ETV Bharat / business

ఫిక్స్​డ్ డిపాజిట్ చేయాలా? ఎక్కువ వడ్డీ చెల్లించే టాప్​-5 స్కీమ్స్ ఇవే! - Best Fixed Deposit Schemes In 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 1:05 PM IST

Best Fixed Deposit Schemes In 2024 : మీరు ఎలాంటి రిస్క్ లేకుండా, కచ్చితంగా రాబడి ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇటీవలి కాలంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్​ రంగ బ్యాంకులు సరికొత్త ఫిక్స్​డ్​ డిపాజిట్ స్కీమ్​లను లాంఛ్ చేశాయి. వీటిపై సాధారణం కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Fixed Deposits
Fixed Deposits (ETV Bharat)

Best Fixed Deposit Schemes In 2024 : వినియోగదారులను ఆకర్షించేందుకు ఇటీవలి కాలంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్​ రంగ బ్యాంకులు లిమిటెడ్​-పీరియడ్​ 'స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​'లను లాంఛ్ చేశాయి. ఈ స్కీమ్​ల్లో చేరిన వారికి అధిక వడ్డీ రేట్లను కూడా అందిస్తున్నాయి. ఎలాంటి నష్టభయం లేకుండా, కచ్చితంగా రాబడి ఇచ్చే పథకాల కోసం చూస్తున్నవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

అధిక వడ్డీ రేట్లు అందిస్తున్న టాప్​-5 ఎఫ్​డీ స్కీమ్స్ ఇవే!

1. SBI Amrit Vrishti Scheme : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్​బీఐ జులై నెలలో ఒక కొత్త రిటైల్ టెర్మ్​ డిపాజిట్ స్కీమ్​ను ప్రారంభించింది. అదే 'అమృత వృష్టి' పథకం. ఇది 444 రోజుల కాల పరిమితి కలిగిన ఫిక్స్​డ్ డిపాజిట్ పథకం. దీనిలో మదుపు చేసిన వారికి గరిష్ఠంగా 7.2 శాతం వడ్డీ చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకు అయితే 7.75 శాతం వడ్డీ ఇస్తారు. 2024 జులై 15న ప్రారంభమైన ఈ స్కీమ్​ 2024 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ పథకంలో చేరాలని అనుకునేవాళ్లు నేరుగా బ్యాంక్ బ్రాంచ్​కు వెళ్లి ఎఫ్​డీ చేయవచ్చు. లేదా యోనో ఎస్​బీఐ, యోనో లైట్, ఎస్​బీఐ ఇంటర్నెట్​ బ్యాంకింగ్ ద్వారా కూడా ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్​లో చేరిన వారు అత్యవసర పరిస్థితుల్లో ప్రీమెచ్యూర్ విత్​డ్రావెల్ కూడా చేసుకోవచ్చు. కానీ దీని కోసం కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

2. Bank Of Baroda Monsoon Dhamaka Scheme : బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ జులై నెలలో 'మాన్​సూన్​​ ధమాకా' పేరుతో ఒక స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​ను ప్రారంభించింది.

  • 333 రోజుల కాలపరిమితి గల ఈ ఫిక్స్​డ్​ డిపాజిట్​పై సాధారణ డిపాజిటర్లకు 7.15 శాతం; సీనియర్​ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ చెల్లిస్తారు.
  • 399 రోజుల కాలపరిమితి గల ఈ ఫిక్స్​డ్​ డిపాజిట్​పై జనరల్ డిపాజిటర్లకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తారు.
  • నాన్​-కాలబుల్ (ఎలాంటి లాకిన్ పీరియడ్ లేని) డిపాజిట్లకు 7.40 శాతం వడ్డీ రేటు చెల్లిస్తారు.

3. IND Super 400 Days : ఇండియన్ బ్యాంక్​ 'ఐఎన్​డీ సూపర్​ 400 డేస్'​, 'ఐఎన్​డీ సూపర్​ 300 డేస్'​ పేరుతో రెండు ఫిక్స్​డ్ డిపాజిట్ పథకాలను లాంఛ్ చేసింది. 2024 సెప్టెంబర్​ 30 లోపు ఈ ఎఫ్​డీ స్కీమ్​ల్లో చేరవచ్చు.

  • ఐఎన్​డీ సూపర్​ 400 డేస్​ పథకంలో పొదుపు చేసిన సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటు అందిస్తారు.
  • ఐఎన్​డీ సూపర్​ 300 డేస్​ పథకంలో పొదుపు చేసిన సాధారణ ప్రజలకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీ ఇస్తారు.

4. IDBI Bank FD Scheme : ఐడీబీఐ బ్యాంక్​ 'అమృత్ మహోత్సవ్'​ పేరిట ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​ను అందిస్తోంది. 2024 సెప్టెంబర్​ 30 లోపు ఈ స్కీమ్​లో చేరవచ్చు.

  • 375 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ఎఫ్​డీపై సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ అందిస్తుంది.
  • 444 రోజుల కాలపరిమితి గల ఎఫ్​డీపై జనరల్ పబ్లిక్​కు 7.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ ఇస్తోంది.
  • 300 రోజుల ఎఫ్​డీపై సాధారణ డిపాజిట్లరకు 7.05 శాతం, వయోవృద్ధులకు 7.55 శాతం వడ్డీ అందిస్తుంది.

5. RBL Bank Vijay FD Scheme : ఆర్​బీఎల్ బ్యాంక్​ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 500 రోజుల కాలపరిమితితో 'విజయ్​ ఫిక్స్​డ్ డిపాజిట్' పథకాన్ని ప్రవేశపెట్టింది. మిగతా అన్ని బ్యాంకులతో పోల్చితే, ఇది చాలా ఎక్కువ వడ్డీ రేటు ఇస్తోంది. 500 రోజుల కాలపరిమితిగల ఈ ఫిక్స్​డ్ డిపాజిట్​పై సాధారణ డిపాజిటర్లకు 8.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం వడ్డీ లభిస్తుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ Vs రికరింగ్ డిపాజిట్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Fixed Deposit Vs Recurring Deposit

ఫిక్స్‌డ్ డిపాజిట్​ చేయాలా? అయితే ఈ 4 రిస్క్​లు గురించి తెలుసుకోండి! - Risks In Fixed Deposits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.