ETV Bharat / business

అట్టహాసంగా అనంత్​, రాధిక వెడ్డింగ్- అంబానీల పెళ్లికి హాజరైన అతిరథ మహారథులు - Anant Ambani Marriage

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 7:43 PM IST

Updated : Jul 12, 2024, 10:50 PM IST

Anant Ambani Radhika Merchant Marriage : ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం అంగరంగవైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు ఈ పెళ్లివేడుకకు హాజరయ్యారు.

Anant Ambani Radhika Merchant Marriage
Anant Ambani Radhika Merchant Marriage (Getty/ANI/ETV Bharat)

Anant Ambani Radhika Merchant Marriage : రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ వివాహ వేడుక శుక్రవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ వివాహ వేడుకకు దేశవిదేశాల నుంచి రాజకీయ, వివిధ రంగాల అతిరథ మహారథులు తరలివచ్చారు. పలువురు క్రికెటర్లు, బాలీవుడ్‌ అగ్రతారాగణం, అంతర్జాతీయ వ్యాపార, క్రీడా, కళారంగాల ప్రముఖులు వివాహవేదిక వద్దకు చేరుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ జియో వరల్డ్ సెంటర్‌కు వచ్చారు. బిహర్ మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్ కుటుంబంతో సహా ముంబయి వచ్చారు. సూపర్​ స్టార్ రజనీకాంత్​, ఫేమస్​ రెజ్లర్​ జాన్​ సీన, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​ ఓంకారం తీర్చిదిద్దిన వేదిక వద్ద ఫొటోలు తీసుకున్నారు. ముకేశ్‌ అంబానీ తన కుమార్తె, కుమారులు, మనవళ్లతో కలిసి ఇక్కడే ఫొటో తీసుకున్నారు.

ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుకను యావత్‌ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. దేశవిదేశాల వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులతో ముంబయి వీధులు నిండిపోయాయి. ఏడు నెలల ముందునుంచే మొదలైన ఈ వేడుకలో భాగంగా అనంత్‌-రాధికా మర్చంట్‌లు శుక్రవారం ఏడడుగులతో ఒక్కటి ఒక్కటయ్యారు. రాత్రి గంటలకు వరమాల కార్యక్రమం జరిగింది. జూలై 14న మంగళ్‌ ఉత్సవ్‌తో మూడు రోజుల వివాహ వేడుక ముగియనుంది.

అతిరథ మహారథులు
ఈ గ్రాండ్​ వెడ్డింగ్​కు రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్, ఆమె సోదరి ఖోలే, నైజీరియన్ రాపర్ రెమా, యూకే మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్​ జాన్సన్​ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. చమురు దిగ్గజం, సౌదీ అరామ్‌కో సీఈఓ అమీన్ నాసర్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ, ఫార్మా దిగ్గజం GSK పీఎల్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎమ్మా వామ్స్లీ తదితరులు వచ్చారు. అంతేకాకుండా ఈ పెళ్లికి హాజరైన రాజకీయ ప్రముఖుల్లో, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, కాంగ్రెస్‌ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వీ ఉన్నారు. ఇక క్రికెట్​ తారలు సచిన్ తెందూల్కర్​, హార్దిక్​ పాండ్య, జస్​ప్రీత్ బూమ్రా, సుర్యకుమార్​ యాదవ్​, వింటేజ్​ స్టార్​ శ్రీకాంత్ తదితరులు వచ్చారు.

Last Updated : Jul 12, 2024, 10:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.