ETV Bharat / business

ఫిక్స్​డ్ డిపాజిట్​ చేస్తున్నారా?- ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ రేటు ఇస్తుందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 8:33 AM IST

Fixed Deposit Interest Rates 2024 : మీరు బ్యాంకులో ఫిక్స్​డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీరేటు ఇస్తుందో మీకు తెలుసా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఐదు అతి పెద్ద బ్యాంకుల్లో ఏది ఎక్కువ వడ్డీ రేటు చెల్లిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

Fixed Deposit High Interest Rates
Fixed Deposit Interest Rates 2024

Fixed Deposit Interest Rates 2024 : మీరు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును పొదుపు​ చేయడం వల్ల ఆర్థికంగా క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అయితే మన దేశంలో చాలా మంది తాము దాచుకున్న డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్​డ్ డిపాజిట్ చేయడానికే మొగ్గుచూపిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా బ్యాంకులు వడ్డీ రేట్లను చెల్లించడమే దానికి కారణం. అందువల్లనే ఫిక్స్​డ్​ డిపాజిట్​ను సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. ఫిక్స్​డ్​ డిపాజిట్​పై బ్యాంకులు ఎంత వడ్డీ చెల్లిస్తారు అనే విషయాన్ని మదుపర్లు ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం.

నిర్ణీత కాలానికి
ఈ ఫిక్స్​డ్ డిపాజిట్లకు ఒక నియమిత కాల వ్యవధి ఉన్నప్పటికీ కొన్ని సార్లు బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు ప్రీమెచ్యూర్​ విత్​డ్రాకు అనుమతిస్తాయి. అయినప్పటికీ కాలవ్యవధి పూర్తి కాకుండానే ఫిక్స్​డ్ డిపాజిట్​ను ఉపసంహరించుకోవడం వల్ల కొంత ఫైన్ చెల్లించాల్సి రావచ్చు. ఆర్థిక అస్థిరత, మార్కెట్​ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈ ఫిక్స్​డ్ డిపాజిట్లు నిర్ణీత లాభాలను మీకు అందిస్తాయి.

ఏ విధంగా ఫిక్స్​డ్ డిపాజిట్ చేయాలి?
ఒక వేళ మీరు ఫిక్స్​డ్ డిపాజిట్ చేయాలనుకున్నట్లయితే ముందుగా మీరు ఫిక్స్​డ్​ డిపాజిట్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులు, పోస్టాఫీస్​లు, ఫైనాన్సియల్​ సంస్థల్లో ఎక్కడైనా మీరు అకౌంట్​ను ఓపెన్ చేయవచ్చు. బ్యాంకులు కొన్నిసార్లు సీనియర్​ సిటిజన్లు చేసే ఫిక్స్​డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తుంటాయి. పదవీ విరమణ చేసిన వారు ఒక స్థిరమైన ఆదాయం సంపాదించాలంటే ఈ ఫిక్స్​డ్ డిపాజిట్​ చేయడం బెస్ట్​ ఆప్షన్​.

ఫిక్స్​డ్ డిపాజిట్​పై ఏ బ్యాంక్​ ఎక్కువ వడ్డీ రేటు ఇస్తోంది?
ఒక వేళ మీరు ఫిక్స్​డ్ డిపాజిట్​లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నయితే దేశంలోనే ప్రముఖ బ్యాంకులు అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, పీఎన్​బీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​ ఫిక్స్​డ్ డిపాజిట్​పై ఎంత వడ్డీ రేటును ఇస్తున్నాయి. రూ.1లక్ష ఫిక్స్​డ్​ డిపాజిట్​పై మూడు సంవత్సరాల కాల వ్యవధికి ఏ బ్యాంకు అధిక వడ్డీని ఇస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

బ్యాంకు వడ్డీ రేటు శాతంకాలవ్యవధిరూ.1లక్షకు
బ్యాంక్​ ఆఫ్ బరోడా 7.25 శాతం3 ఏళ్లు రూ.1,24,055
యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 7.10 శాతం3 ఏళ్లు రూ.1,23,508
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లిమిటెడ్ 7 శాతం3 ఏళ్లు రూ.1,23,144
పంజాబ్​ నేషనల్ బ్యాంక్ 7 శాతం3 ఏళ్లు రూ.1,23,144
ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్​ 7 శాతం3 ఏళ్లు రూ.1,23,144

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.