ETV Bharat / business

'ఆ ప్రాజెక్ట్​ల్లో 100 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తాం' - గౌతమ్ అదానీ - ADANI USD 100 bn INVESTMENT - ADANI USD 100 BN INVESTMENT

Adani Group To Invest USD 100 bn In Energy Transition : ఇంధన పరివర్తన ప్రాజెక్ట్​లు, గ్రీన్ ఎనర్జీ తయారీ యూనిట్లపై 100 బిలియన్​ డాలర్లు మేర పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు.

Adani Group to invest USD 100 bn in energy transition
Gautam Adani (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 1:31 PM IST

Updated : Jun 19, 2024, 3:26 PM IST

Adani Group To Invest USD 100 bn In Energy Transition : ఇంధన పరివర్తన ప్రాజెక్టుల(గ్రీన్ ట్రాన్సిషన్​ ప్రాజెక్టులు)పై 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,34,180 కోట్లు) మేర పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన ప్రతి ప్రధాన భాగాన్ని ఉత్పత్తి చేసే యూనిట్లను దేశంలో నిర్మిస్తామని పేర్కొన్నారు.

సూర్యకాంతి నుంచి విద్యుత్​ ఉత్పత్తి చేయడానికి సోలార్​ పార్క్​లను నిర్మించనున్నట్లు గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. అలాగే పవన క్షేత్రాలు నిర్మించి పవన విద్యుత్​ ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్​, పవన విద్యుత్ టర్బైన్లు​, సౌరఫలకాలను తయారు చేయడానికి ఎలక్ట్రోలైజర్ల అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఎలక్ట్రోలైజర్లను తయారుచేసే మేజర్ ఫెసిలిటీస్​ నిర్మిస్తున్నట్లు అదానీ తెలిపారు.

డీకార్బనైజేషన్​
స్వచ్ఛమైన శక్తితో నడిచే ఎలక్ట్రోలైజర్లు - నీటి నుంచి హైడ్రోజన్​ను విడదీసి గ్రీన్​ హైడ్రోజన్​ను ఉత్పత్తి చేస్తాయి. దీనితో పరిశ్రమలు, రవాణా సాధనాలు డీకార్బనైజ్ అవుతాయి. దీనివల్ల గాలి కాలుష్యం గణనీయంగా తగ్గిపోతుందని గౌతమ్ అదానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

క్రిసిల్ 'ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ - ది క్యాటలిస్ట్​ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్'​ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్​లో పాల్గొన్న అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్ అదానీ, భారతదేశంలో ఇంధన పరివర్తన ప్రాజెక్టులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి ట్రిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని భారతదేశానికి సమకూరుస్తాయని పేర్కొన్నారు.

"మేము ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్​-సైట్​ పునరుత్పాదక ఇంధన పార్క్​ను గుజరాత్​, కచ్​ జిల్లాలోని ఖావడాలో నిర్మిస్తున్నాం. ఇది ఒక్కటే 30 గిగావాట్స్​ పవర్​ను ఉత్పత్తి చేస్తుంది. 2030 నాటికి దీని సామర్థ్యం 50 గిగావాట్లకు చేరుకుంటుంది."
- గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్​.

'ఎనర్జీ ట్రాన్సిషన్ స్పేస్​ గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్​స్కేప్​ను పూర్తిగా మార్చేస్తుంది. ఎలా అంటే, 2023లో గ్లోబల్ ట్రాన్సిషన్ మార్కెట్ విలువ సుమారుగా 3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2030 నాటికి దాదాపు 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2025 వరకు ఇది ప్రతి 10 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది' అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.

'టెంపరరీ కార్ ఇన్సూరెన్స్'తో బోలెడు బెనిఫిట్స్​ - అవేంటో మీకు తెలుసా? - Temporary Car Insurance

ప్రైవేట్​ జాబ్ చేస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే మీకు 'గ్రాట్యుటీ' ఎంత వస్తుందో తెలుసా? - Gratuity Rules

Last Updated : Jun 19, 2024, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.