ETV Bharat / business

2024 అక్టోబర్​​ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In October 2024

Bank Holidays In October 2024 : బ్యాంక్​ కస్టమర్లకు ముఖ్య గమనిక​. 2024 అక్టోబర్​ నెలలో ఏకంగా 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ పనులు ఏమైనా ఉంటే, ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడెప్పుడు బ్యాంక్​లకు సెలవులు ఉన్నాయో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Bank Holidays in October 2024
Bank Holidays in October 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 12:32 PM IST

Bank Holidays In October 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) 2024 అక్టోబర్​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది.

List Of Bank Holidays In October 2024
2024 అక్టోబర్ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే!

  • అక్టోబర్ 1 (మంగళవారం) : జమ్మూకశ్మీర్ మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఆ రోజు జమ్ములోని బ్యాంకులు పనిచేయవు.
  • అక్టోబర్ 2 (బుధవారం) : మహాత్మా గాంధీ జయంతి, మహాలయ అమావాస్య సందర్భంగా దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • అక్టోబర్​ 3 (గురువారం) : నవరాత్ర స్థాపన సందర్భంగా రాజస్థాన్​లోని బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్ 6 (ఆదివారం)
  • అక్టోబర్ 10​ (గురువారం) : దుర్గాపూజ/ దసరా పండుగ సందర్భంగా త్రిపుర, అసోం, నాగాలాండ్​, బంగాల్​ రాష్ట్రాల్లోని బ్యాంకులకు హాలీ డే ఉంటుంది.
  • అక్టోబర్ 11 (శుక్రవారం) : దసరా, ఆయుధపూజ, దుర్గాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్ 12​ (రెండో శనివారం)
  • అక్టోబర్ 13 (ఆదివారం)
  • అక్టోబర్​ 14 (సోమవారం) : దుర్గాపూజ (దసైన్​) సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్​ 16 (బుధవారం) : లక్ష్మీపూజ సందర్భంగా త్రిపుర, బంగాల్​ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్ 17​ (గురువారం) : మహర్షి వాల్మీకి జయంతి/ కటి బిహు సందర్భంగా కర్ణాటక, అసోం, హిమాచల్​ప్రదేశ్​లోని బ్యాంకులు పని చేయవు.
  • అక్టోబర్ 20 (ఆదివారం)
  • అక్టోబర్ 26​ (శనివారం) : భారతదేశంలో జమ్మూకశ్మీర్ విలీనం జరిగిన దినం (ఎక్సెషన్​ డే) సందర్భంగా జమ్ము, శ్రీనగర్​లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • అక్టోబర్ 27 (ఆదివారం)
  • అక్టోబర్​ 31 (గురువారం) : దీపావళి/ నరక చతుర్దశి, సర్దార్ వల్లభ్​బాయి పటేల్​ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : అక్టోబర్​​ ​నెలలో 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్​లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.