ETV Bharat / business

అర్జెంట్​గా విదేశాలకు వెళ్లాలా? 'తత్కాల్ పాస్​పోర్ట్'​ కోసం అప్లై చేసుకోండిలా!

How To Apply For Tatkal Passport Online : త‌త్కాల్ టికెట్ గురించి తెలుసు కానీ, త‌త్కాల్ పాస్​పోర్ట్​ కూడా ఉంటుంద‌ని మీకు తెలుసా? ఇంత‌కీ త‌త్కాల్ పాస్​పోర్ట్ అంటే ఏమిటి? దాని కోసం ఎలా అప్లై చేసుకోవాలి? అనే విష‌యాలు ఈ ఆర్టిక‌ల్​లో తెలుసుకుందాం.

Documents Required for tatkal passport
How to apply for tatkal passport online
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 1:44 PM IST

How To Apply For Tatkal Passport Online : మీరు త‌త్కాల్ టికెట్ గురించి వినే ఉంటారు. మ‌న తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లైతే ద‌స‌రా, సంక్రాంతి లాంటి పండ‌గ‌ల స‌మ‌యంలో ఈ మాట ఎక్కువ‌గా వింటారు. కానీ మీరెప్పుడైనా త‌త్కాల్ పాస్​పోర్ట్​ గురించి విన్నారా? అస‌లు అలాంటి పాస్​పోర్ట్​ ఉంటుంద‌నే విష‌యం మీకు తెలుసా? ఇంత‌కీ ఈ త‌త్కాల్ పాస్​పోర్ట్​ అంటే ఏమిటి? దాని కోసం ఎలా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

త‌త్కాల్ టికెట్ లాగే, అత్య‌వ‌స‌రంగా ప్ర‌యాణం చేయాల‌ని అనుకునే వారికి ఈ త‌త్కాల్ పాస్​పోర్ట్​ను జారీ చేస్తారు. ఈ విధానాన్ని భార‌త విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌వేశ పెట్టింది. వేగంగా పాస్​పోర్టులు జారీ చేసేందుకు, అత్య‌వ‌స‌ర సమయాల్లో, చివ‌రి నిమిషంలో త‌ప్ప‌నిస‌రిగా విదేశీ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు జారీ చేసే పాస్​పోర్టునే 'త‌త్కాల్ పాస్​పోర్ట్​' అంటారు. సుదీర్ఘ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ లేకుండా, ఎక్కువ కాలం వేచి చూసే అవ‌స‌రం లేకుండా, విదేశీ ప్ర‌యాణాలు చేయాల‌నుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

సాధార‌ణంగా ఇండియాలో పాస్​పోర్ట్​ అప్లికేష‌న్ ప్రాసెస్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. పైగా దీనికి చాలా స‌మ‌యం కూడా ప‌డుతుంది. అందుకే ఏదైనా విదేశీ ప్ర‌యాణం చేయాల‌నుకునే వారు ముందుగానే దీని కోసం అప్లై చేసుకుంటారు. కానీ అనుకోకుండా, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో కొన్ని సార్లు ప్ర‌యాణం చేయాల్సి రావ‌చ్చు. అలాంటి స‌మ‌యంలో పాస్​పోర్ట్​ లేకుంటే చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. అలాంటి స‌మ‌స్య‌ను నివారించేందుకే కేంద్ర ప్ర‌భుత్వం 'తత్కాల్​ పాస్​పోర్ట్' విధానాన్ని తీసుకొచ్చింది. దీని కోసం ఆన్​లైన్​లోనే చాలా ఈజీగా అప్లై చేసుకోవ‌చ్చు.

తత్కాల్ పాస్​పోర్ట్ కోసం కావాల్సిన పత్రాలు
Documents Required For Tatkal Passport :

  1. అనెక్సర్-​ ఎఫ్​లో వివరించిన వెరిఫికేషన్ సర్టిఫికెట్​
  2. కింది వాటిలోని ఏవైనా మూడు డాక్యుమెంట్లు ఉండాలి.
  • ఎలక్ష‌న్ కార్డు
  • స‌ర్వీసు ఫొటో ఐడీ కార్డు
  • కుల ధ్రువీకరణ ప‌త్రాలు
  • స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల ఐడీ కార్డులు
  • ఆయుధాల లైసెన్స్
  • రేష‌న్ కార్డు
  • ఆస్తి ప‌త్రాలు
  • పింఛ‌ను ప‌త్రాలు
  • రైల్వే ఫొటో ఐడీ కార్డు
  • పాన్ కార్డు
  • బ్యాంకు పాస్​బుక్
  • స్టూడెంట్ ఐడీ కార్డు (గుర్తింపు పొందిన విద్యాసంస్థ‌లు జారీ చేసినది)
  • డ్రైవింగ్ లైసెన్స్
  • జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (బర్త్​ సర్టిఫికెట్​)
  • గ్యాస్ క‌నెక్ష‌న్ బిల్లు

తత్కాల్ పాస్​పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి?
How To Apply For Tatkal Passport :

  • ముందుగా పాస్​పోర్డ్​ సేవా వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి.
  • వెంటనే మీకొక ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతుంది.
  • ఈ ఐడీ, పాస్​వ‌ర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి.
  • అక్క‌డ మీకు Fresh & Reissue అనే రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి.
  • త‌ర్వాత Tatkal అనే ఆప్ష‌న్​ను ఎంచుకోవాలి.
  • అప్లికేష‌న్ ఫార‌మ్​లో మీ వివ‌రాలు అన్నీ జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
  • తత్కాల్ పాస్​పోర్ట్ ఫీజును కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • తరువాత పేమెంట్​కు సంబంధించిన రశీదు ప్రింట్​అవుట్​​ తీసుకోవాలి.
  • చివ‌ర‌గా మీ ద‌గ్గ‌ర్లోని పాస్​పోర్ట్​ సేవా కేంద్రంలో అపాయింట్​మెంట్ డేట్​ను ఫిక్స్ చేసుకోవాలి. అంతే సింపుల్​!

అర్హ‌త విధానాలేంటి ?
Eligibility Criteria For Tatkal Passport : ఈ త‌త్కాల్ ప‌థ‌కంలో, మీకు పాస్​పోర్టు జారీ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా పాస్​పోర్టు ఆఫీసు చేతిలోనే ఉంటుంది. మీ అత్య‌వ‌స‌ర ప్ర‌యాణానికి గల కార‌ణాలు, ఇత‌ర అంశాల్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని పాస్​పోర్టు ఇవ్వాలా? వ‌ద్దా? అనేది నిర్ణ‌యిస్తారు. కానీ కొన్ని కేట‌గిరీల‌కు చెందినవారు త‌త్కాల్ పాస్​పోర్ట్​ జారీకి అన‌ర్హులు. వారెవ‌రంటే?

1. భారతదేశానికి చెందిన త‌ల్లిదండ్రుల‌కు విదేశాల్లో పుట్టిన పిల్ల‌లు
2. నాచుర‌లైజేష‌న్ ద్వారా పౌర‌స‌త్వం పొందినవారు
3. విదేశాల నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురై ఇండియాలో నివ‌సించేవారు
4. విదేశాల నుంచి ఇండియాకు ప్ర‌భుత్వం రప్పించిన వ్య‌క్తులు
5. పేరు మార్చుకున్నవారు
6. జ‌మ్ము, క‌శ్మీర్, నాగాలాండ్​కు చెందిన పౌరులు
7. నాగాలాండ్ బ‌య‌ట నివ‌సించే నాగా తెగ‌కు చెందినవారు
8. ద‌త్త‌తగా తీసుకున్న పిల్లలు
9. తల్లి లేదా తండ్రుల్లో ఎవరో ఒక్కరు మాత్రమే ఉన్న మైన‌ర్లు
10. నాగాలాండ్​లో నివ‌సించే మైన‌ర్లు
11. షార్ట్ పాస్​పోర్డు వ్యాలిడిటీతో మ‌ళ్లీ అప్లై చేసేవారు
12. పాస్​పోర్టు పోగొట్టుకున్నవారు
13. గుర్తు ప‌ట్ట‌లేని విధంగా పాస్​పోర్ట్ డ్యామేజ్ అయిన వ్యక్తులు
14. లింగ మార్పిడి చేయించుకున్నవారు
15. త‌మ వ్య‌క్తిగత వివ‌రాలు మార్చుకున్న వ్య‌క్తులు (సంత‌కం స‌హా పలు వివరాలు మార్చుకున్నవారు)

మంజూరుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది ?
సాధార‌ణ పాస్​పోర్ట్​ జారీ క‌న్నా, దీనికి త‌క్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. ఒక్క‌సారి మీరు కావాల్సిన ధ్రువ‌ప్ర‌తాలు అన్నింటినీ పాస్​పోర్ట్​ సేవా కేంద్రంలో స‌మ‌ర్పించిన త‌ర్వాత, అన్నీ క‌రెక్ట్​గా ఉంటే, ఒక వారంలోపు తత్కాల్​ పాస్​పోర్ట్​ వ‌చ్చేస్తుంది. దీని త‌ర్వాత‌ పోలీసు వెరిఫికేష‌న్ ఉంటుంది. ఒక‌వేళ మీ మీద ఎలాంటి కేసులు లేక‌పోతే, ఒక్క రోజులోనే పాస్​పోర్టు మీకు మంజూరు చేస్తారు. ఒకవేళ ఎంక్వైరీ చేయాల్సి ఉన్నా, అది పాస్​పోర్ట్ జారీ చేసిన త‌ర్వాతే చేస్తారు.

రూ.5 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? ఈ టాప్​-3 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

నెలకో కొత్త కారులో తిరగాలా? అయితే 'సబ్​స్క్రిప్షన్​​ ప్యాకేజీ'ల గురించి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.