ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్​న్యూస్- ఇకపై అన్ని ఆస్పత్రుల్లో క్యాష్​లెస్

Cashless Health Insurance News : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారు ఇకపై అన్ని ఆస్పత్రుల్లో క్యాష్​లెస్ సదుపాయం వినియోగించుకోవచ్చు. నెట్​వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆస్పత్రుల్లోనూ క్యాష్​లెస్ చికిత్స చేయించుకోవచ్చని 'ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్' తెలిపింది.

cashless health insurance news
cashless health insurance news
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 3:18 PM IST

Cashless Health Insurance News : ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆస్పత్రుల్లో క్యాష్​లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో గురువారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు 'ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌' ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలతో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. బీమా పాలసీ నెట్​వర్క్ జాబితాలో పేరు లేని ఆస్పత్రుల్లోనూ క్యాష్​లెస్ సదుపాయాన్ని పొందవచ్చని స్పష్టం చేసింది.

నెట్​వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆస్పత్రుల్లో క్యాష్​లెస్ సదుపాయం పొందాలనుకుంటే 48 గంటల ముందే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో అయితే ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోపు సమాచారం చేరవేయాల్సి ఉంటుంది. బీమా పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిమ్ చేసుకోవచ్చని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వివరించింది.

ప్రస్తుతం ఇలా!
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సంబంధిత నెట్​వర్క్ ఆస్పత్రుల్లో మాత్రమే క్యాష్​లెస్ సేవలకు అనుమతి ఉంటుంది. ఈ సదుపాయం లేని చోట చికిత్సకు అయ్యే ఖర్చును సొంతంగా జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఖర్చులకు సంబంధించి రీయంబర్స్​మెంట్​కు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం వల్ల కస్టమర్లకు ఇబ్బందులు ఎదురయ్యేవి. రిఫండ్ ప్రక్రియ సైతం ఆలస్యంగా జరిగేది. తాజా నిర్ణయం నేపథ్యంలో కస్టమర్లకు ఈ సమస్యలు తప్పనున్నాయి. 'క్యాష్​లెస్' సదుపాయంపై ఇప్పటికే ఆయా బీమా కంపెనీలు కస్టమర్లకు మెసేజ్​లు పంపిస్తున్నాయి.

'అన్ని ఆస్పత్రుల్లో క్యాష్​లెస్ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం వల్ల కస్టమర్ల జీవితం మరింత సులభతరం అవుతుంది. ప్రస్తుతం 63 శాతం మంది కస్టమర్లు క్యాష్​లెస్ సదుపాయం ఎంచుకుంటున్నారు. మిగిలిన వారు రీయింబర్స్​మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రిఫండ్ ప్రక్రియ వల్ల కస్టమర్లు ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. క్లెయిమ్ చేసుకునే విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నాం. మోసాలను అరికట్టేందుకు, కస్టమర్ల విశ్వాసం పొందేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది' అని ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ ఎండీ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ తపన్ సింఘేల్ తెలిపారు.

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

మెడిక్లెయిమ్ Vs హెల్త్ ఇన్సూరెన్సు - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​?

టాప్​ అప్​ హెల్త్ ఇన్సూరెన్స్​ వల్ల లభించే బెస్ట్​ బెనిఫిట్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.