ETV Bharat / business

పాస్​పోర్ట్​ రెన్యువల్ చేయాలా? ఆన్​లైన్​లో సులభంగా చేసుకోండిలా!

How To Renew Passport Online : భారత్ దాటి వేరే ఏ దేశానికి వెళ్లినా తప్పనిసరిగా ఉండాల్సింది పాస్​పోర్టు. అయితే పాస్​పోర్ట్​ జారీ అయిన 10 సంవత్సరాలు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. ఆ కాలపరిమితి అయిపోయిన తర్వాత పునరుద్ధరించుకోవాలి. పాస్​పోర్ట్​ రిన్యువల్​ సులభంగా ఆన్​లైన్​లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Renew Passport Online
How To Renew Passport Online
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 7:17 AM IST

How To Renew Passport Online : విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యటన ఇలా పలు రకాల పనుల కోసం చాలా మంది విదేశాలకు పయనమవుతుంటారు. అలాంటి వారికి విదేశాలకు వెళ్లేందకు తప్పనిసరిగా ఉండాల్సింది పాస్​పోర్టు. ప్రయాణికులకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉంటాయి. 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పాస్​పోర్ట్​ వ్యాలిడిటీ ఐదు సంవత్సరాలు, లేదా 18 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉంటుంది. ఆ తర్వాత పాస్​పోర్టును రెన్యువల్ చేసుకోవాలి. ఇక 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు 10 సంవత్సరాల పాస్​పోర్టును తీసుకోవచ్చు. అయితే పాస్​పోర్ట్ గడువు ముగిసిన తర్వాత, దాన్ని సులభంగా ఆన్​లైన్​లో ఎలా రెన్యువల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాస్​పోర్ట్ రెన్యువల్ ప్రక్రియ

  1. 'పాస్​పోర్ట్​ సేవ' వెబ్​సైట్​కు వెళ్లాలి.
  2. ఒకవేళ వెబ్​సైట్​లో మీరు ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకొని ఉండకపోతే, సూచనలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ ఐడీని పొందవచ్చు.
  3. ఆ తర్వాత మీ లాగిన్ ఐడీతో లాగిన్ అవ్వండి.
  4. Apply for fresh passport/Reissue of Possportను ఎంచుకోండి.
  5. తగిన వివరాలను నమోదు చెయ్యండి.
  6. తర్వాత Pay and Schedule appointment మీద క్లిక్ చేయండి.
  7. అక్కడ ఉన్న పేమెంట్ పద్ధతులలో ఏదైనా ఒక దాని ద్వారా పేమెంట్ పూర్తి చెయ్యండి.
  8. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీ ఫాంను సబ్మిట్ చెయ్యండి.
  9. Print Application Receipt మీద క్లిక్ చెయ్యండి.
  10. నిర్ణీత తేదీన మీకు దగ్గరలోని పాస్​పోర్ట్ సేవా కేంద్రానికి అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫాంలతో వెళ్లండి.

అపాయింట్​మెంట్ ఇలా బుక్ చేసే విధానం

  • మీ వివరాలతో 'పాస్​పోర్ట్ సేవ' వెబ్​సైట్ లాగిన్ అవ్వండి.
  • View Saved and Submit Applicationను సెలెక్ట్ చేసి, Pay and Schedule appointment మీద క్లిక్ చెయ్యండి.
  • పేమెంట్ పద్ధతిని ఎంచుకోండి. ఆ తర్వాత పాస్​పోర్టు సేవా కేంద్రాన్ని ఎంచుకోండి.
  • పాస్​పోర్ట్ సేవా కేంద్రం లోకేషన్​, CAPTCHA కోడ్​ను ఎంటర్ చెయ్యడం ద్వారా వెరిఫై చెయ్యండి.
  • మీకు తగిన తేదీ, సమయాన్ని అపాయింట్​మెంట్​ కోసం సెలెక్ట్ చెయ్యడం సహా Pay and Book the Appointment మీద క్లిక్ చేయండి.

రెన్యువల్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే

  • ఒరిజినల్ పాస్​పోర్ట్
  • సెల్ఫ్ అటాస్టేషన్​తో కూడిన ECR/Non- ECR పేజ్ ఫోటోకాపీలు.
  • అడ్రస్ ప్రూఫ్
  • పాస్​పోర్ట్​ మొదటి చివరి పేజీల జిరాక్స్​ కాపీలు
  • చెల్లుబాటు అయ్యే ఎక్స్‎టెన్షన్ పేజ్ జిరాక్స్​ కాపీ
  • సెల్ఫ్ అటాస్టెడ్ పేజ్ ఆఫ్ అబ్జర్వేషన్ జిరాక్స్​ కాపీ

ఇవి గుర్తించుకోండి : చాలామంది రీఇష్యూ, రెన్యువల్ రెండు ప్రక్రియలు ఒకటే అని అనుకుంటారు. కానీ రెండు ఒకటే తరహా ఉండే ప్రక్రియలు అని గుర్తించుకోండి. దరఖాస్తుదారు రెండింటికి రెండు వేర్వేరు ఫాంలు ఉంటాయని గుర్తించుకోవాలి. అలాగే రిన్యువల్‎కి దరఖాస్తు చేసుకున్న నాలుగు నుండి ఆరు వారాల్లో పాస్‎పోర్ట్ రిన్యువల్ జరుగుతుందని గమనించాలి.

బ్యాంక్​ ఉద్యోగులకు గుడ్​న్యూస్​- ఇకపై వారానికి 5 రోజులే పని!- శాలరీ హైక్!!​

కొత్తగా క్రెడిట్​ కార్డు తీసుకోవాలా? కన్ఫ్యూజన్​లో ఉన్నారా? ఇది మీకోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.