Best Car For Family : ప్రస్తుత కాలంలో కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! ఎందుకంటే బైక్‌పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రయాణించలేరు. అందుకే తమ బడ్జెట్లో మంచి మైలేజ్, ఫీచర్లు ఉన్న కారు కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రూ.9 లక్షల బడ్జెట్లో ఉన్న 10 మంచి కార్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. Citroen Basalt : సిట్రోయెన్ బసాల్ట్ కారు 6 వేరియంట్లు, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర సుమారుగా రూ.7.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు మంచి మోడ్రన్ లుక్‌లో కనిపిస్తుంది. అలాగే 6 ఎయిర్ బ్యాగులతో లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ : 1199 సీసీ
- మైలేజ్ : 18.7 - 18.75 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 7
2. Maruti Brezza : మారుతి బ్రెజ్జా ఒక కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది మంచి రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. అలాగే విశాలమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. మారుతి బ్రెజ్జా ధర సుమారుగా రూ. 8.34 లక్షలు - రూ.14.14 లక్షల వరకు ఉంటుంది. 15 వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ : 1462 సీసీ
- మైలేజ్ : 17.38- 19.89 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
3. Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 25 వేరియంట్లు, 16 కలర్స్‌లో లభిస్తుంది. దీని ధర రూ.7.49 లక్షలు - రూ.15.49 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి.
- ఇంజిన్ కెపాసిటీ : 1197 సీసీ
- మైలేజ్ : 18.06- 21.2 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, డీజిల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
4. Toyota Urban Cruiser Taisor : ఈ కారు ఆకర్షణీయమైన లుక్‌లో ఉంటుంది. విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, మంచి పెర్ఫార్మెన్స్ను ఇస్తుంది. దీని ధర రూ.7.74 - రూ.13.04 లక్షల వరకు ఉంటుంది. ఇది 12 వేరియంట్లు, 12 కలర్ ఆప్షన్లలలో లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ : 1197 సీసీ
- మైలేజ్ : 18.7- 18.75 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, సీఎన్ జీ
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
5. Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూ రిచ్ లుక్‌లో ఉంటుంది. ఐదు గేర్ బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో నలుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది 25 వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. దీని ధర రూ.7.94 లక్షలు - రూ.13.48 లక్షల వరకు ఉంటుంది.
- ఇంజిన్ కెపాసిటీ : 998 సీసీ
- మైలేజ్ : 17.5- 23.4 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, డీజిల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 4
6. Kia Sonet : ఈ కారు 31 వేరియంట్లు, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ.7.99 లక్షలు - రూ.15.77 లక్షల వరకు ఉంటుంది. ఇదొక స్టైలిష్ కాంపాక్ట్ ఎస్యూవీ. మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ : 998 సీసీ టర్బోఛార్జెడ్
- మైలేజ్ : 17.5- 23.4 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
7. Tata Nexon : టాటా నెక్సాన్ ఆకర్షణీయమైన, విశాలవంతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారు ధర రూ.8 లక్షలు - రూ.15.80 లక్షల వరకు ఉంటుంది. 11 వేరియంట్లు, 6 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ : 1199 సీసీ
- మైలేజ్ : 17.01- 24.08 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, డీజిల్, సీఎన్ జీ
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
8. Honda Amaze : మంచి రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. అలాగే మంచి లుక్‌లో ఉంటుంది. 11 వేరియంట్లు, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హోండా అమేజ్ కారు ధర రూ.7.29 లక్షలు - రూ.10.05 లక్షల వరకు ఉంటుంది.
- ఇంజిన్ : 1199 సీసీ
- మైలేజ్ : 18.3-18.6 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
9. Nissan Magnite : బడ్జెట్లో వెహికల్ కొనాలకునేవారికి నిస్సాన్ మాగ్నెట్ కారు మంచి ఆప్షన్ అవుతుంది. 999 సీసీ ఇంజిన్‌తో ఈ కారు లభిస్తుంది. విశాలమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. ఇది 30 వేరియంట్లు, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ.6 లక్షలు- రూ.11.11 లక్షల వరకు ఉంటుంది.
- ఇంజిన్ : 999 సీసీ
- మైలేజ్ : 17.4-19.7 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
10. Renault Triber : రెనో ట్రైబర్ 8 వేరియంట్లు, 9 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇందులో నాలుగు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దీని ధర రూ.6లక్షలు - రూ.8.98 లక్షల వరకు ఉంటుంది.
- ఇంజిన్ : 999 సీసీ
- మైలేజ్ : 18.2- 19 kmpl
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 7
ట్యాక్సీ/క్యాబ్ బిజినెస్ చేస్తారా? టాప్-10 కమర్షియల్ కార్స్ ఇవే! - Best Commercial Car In 2024