BSE Mcap All Time High Record : బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్-టైమ్ రికార్డ్ స్థాయి రూ.401.10 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతుండడమే ఇందుకు కారణం.
తొలిసారి
వాస్తవానికి బీఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,01,16,018.89 కోట్లు (4.81 ట్రిలియన్ డాలర్స్) మార్కును అధిగమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతేడాది జులైలో ఈ బీఎస్ఈ- లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.300 లక్షల కోట్లకు చేరింది. అంటే ఏడాది గడవకముందే ఏకంగా రూ.100 లక్షల కోట్ల మేర వీటి క్యాపిటలైజేషన్ పెరగడం గమనార్హం.
దూసుకుపోతున్న మార్కెట్లు
సోమవారం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 425.62 పాయింట్లు లాభపడి 74,673 వద్ద జీవన కాల గరిష్ఠాలను తాకింది. నిఫ్టీ 22,623 వద్ద ఆల్-టైమ్ హై రికార్డ్‌ను క్రాస్ చేసింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 471 పాయింట్లు లాభపడి 74,723 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 136 పాయింట్లు వృద్ధి చెంది 22,650 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : పవర్‌గ్రిడ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, టైటాన్
విదేశీ పెట్టుబడులు
FIIs Investment : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం రూ.1659.27 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు.
ఆసియా మార్కెట్స్ : ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
రూపాయి విలువ
Rupee Open March April 8th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.27గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices April 8th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.61 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 89.71 డాలర్లుగా ఉంది.
సొంతంగా వ్యాపారం చేయాలా? మీకు సూట్ అయ్యే లోన్ ఇదే! - Types Of Business Loans In India