How To Identify Fake Gold Jewellery : భారతీయ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కచ్చితంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ విధంగా కొనుగోలు చేసిన బంగారం మనకు ఆర్థిక అత్యవసర సమయాల్లో కచ్చితంగా రక్షణ కల్పిస్తుంది. అందుకే బంగారానికి ఎనలేని డిమాండ్ మన సమాజంలో ఉంది. అయితే బంగారం కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు ఆన్లైన్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు నగల దుకాణానికి వెళ్లి నగలు కొంటుంటారు. అయితే బంగారాన్ని చూసి, లేదా పట్టుకొని క్వాలిటీ చెక్ చేయడం సామాన్యులకు సాధ్యం కాదు. పైగా తాము కొన్న బంగారు ఆభరణాలు అసలైనవేనా? నకిలీవా? అనే భయాలు ఉంటాయి. అందుకే ఈ స్టోరీలో బంగారం ఒర్జినలా? కాదా? అని తెలుసుకునేందుకు పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం.
హాల్‌మార్క్ : అత్యంత విలువైన, ఆకర్షణీయమైన లోహాల్లో బంగారం ఒకటి. అందుకే బంగారం కొనేటప్పుడు కచ్చితంగా దానిపై హాల్‌మార్క్ ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. ఈ హాల్‌మార్క్ బంగారం క్వాలిటీ, అస్యూరెన్స్ గురించి తెలుపే ఒక కొలమానం.
మ్యాగ్నెట్ టెస్ట్ : అయస్కాంతాన్ని తీసుకొచ్చి బంగారానికి దగ్గర ఉంచండి. అసలైన బంగారాన్ని అయస్కాంతం ఆకర్షించదు. ఒక వేళ మీరు కొన్న ఆభరణాన్ని అయస్కాంతం ఆకర్షించిందంటే అది నకిలీది అని అర్థం చేసుకోవాలి.
స్క్రాచ్ టెస్ట్ : సిరామిక్ ప్లేట్‌పై బంగారంతో రుద్దండి. అసలైన బంగారం అయితే సిరామిక్ ప్లేట్‌పై బంగారు గీత కనిపిస్తుంది. ఒకవేళ అలా జరగకపోతే, అది నకిలీది అని గుర్తించండి. ఇంట్లో బంగారం అసలైనదా, కాదా అని గుర్తించడానికి ఇది చాలా సులువైన మార్గం.
సాంద్రత పరీక్ష : బంగారం బరువు, పరిమాణాన్ని కొలవడం ద్వారా దాని సాంద్రతను తెలుసుకోవచ్చు. ఇలా ఎందుకు చేయాలంటే, నకిలీ బంగారు ఆభరణాలు, అసలైన బంగారు ఆభరణం కంటే కాస్త తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి.
నిపుణుల సాయం : మీరు కొన్న బంగారం అసలైనదో, కాదో నిర్ధరించడానికి బంగారు ఆభరణాల తయారుదారులు, వ్యాపారులు, నిపుణుల సాయం తీసుకోండి. ఎందుకంటే వారి దగ్గర అధునాతన పరికరాలు, యంత్రాలు ఉంటాయి. వీటి ద్వారా మీ దగ్గర ఉన్న బంగారం అసలైనదా, కాదా అనేది టెస్ట్ చేసి చెబుతారు.
నోట్ : అసలైన బంగారం ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉంటుంది. రంగు మారదు. నకిలీ బంగారం కొన్నాళ్లకు రంగు మారిపోతుంది. పైగా అయస్కాంతానికి అంటుకుంటుంది. అసలైన బంగారంతో పోలిస్తే, నకిలీవి కాస్త తక్కువ బరువు ఉంటాయి. చూశారుగా, ఈ పద్ధతులు ఉపయోగించి మీరు ఇంట్లోనే ఉండి బంగారం అసలైనదో? కాదో? చెక్ చేసుకోవచ్చు. మోసాలు పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో బంగారం అసలైనదా? నకిలీదా? తెలుసుకోవడం చాలా ముఖ్యం.
భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? రిస్క్ లేని టాప్-10 స్కీమ్స్ ఇవే! - Top 10 Risk Free Schemes