Online
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 12:49 PM IST

How To Transfer PF Online : ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తమ పీఎఫ్​ అకౌంట్​లోని డబ్బులు విత్​డ్రా చేసేస్తుంటారు. మరికొందరు కొత్త పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఒక ఉద్యోగికి ఒక పీఎఫ్ అకౌంట్ ఉండడమే మంచిది. ఇందుకోసం మీరు ఉద్యోగం మారినప్పుడు మీ పీఎఫ్ అకౌంట్​ను కొత్త కంపెనీకి ట్రాన్స్​ఫర్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా మీరు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్​ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.
  • మీ UAN, పాస్​వర్డ్​లతో పోర్టల్​లోకి లాగిన్ కావాలి.
  • Online Services సెక్షన్​లోకి వెళ్లి One Member - One EPF Account (ట్రాన్స్​ఫర్ రిక్వెస్ట్​) ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ప్రస్తుత పీఎఫ్​ అకౌంట్​లోని మీ వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా చెక్​ చేసుకోవాలి.
  • ఆ తరువాత Get Details మీద క్లిక్ చేసి, మీ పాత పీఎఫ్ అకౌంట్ వివరాలను చెక్ చేసుకోవాలి.
  • మీ పీఎఫ్ అకౌంట్​కు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఉంటే, మీరే స్వయంగా క్లెయిమ్ ఫారాన్ని ధ్రువీకరించుకోవచ్చు.
  • లేదా మీ మునుపటి లేదా ప్రస్తుత యజమానుల ద్వారా కూడా పీఎఫ్ అకౌంట్​ను ధ్రువీకరించుకోవచ్చు.
  • తరువాత మీ ప్రస్తుత యజమానిని సెలెక్ట్ చేసుకోవాలి. మెంబర్ ఐడీ లేదా UAN వివరాలను ఎంటర్ చేయాలి.
  • Get OTP మీద క్లిక్ చేస్తే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‎కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి Submit బటన్​పై క్లిక్ చేయాలి.
  • వెంటనే 'పీఎఫ్ ట్రాన్స్‎ఫర్ రిక్వెస్ట్ ఫారం' జెనరేట్ అవుతుంది. దీనిపై మీరు సెల్ఫ్-అటాస్ట్ చేసి, మీ కొత్త యాజమాన్యానికి పంపించాలి.
  • ఈ EPF టాన్స్‎ఫర్‎కు సంబంధించిన నోటిఫికేషన్ మీ యాజమానికి కూడా వెళ్తుంది.
  • ఈ విధంగా మీ పీఎఫ్​ అకౌంట్​ను సులువుగా ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు.

PF Benefits : సాధారణంగా ఉద్యోగికి ఇచ్చే జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ అకౌంట్​లోకి జమ చేస్తారు. సదరు కంపెనీ కూడా ఇంతే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో జమ చేస్తుంది. దీనిపై మంచి వడ్డీ జనరేట్ అవుతుంది. ఫలితంగా ఉద్యోగ విరమణ తరువాత సదరు వ్యక్తికి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఒక వేళ మీరు కంపెనీలో చేరిన 5 ఏళ్లలోపు మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసేస్తే, అప్పుడు మీరు ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సి వస్తుంది. కనుక పీఎఫ్ అకౌంట్​లోని డబ్బులను నిబంధనల ప్రకారం, నిర్దిష్ట కాలపరిమితి వరకు విత్​డ్రా చేయకపోవడమే మంచిది. అయితే పిల్లల వివాహం, ఇళ్లు నిర్మాణం సహా, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బులను వాడుకోవచ్చు.

పాస్​పోర్ట్​ రెన్యువల్ చేయాలా? ఆన్​లైన్​లో సులభంగా చేసుకోండిలా!

ఎస్​బీఐ డెబిట్ కార్డును యాక్టివేట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.