ETV Bharat / bharat

పప్పు ధాన్యాలతో బీపీ, షుగర్​ సమస్యలకు చెక్​! క్యాన్సర్​ సైతం!! - World Pulses Day significance

World Pulses Day 2024 : ఏటా ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం నిర్వహించుకుంటారు. పప్పు ధాన్యాల్లోని పోషక విలువల గురించి, వాటి వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రత్యేకంగా ఈ పల్సస్​ డేను ఏటా నిర్వహిస్తున్నారు. అందుకే దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

World Pulses Day 2024
Pulses health benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 5:02 AM IST

Updated : Feb 10, 2024, 6:25 AM IST

World Pulses Day 2024 : పప్పు దినుసుల్లోని పోషకాల గురించి, వాటి వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి దీని చరిత్ర, ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా?

పప్పు ధాన్యాలు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ పండుతాయి. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2019 నుంచి ఏటా ఫిబ్రవరి 10న పప్పు ధాన్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ 2024లో 'Pulses : Nourishing Soils and People' అనే థీమ్​తో పప్పు ధాన్యాల దినోత్సవాన్ని జరుపుతోంది.

సమృద్ధిగా పోషకాలు
పప్పుల్లో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. వీటితో కొవ్వు తక్కువగా, ప్రొటీన్​​, ఫైబర్​ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్​ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ పప్పులను తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

రైతులకు ఆర్థిక భద్రత
సాధారణగా పప్పు ధాన్యాలు సాధారణ కరువులు, వాతావరణ సంబంధిత విపత్తులను తట్టుకోగలుగుతాయి. అందువల్ల రైతుల పంటకు భద్రత, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడమే కాదు. వాణిజ్య పంటలుగా విక్రయించవచ్చు కూడా. అందుకే ఇవి రైతులపాలిట వరాలుగా చెప్పుకోవచ్చు.

నేల సారాన్ని పెంచుతాయి
పప్పు ధాన్యాలు లేదా అపరాల్లో నైట్రోజన్​ ఫిక్సింగ్ లక్షణాలు ఉంటాయి. కనుక ఇవి నేల సారాన్ని పెంచుతాయి. ఫలితంగా వ్యవసాయ భూమి ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కనుకనే యూఎన్ ఏటా ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.

పెళ్లికి పప్పు-అన్నం
సాధారణంగా మన బంధువులు కలిసినప్పుడు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్​రా అని అడుగుతుంటాం. అంటే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు?​ అని పరోక్షంగా అడుగుతాం. అంటే పప్పుకు మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఎంత ప్రాముఖ్యం ఉందో, ఇది తెలియజేస్తుంది.

సాధారణంగా మన ఇళ్లల్లో టమాట పప్పు, మామిడికాయ పప్పు, పాలకూర పప్పు, తోటకూర పప్పు, మెంతికూర పప్పు ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రకాల పప్పులతో చేసే వంటకాల జాబితా చాంతాడు ఉంటుంది. తెలుగు వాళ్లు పప్పులను ఏదో ఒక రూపంలో తింటూనే ఉంటారు అనడానికి ఇది తార్కాణం. మరి ఈ పప్పుల్లో ఉండే పోషక విలువలు గురించి, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?

పప్పులు - ఆరోగ్య ప్రయోజనాలు
ఆహారంలో భాగంగా తీసుకునే పప్పు దినుసులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, బఠాణీ లాంటి వాటిల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే వీటిలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. పప్పుల ద్వారా సోడియం కూడా శరీరానికి కొద్ది మొత్తంలో అందుతుంది. దీని వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

సాధారణంగా 100 గ్రాముల పప్పుల ద్వారా సుమారు 25 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. వీటిని వండి తింటే కనీసం 8 గ్రాముల ప్రోటీన్లు మన శరీరానికి అందుతాయి. అయితే వీటిని బియ్యం లేదంటే కొర్రలతో కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. పప్పులను తీసుకోవడం ద్వారా శరీరానికి ఐరన్​ బాగా అందుతుంది. ఫలితంగా రక్తలేమి సమస్యను అధిగమించవచ్చు.

"వివిధ రకాల పప్పులను తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు తగిన మోతాదులో అందుతాయి. ఎలాంటి జబ్బుతో బాధపడుతున్నా పప్పును ఆహారంలో చేర్చుకోవచ్చు. ఆరు నెలల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా పప్పును తినవచ్చు. 100 గ్రాముల పప్పులో 320 గ్రాముల క్యాలరీల నుంచి 340 గ్రాముల క్యాలరీల వరకు శక్తి, 19 గ్రాముల ప్రోటీన్లు, 6 గ్రాముల ఫ్యాట్, బి-కాంప్లెక్స్ విటమిన్లు లభిస్తాయి. పప్పుల ద్వారా అందే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో పేగులు, కండరాలకు ఎంతో మేలు చేకూరుతుంది. పప్పులు తినడం వల్ల రక్తంలో ప్రోటీన్ల శాతం పెరుగుతుంది. సోయాబీన్స్ తీసుకోవడం వల్ల కూడా శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి. పప్పుల్లో కొవ్వు శాతం తక్కువ ఉన్నా అది కూడా ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు ఉంటుంది. 100గ్రాముల సోయాబీన్స్ తీసుకుంటే శరీరానికి 33గ్రాముల ప్రోటీన్లు, 400గ్రాముల క్యాలరీలు, 10గ్రాముల ఫ్యాట్, 10గ్రాముల ఐరన్ పోషకాలు అందుతాయి. మినపపప్పు తీసుకోవడం వల్ల గ్యాస్​ను నివారించే శక్తి శరీరానికి అందుతుంది. అలాగే తిన్న ఆహారం తేలికగానూ జీర్ణమవుతుంది. మినపపప్పును కూరలు, దోసెలు, ఇడ్లీలు, వడల రూపంలో తీసుకోవచ్చు. అనేక రకాల పప్పులను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి వండుకొని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది."
- డా. శ్రీలత, డైటీషియన్

పప్పుల ద్వారా శరీరానికి పొటాషియం అందుతుంది. దీని వల్ల గుండెకు లాభం చేకూరుతుంది. అలాగే పీచు పదార్థాలు శరీరానికి అందించడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అటు పప్పుల ద్వారా అందే విటమిన్- బి వల్ల నరాలు కూడా బలపడతాయి. గర్భవతులకు అవసరమయ్యే ఫోలెట్ విటమిన్​ కూడా పప్పులు తినడం ద్వారా లభిస్తుంది. తక్కువ ఖర్చులో అన్ని రకాల పోషకాలు అందించే పప్పును తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

క్యాన్సర్ నివారణకూ
పప్పులో గ్లైసమిక్స్ ఇండెక్స్ స్థాయి తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది. అంటే పరోక్షంగా షుగర్ పేషంట్లకు పప్పులు మేలు చేస్తాయి. కంది, మినుము పప్పులను తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల నివారణ సాధ్యం అవుతోందని పరిశోధనల్లో తేలింది. అలాగే చర్మ ఆరోగ్యంతో పాటు కాంతివంతంగా కనిపించటంలో పప్పులు కీలక పాత్ర పోషిస్తాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

LIC ఇండెక్స్ ప్లస్​ పాలసీతో డబుల్ బెనిఫిట్స్​ - జీవిత బీమా + సంపద వృద్ధి!

సత్య నాదెళ్ల బంపర్ ఆఫర్- 75 వేల మంది భారతీయ మహిళలకు ట్రైనింగ్

Last Updated : Feb 10, 2024, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.