Best Stock Market Movies : జీవితం ఆనందమయంగా ఉండాలంటే డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు సంపాదించడం అంత సులభంకాదు. వాస్తవానికి డబ్బు సంపాదించడం ఒక కళ అని చెప్పుకోవచ్చు. రోజంతా గొడ్డులా కష్టపడి కూలీ డబ్బులు సంపాదిస్తూ ఉంటాం. లేకపోతే నెల జీతానికి పనిచేస్తూ కాలం గడిపేస్తూ ఉంటాం. కానీ జీవితంలో గొప్పగా స్థిరపడడానికి కావాల్సినంత డబ్బు సంపాదించాలంటే, దానికి ప్రత్యేకమైన స్కిల్ ఉండాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలోమైన ప్రత్యేక ప్రజ్ఞాపాటవాలు ఉండితీరాలి. అందుకోసం కచ్చితంగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. అయితే క్లాస్‌రూమ్‌లో కూర్చొని స్టాక్ మార్కెట్ పాఠాలు వినడం చాలా బోరింగ్‌గా ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇవి వినోదంతోపాటు, మంచి ఆర్థిక విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. మనం పక్కా ప్లానింగ్‌తో ఎలా డబ్బు సంపాదించాలో నేర్పుతాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి, ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ గురించి తెలిపే టాప్-7 బెస్ట్ మూవీస్ గురించి తెలుసుకుందాం.
1. Inside Job
ఈ జాబితాలో మొదటి సినిమా 'ఇన్సైడ్ జాబ్'. 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తీసిన డాక్యుమెంటరీ ఇది. మాట్ డేమన్ నెరేషన్లో ఈ డాక్యుమెంటరీ కొనసాగుతుంది. ఇందులో ఫైనాన్స్ వరల్డ్‌లోని స్టేక్ హోల్డర్స్, కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసి, దీన్ని తప్పక చూడాల్సిన సినిమాగా తీర్చి దిద్దాయి. అధికారం, దురాశ బిజినెస్ వరల్డ్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో ఈ డాక్యుమెంటరీలో చాలా చక్కగా చూపించారు. 2010లో విడుదలైన ఈ డాక్యుమెంటరీకి అకాడమీ అవార్డు, న్యూయార్క్ క్రిటిక్ సర్కిల్ అవార్డు సహా అనేక పురస్కారాలు లభించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Capitalism: A Love Story
అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక స్థితిగతులను, క్యాపిటలిజం కాన్సెప్ట్‌ను, కఠినమైన వాస్తవాలను తెలియజేస్తూ మైఖేల్ మూర్ ఈ డాక్యుమెంటరీ తీశాడు. ఈ డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు పొందుకుంది. ఈ డాక్యుమెంటరీలో, పెట్టుబడిదారీ విధానం వల్ల కేవలం ధనవంతులు, దురాశాపరులు మాత్రమే లాభపడుతున్నారని; శ్రామిక వర్గాలు, మైనారిటీలు దోపిడీకి గురవుతున్నారని చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇందులో నిరాశాపూరిత విధానాన్ని ప్రోత్సహించలేదు. ఆశాజనకమైన భవిష్యత్తు కోసం సమాజం ఎలా ఉండాలనే విషయాన్ని మైఖేల్ మూర్ ఈ డాక్యుమెంటరీలో విజయవంతంగా చిత్రీకరించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. The Big Short
2008 ఆర్థిక మాంద్యానికి ముందు, తెరవెనుక నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే 'ది బిగ్ షార్ట్' చిత్రాన్ని చూడాల్సిందే. ఈ సినిమాలో ఆర్థిక సంక్షోభాన్ని అంచనా వేసిన వారి గురించి, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులపై బెట్ చేసిన వ్యక్తుల గురించి తెలిపారు. ఈ సినిమా దర్శకుడు ఆడమ్ మెక్కే ఆర్థిక సంక్షోభానికి ముందు ఏం జరిగింది? దాన్ని ఎలా నివారించవచ్చు అనే విషయాల్ని చూపించారు. వ్యవస్థాగత లోపాలు, అధికారుల వైఫల్యాలు, జవాబుదారీతనం లేకపోవడం లాంటి అంశాలన్నింటినీ ఈ చిత్రంలో చూపించారు. క్రిస్టియన్ బేల్, స్టీవ్ కారెల్, ర్యాన్ గోస్లింగ్ లాంటి మంచి నటులు ఇందులో యాక్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. The Wolf of Wall Street
ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అనేది జోర్డాన్ బెల్ఫోర్ట్ అనే స్టాక్ బ్రోకర్ జీవితానికి సంబంధించిన కథ. ఈ చిత్రానికి కూడా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఫైనాన్స్ మార్కెట్లోని లొసుగులు గురించి, వాటిని దురాశాపరులు ఎలా ఉపయోగించుకుంటున్నారనే విషయం గురించి ఈ చిత్రం బహిర్గతం చేస్తుంది. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ గురించి, డబ్బు సంపాదించిన తరువాత చెడు అలవాట్లకు గురయ్యే విధానం గురించి చక్కగా వివరించారు. చివరికి అత్యాశ ఎప్పుడూ మంచిది కాదనే సందేశంతో సినిమా ముగుస్తుంది. మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచం తీరుతిన్నులను, స్టాక్ మార్కెట్లను, ఆర్థిక విషయాలను గురించి అనేక విలువైన పాఠాలను మనకు బోధిస్తుంది. సుప్రసిద్ధ నటుడు లియోనార్డో డికాప్రియో ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. The Wizard of Lies
ఈ సినిమా అమెరికన్ స్టాక్ బ్రోకర్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అయిన బెర్నీ మడోఫ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. మడోఫ్ చేసిన ఆర్థిక మోసాలపై 2008లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. దీనిలో అనేక ఆర్థిక అవకతవకలు బయల్పడ్డాయి. వాల్‌స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటిగా నిలిచింది. దీనితో అనేక మంది ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మడోఫ్ కూడా భారీగా నష్టపోయాడు. చివరికి న్యాయస్థానం అతనికి 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తి దురాశ వల్ల ఎంతో మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. ఈ కథాంశాన్నే ది విజార్డ్ ఆఫ్ లైస్ అనే సినిమాగా తీశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Scam 1992: The Harshad Mehta Story
స్కామ్ 1992 అనేది భారతదేశంలోని అత్యంత విజయవంతమైన స్టాక్ బ్రోకర్లలో ఒకరైన హర్షద్ మెహతా వాస్తవ గాథ. ఇది 1980-90 సంవత్సరాలలో ముంబయిలో జరిగింది. హర్షద్ మెహతా ఒక సామాన్యుడి స్థాయి నుంచి బిగ్ బుల్ స్థాయికి ఎలా ఎదిగాడో, ఆ తరువాత ఎలా పతనం అయ్యాడో ఈ వెబ్‌సిరీస్ తెలుపుతుంది. స్టాక్ మార్కెట్లోని లూప్‌హోల్స్‌ను ఆసరాగా తీసుకుని, హర్షద్ మెహతా ఎలా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడో, ఈ వెబ్‌సిరీస్‌లో చాలా బాగా చూపించారు. అంతేకాదు ఈ సిరీస్‌లో స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన అనేక ఫైనాన్సియల్ టర్మ్స్ గురించి సులభంగా వివరించే ప్రయత్నం చేశారు. స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉన్నవారు కచ్చితంగా చూడాల్సిన వెబ్‌సిరీస్ ఇది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. Wall Street
ప్రతి ఫైనాన్స్ ప్రొఫెషనల్ చూడాల్సిన చిత్రమిది. ప్రఖ్యాత దర్శకుడు ఆలివర్ స్టోన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మైఖేల్ డగ్లస్, చార్లీ షీన్ నటించారు. ఈ చిత్రంలోని Blue Horseshoe loves Anacott Steel, Greed is Good అనే డైలాగ్స్‌కు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలో వాల్ స్ట్రీట్‌లోని దురాశ, హెడోనిజం లాంటి అంశాలను చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా విడుదలై సుమారు 30 ఏళ్లైనా ఇప్పటికీ ఇది ఫ్రెష్‌గానే ఉంటుంది. వ్యాపారులు, బ్రోకర్లు, విశ్లేషకులు, బ్యాంకర్లు గురించి, వాళ్ల ఆలోచన విధానం గురించి తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ చిత్రం చూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-7 టిప్స్ మీ కోసమే!
మార్కెట్లోకి కొత్త మ్యూచువల్ ఫండ్స్ - ఇన్వెస్ట్ చేశారంటే లాభాల పంటే!