Tips to Bike Mileage Increasing after Servicing : ప్రస్తుతం మెజార్టీ పీపుల్ ఉపయోగించే రవాణా సాధనం బైక్. ఇది అవసరాల జాబితాలో ఎప్పుడో చేరిపోయింది. అందుకే.. ద్విచక్ర వాహనాల అమ్మకాలు మరింతగా పెరుగుతున్నాయి. అయితే.. భారీగా పెరిగిన పెట్రో ధరల నేపథ్యంలో.. మైలేజ్ చాలా ముఖ్యంగా మారిపోయింది. కానీ.. మెయింటెనెన్స్ విషయంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల మైలేజ్ తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొరపాట్ల వల్లనే సర్వీసింగ్ చేయించిన తర్వాత కూడా మైలేజ్ పెరగకపోగా.. తగ్గుతుందని చెబుతున్నారు. మరి.. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
- బైక్ నడిపే తీరు మైలేజ్‌పై ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం, తరచుగా బ్రేక్ వేయడం.. వెంటనే ఎక్సలేటర్ ఉపయోగించడం వంటి అలవాట్లు మైలేజ్‌ను తగ్గిస్తాయంటున్నారు.
- సర్వీసింగ్ తర్వాత బైక్ మైలేజ్ తగ్గడానికి సరైన ట్యూనింగ్ లేకపోవడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. సర్వీసింగ్ సమయంలో కార్బురేటర్ సరిగ్గా ట్యూన్ చేయకపోతే ఇంధన సామర్థ్యం తగ్గిపోతుందట.
- స్పార్క్ ప్లగ్ సరిగ్గా క్లీన్ చేయకపోతే కూడా ఇంధన సరఫరా సక్రమంగా జరగదట. ఫలితంగా మైలేజ్ తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
- అదేవిధంగా ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే.. ఇంజిన్‌కు తగినంత గాలి సరఫరా కాకపోవచ్చు. ఇది కూడా మైలేజ్ తగ్గడానికి కారణమవుతుందంటున్నారు.
ఫస్ట్‌టైం బైక్ కొంటున్నారా? ఈ టాప్-10 టిప్స్ మీ కోసమే! - Two Wheeler Buying Tips
- పాత, పాడైపోయిన ద్విచక్రవాహన విడిభాగాలను సరైన సమయంలో మార్చకపోయినా కూడా.. అది మైలేజ్‌ను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- కాబట్టి.. ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్, టైర్లు వంటి భాగాలను క్రమం తప్పకుండా మార్చుతుండాలని సూచిస్తున్నారు.
- ఇవేకాకుండా.. నాణ్యతలేని పెట్రోలు వినియోగించడం ద్వారా కూడా బైక్ మైలేజ్ తగ్గిపోవడంతో పాటు ఇంజన్ పాడైపోతుందని సూచిస్తున్నారు.
- బైక్‌పై ప్రయాణించే వ్యక్తుల బరువు, రోడ్లు, టైర్లలో గాలి, ప్రయాణంలో వీస్తున్న గాలి వంటి అనేక అంశాలు మైలేజ్‌ను ప్రభావితం చేస్తాయంటున్నారు.
- ఇలాంటి టైమ్‌లో బైక్ మైలేజ్ పెరగాలంటే.. మీ డ్రైవింగ్ విధానం పద్ధతిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
- ఈ టిప్స్ పాటిస్తే సర్వీసింగ్ తర్వాత మైలేజీ తప్పకుండా పెరుగుతుందని సూచిస్తున్నారు.
- అలాగే.. బైక్ ట్యూనింగ్ చేసేటప్పుడు మెయిన్‌జెట్, ఐడ్లింగ్‌లను ఒకటికి రెండు సార్లు సరిచూడాల్సిందిగా మెకానిక్‌కు, సర్వీస్ ఇంజనీర్‌కు చెప్పాలని నిపుణులు సూచన చేస్తున్నారు.