Govt Cuts Customs Duty On Gold, Silver, Mobile Phones : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024లో బంగారం, వెండి, మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కనుక వీటి ధరలు తగ్గనున్నాయి. దీనితో దేశంలోని బంగారు వ్యాపారులు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చినట్లు అయ్యింది. అలాగే, కేంద్రం నిర్ణయంతో లెదర్ వస్తువులు, సీఫుడ్స్ కూడా చౌకగా లభించనున్నాయి.
'కేంద్ర ప్రభుత్వం మరో మూడు క్యాన్సర్ చికిత్సకు అవసరమైన ఔషధాలపై కస్టమ్స్ సుంకానికి మినహాయింపు ఇస్తుంది. దీనికితోడు మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర మొబైల్ విడిభాగాల ధరలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నాం' అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. బంగారం, వెండిపై 6 శాతం వరకు దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించడం వల్ల రిటైల్ డిమాండ్ పెరుగుతుందని, తద్వారా స్మగ్లింగ్‌ను అరికట్టడంలో దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వస్తువుల ధరలు తగ్గుతాయ్
- బంగారం, వెండి లోహాలపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తారు.
- ప్లాటినమ్పై 6.4 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది.
- మొబైల్ ఫోన్స్, ఛార్జర్స్‌పై 15 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
- నిర్మలా సీతారామన్ 25 కీలక ఖనిజాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు.
- ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తొలగించారు.
- రొయ్యల, చేపల మేతపై, బ్రూడ్ స్టాక్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గించారు.
వీటిపై కస్టమ్స్ సుంకాలు పెరిగాయ్
- టెలికాం పరికరాలపై మాత్రం కస్టమ్స్ సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు.
- అమోనియం నైట్రేట్పై 10 శాతం, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌పై 25 శాతం కస్టమ్స్ సుంకం పెంచారు.
పీపీపీ విధానంలో
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ-కామర్స్ ఎగుమతి హబ్‌లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సంప్రదాయ కళాకారాలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించడానికి వీలు కల్పిస్తామని అన్నారు.
గుడ్ న్యూస్ - ముద్ర లోన్ లిమిట్ రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు! - MUDRA Loan Scheme Doubled
కొత్తగా ఉద్యోగంలో చేరితే నెల జీతం బోనస్- ఐదేళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి! - Union Budget 2024